అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today August 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్, ప్రీతిలను కారు ప్రమాదం నుంచి కాపాడిన విద్యాదేవి.. మహాలక్ష్మీకి పెద్ద షాక్!

Seethe Ramudi Katnam Today Episode రామ్, ప్రీతిల కారు నుంచి మంటలు చెలరేగడంతో విద్యాదేవి ప్రాణాలకు తెగించి ఇద్దరినీ కాపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మధు జలజ మీద సీరియస్ అవుతుంది. సూర్య, తన అన్న అక్కడికి రావడంతో జలజ సూర్యతో మధు తనని తిడుతుందని అంటుంది. దానికి సూర్య ఇంకెప్పుడు మధుతో అలాంటి విషయాలు చెప్పి రెచ్చగొట్టొద్దని అంటాడు. మధుకి సపోర్ట్‌గా మాట్లాడుతాడు. జలజని భర్త కూడా తిడతాడు. అందరూ ఒకటై అయి తనని అంటున్నారని, మధు సూర్యలు కలిసి ఎన్నాళ్లు కాపురం చేస్తారో చూస్తానని జలజ అనుకుంటుంది.

మరోవైపు సీత బాక్స్ రెడీ చేస్తుంటే రామ్ అక్కడికి వచ్చి ఎవరూ చూడకుండా కిచెన్‌లోకి దూరి కిస్, హగ్‌ల పేర్లతో వంటలు చేయమని అంటాడు. ఇక సీతని పట్టుకొని కిస్ చేసుకొని హగ్ చేసుకుంటాడు. ఇంతలో ప్రీతి రావడంతో రామ్ సీత కవర్ చేస్తారు. ప్రీతి వచ్చి నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ అంటుంది. విద్యాదేవి కూడా అక్కడికి వస్తుంది. ఇక ప్రీతి సీతకి తన కోసం బాక్స్ రెడీ చేయమని అంటుంది.

విద్యాదేవి: సీతని పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఏంటి ప్రీతి తను నీకు వదిన అవుతుంది. వదినా అని పిలవాలి కదా.
ప్రీతి: నాకు సీతని పేరు పెట్టి పిలవడమే అలవాటు.
విద్యాదేవి: పేర్లతో పిలిస్తే ఫ్యాషన్‌గా ఉంటుంది కానీ వరసతో పిలిస్తే బాగుంటుంది. అది గౌరవంగా ఉంటుంది.
అర్చన: చూశావా మహా టీచర్ క్లాస్లు మొదలు పెట్టేసింది.
మహాలక్ష్మీ: దానికి నీతులు బోదించడం తప్ప ఇంకేం పని పాటా ఉంది. 
విద్యాదేవి: ఏం ఆలోచిస్తున్నావ్ ప్రీతి సీతని వదినా అని పిలవడానికి మీ పిన్ని పర్మిషన్ కావాలా ఏంటి. అయినా మీ పిన్ని కూడా సీతని కోడలిగా ఒప్పుకుంది కదా. ఇప్పుడు అందరికీ సీత ఇంటి కోడలు అని తెలిసిపోయింది ఇంకా నువ్వు వదిన అని పిలవడానికి అభ్యంతరం ఏముంది.  
రామ్: అవును ప్రీతి టీచర్ మన అమ్మలా చెప్పింది మన అమ్మ ఉన్నా ఇలానే చెప్పేది. 
అర్చన: చూశావా మహా అందరూ నిన్ను సైడ్ చేసి సుమతి అక్కని హైలెట్ చేస్తున్నారు.
మహాలక్ష్మీ: ఎవరు ఎన్ని చేసినా ప్రీతి సీతని వదిన అని పిలవదు
ప్రీతి: సారీ వదినా ఇంకెప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవను వదిన అనే పిలుస్తాను.
సీత: థ్యాంక్యూ మరదలా నీతో వదినా అని పిలిపించుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది టీచర్ వల్ల ఇది సాధ్యమైంది.

టీచర్ అందర్ని తన వైపు తిప్పుకుంటుందని అర్చన అంటుంది. ఇంతలో మహా వాళ్లదగ్గరకు వచ్చి మీ పిలుపులు అయ్యాయా అని రామ్, ప్రీతిలను వెళ్లమంటుంది. విద్యాదేవి రామ్, ప్రీతిల విషయంలో అతిగా ఇన్వాల్స్ అవుతుందని మహా అనుకుంటుంది. ఇక రామ్ ప్రీతిలు బయటకు వెళ్తారు. ఇంతలో కారు నుంచి పొగలు వస్తాయి. కారు ఆగిపోతుంది. ప్రీతి, రామ్‌లు కందకి దిగాలని ప్రయత్నించినా డోర్ లాక్ అయిపోతుంది. ఇద్దరూ పొగకు ఇబ్బంది పడతారు. సాంబ అది చూసి డోర్ తీయడానికి ప్రయత్నించి తీయలేకపోతాడు. ఇక సాంబ పరుగున ఇంట్లోకి వెళ్తాడు. మరోవైపు కారుకి మంట అంటుకుంటుంది. సాంబ ఇంట్లో వాళ్లకి విషయం చెప్తాడు. మహా, అర్చనలు పరుగున వస్తారు. ఏం చేయలేక మహా ఏడుస్తుంది. కాపాడండి అని మహా అరుస్తుంది సీత వస్తుంది. సీత కూడా ఏం చేయలేకపోతుంది. ఇంతలో విద్యాదేవి వచ్చి సీతని పక్కకి తోసేసి పూలకుండీ తీసుకొచ్చి దాంతో అద్దం పగలగొడుతుంది. లాక్ తీసి రామ్, ప్రీతిలను కాపాడుతుంది. ఇద్దరూ బయటకు వస్తారు. లోపలికి తీసుకెళ్తారు. ఇద్దరికీ సీత, విద్యాదేవిలు  సపర్యలు చేస్తారు. నీ వల్లే బతికాం అని ఇద్దరూ విద్యాదేవికి కృతజ్ఞతలు చెప్తారు. 

ప్రీతి:  మహాలక్ష్మీని చూస్తూ.. మీరు కాబట్టి కాపాడారు టీచర్ మిగతా వాళ్లు అయితే అలా చూస్తూ ఉండిపోతారు.
విద్యాదేవి:  అలా ఏం లేదు ప్రీతి ఎవరైనా కాపాడాలనే చూస్తారు. అందరికీ మిమల్ని కాపాడాలనే ఉంటుంది. నేను ఇంకా మిమల్ని మీ పిన్ని కాపాడుతుంది అనుకున్నా. నువ్వు ప్రీతి చిన్నప్పుడు మీ పిన్నే కదా ధైర్యంగా మంటల నుంచి మిమల్ని కాపాడింది.
ప్రీతి: అవును టీచర్. 
విద్యాదేవి: మరి ఆరోజు ధైర్యం ఈ రోజు ఏమైంది.
అర్చన: టీచర్ నిన్న బ్యాడ్ చేస్తుంది మహా.
మహాలక్ష్మీ: నేను వెళ్లాలనే లోపు నువ్వు వెళ్లావ్ అయినా ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి నీకు ఎలా తెలుసు అప్పుడు నేను జనా పిల్లలే ఉన్నాం ఆ రోజు అక్కడ నువ్వు ఉన్నట్లు చెప్తున్నావ్ ఏంటి.
రామ్: చెప్పమ్మా మాకు మాత్రం తెలిసిన విషయం మీకు ఎలా తెలుసు. 
విద్యాదేవి: అవును నాకు శివకృష్ణ గారు చెప్పారు ఆయనకు సుమతి చెప్పిందట.
మహాలక్ష్మీ: సుమతి ఆయనకు చెప్పొచ్చు కానీ ఆయన మీకు ఎందుకు చెప్పారు. 
సీత: ఆరోజు ధైర్యం చేసిన మీరు ఈ రోజు ఎందుకు చేయలేదు. రామ్ మామ, ప్రీతిలను కాపాడటంలో మీరు ముందుండాలి కదా. ఇప్పుడు టెన్షన్తో వెనకడుగు వేశారు ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు నిజంగా కాపాడావా లేక..

తమకి ఏం కాలేదు కదా వదిలేయ్ మని రామ్ అంటాడు. ఇక మహాలక్ష్మి మీరు నా ప్రాణం మీకు ఏమైనా అయితే నేను చూస్తూ ఉంటానా అని ఇద్దరిని ఎక్కడికీ వెళ్లొద్దని రెస్ట్ తీసుకోని అంటుంది. ఇద్దరూ వెళ్లిపోతారు. మహా విద్యాదేవికి థ్యాంక్స్ చెప్తుంది. ఇక సీత విద్యాదేవి ఇద్దరినీ అంతలా తెగించి కాపాడాల్సిన అవసరం ఏంటి అనుకుంటుంది. ఇక విద్యాదేవి ఇది ప్రమాదమా లేక పొరపాటున జరిగిందా అని అనుకుంటుంది. రామ్ ప్రీతిలను చంపించేంత సాహసం మహాలక్ష్మీ చేయదని అనుకుంటుంది. సీత విద్యాదేవి దగ్గరకు వస్తుంది. ఇద్దరూ ప్రమాదం గురించి మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: రేపే కనకం, విహారిలకు పెళ్లి.. ప్రకాశ్ కుట్ర విహారి కనిపెట్టగలడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget