అన్వేషించండి

Seethe Ramudi Katnam August 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి, జనార్థన్‌లకు అఫైర్ రచ్చ.. ఇంటి నుంచి వెళ్లిపోతున్న టీచర్, మహా ప్లాన్ సక్సెస్!

Seethe Ramudi Katnam Today Episode జనార్థన్‌కి విద్యాదేవికి ఎఫైర్ ఉందని వీధిలో వాళ్ల అనడంతో మహా గొడవ చేయడం జనా విద్యాని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి ఆరుబయట కూర్చొంటే వీధిలో వాళ్లు ఆమెను చూపిస్తూ జనార్థన్ ఆమెను ఉంచుకున్నాడని అందుకే ఇంట్లో ఉంటుందని మాట్లాడుతారు. ఇంట్లో అందమైన మహాలక్ష్మి గారు ఉంటే జనార్థన్‌కి ఇదేం బుద్ధి అని అంటారు ఆ మాటలకు విద్యాదేవి కోపంగా వాళ్ల దగ్గరకు వస్తుంది.

విద్యాదేవి: ఏం కూశావురా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావ్. 
మహిళ: చూడ్డానికి బాగానే ఉన్నావ్ కదా కష్టపడి పని చేయొచ్చు కదా మహాలక్ష్మి గారి కాపురం పాడు చేయడానికి బుద్ధి లేదా. చూస్తే తెలీడం లేదా మొగుడిని వదిలేసి పరాయి మగాడి కోసం వచ్చినట్లు ఉంది.
విద్యాదేవి: ఆ మాట అన్న మహిళ చెంప వాయిస్తుంది విద్యాదేవి. ఇంకో మాట అన్నావో చంపేస్తా.
మహాలక్ష్మీ: ఏం జరిగింది..
విద్యాదేవి: ఏం లేదు మీరంతా లోపలకి వెళ్లండి.
మరోవ్యక్తి: వెళ్లండి మీరు వెళ్లి తలుపులు వేసుకొని మీ పరువు దాచుకోండి.

ఏం మాట్లాడుతున్నారని రామ్, జనార్థన్ అడిగితే విద్యాదేవి, జనార్థన్ మధ్య అక్రమ సంబంధం ఉందని అందరూ అంటున్నారని అంటారు. సీత కూడా ఆ మాటలు వింటుంది. ధనవంతులు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారని డబ్బు సంపాదిస్తే సరిపోదు కాస్త గౌరవం మర్యాద పరువు అన్నీ ఉండాలని అనేసి వెళ్లిపోతారు. ఇదంతా మహా ప్లాన్ కావడంతో మహా అర్చనలు చేతులు కలుపి మన పని ఇక మొదలు పెడదాం అని మహాలక్ష్మీ నాటకం మొదలు పెడుతుంది.

మహాలక్ష్మీ: అయ్యో జనా ఏంటి ఇది శ్రీరాముడి లాంటి నీపై ఇలా బ్యాడ్ రూమర్సా. కాలనీ వాళ్లు నీ గురించి ఇంత చీప్‌గా మాట్లాడుతున్నారా నేను తట్టుకోలేకపోతున్నా.
అర్చన: ఇలాంటి ప్రమాదం జరుగుతుందని నేను ముందే ఊహించా మహా, అయినా బావగారిని అంత మాట అంటారా.
మహాలక్ష్మీ: తప్పు మన వైపు పెట్టుకొని వాళ్ల నోరు మూయించాల్సిన పనేముంది అర్చన.
జనార్థన్: ఏం మాట్లాడుతున్నావ్ మహా నేను తప్పు చేశా అని నువ్వు అంటున్నావా.
మహాలక్ష్మీ: నువ్వు తప్పు చేశావని అనడం లేదు జనా ఈ విద్యాదేవి వల్ల నింద నీ మీద పడింది.
అర్చన: ఈవిడ మన ఇంట్లో ఉండటం వల్లే అందరూ ఇలా అనుకుంటున్నారు.
గిరిధర్: అవును అన్నయ్య ఈవిడ ఇంకా కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటే ఈవీధిలో వాళ్లే కాదు ఊరు మొత్తం ఇదే మాట అంటారు.
మహాలక్ష్మీ: ఈ మాట ప్రెస్‌కి తెలిస్తే బ్రేకింగ్ న్యూస్ వేస్తారు జనా.
అర్చన: అప్పుడు మన మీద అందరూ ఉమ్మేస్తారు బావగారు.
రామ్: ఆవిడ నా ప్రాణాలు కాపాడారు.
మహాలక్ష్మీ:  నువ్వు మాట్లాడకు రామ్. ఇది మన పరువుకి సంబంధించిన విషయం.
సీత: మా టీచర్ వల్ల మీ పరువు పోయిందా దీనంతటికి కారణం ఎవరో తేల్చుతా.
మహాలక్ష్మీ:  ఆగు అక్కడే ఉండు. నువ్వు గేట్ దాటి లోపలికి రాకూడదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీకు డ్యాన్స్ నేర్పడానికి వచ్చి మా నెత్తి మీద కూర్చొంది. నా జనాని అపవిత్రం చేసింది.
రామ్: టీచర్‌ని అలా అనకండి టీచర్.
మహాలక్ష్మీ:  ఇందులో నీకు భాగం ఉంది రామ్, ఆవిడ వెళ్లిపోతే వదిలేయకుండా సీతతో కలిసి మళ్లీ తీసుకొచ్చావ్ ఇప్పుడు మీ నాన్న పరువు ఏం కావాలి.

విద్యాదేవి వాళ్ల మాటలకు బాధ పడి లోపలికి వెళ్తుంది. ఇక మహా విద్యాదేవిని పంపించేయమని చెప్తుంది. జనార్థన్ విద్యాదేవి దగ్గరకు వచ్చి మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటి మాటలు మనల్ని ఇబ్బంది పెడతాయని తన జీవితంలో సుమతి, మహా ఇద్దరు స్త్రీలకు మాత్రమే చోటు ఉందని అంటాడు. దాంతో విద్యాదేవి మనసులో మీరు ఎంత మంచివారు అండీ నేను మీ సుమతినే కానీ చెప్పుకోలేకపోతున్నా అని ఏడుస్తుంది. దయచేసి మీరు మా ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని చెప్తాడు. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అంటే మీరు వెళ్లిపోక తప్పదు అని అంటాడు. చాటుగా మహా, అర్చన జనా, విద్యాల మాటలు విని నవ్వుకుంటారు. ఇక జనార్థన్ పక్కింట్లో సీత ఇంట్లో కూడా ఉండొద్దని అర్థం చేసుకోమని చెప్తాడు.

తమ ప్లాన్ సక్సెస్ అయిందని అర్చన, మహా సంతోషపడతారు. ఇక నిజంగానే ఎఫైర్ ఉంటే ఏం చేస్తావ్ అని అర్చన అడిగితే చంపేస్తానని మహాలక్ష్మీ అంటుంది. మరోవైపు సీత తన తల్లిదండ్రులతో విద్యాదేవికి జరిగిన అవమానం గురించి చెప్తుంది. సుమతి లేని లోటు విద్యాదేవి టీచర్ వల్ల తొలగిపోయిందని, ఆవిడ విషయంలో రామ్‌ ఏమైనా సాయం చేస్తాడేమో అడగమని సీతకి శివకృష్ణ చెప్తాడు. సీత రామ్‌కి కాల్ చేస్తుంది. విద్యాదేవి టీచర్ గురించి ఏమైనా చేయమని సీత అంటే రామ్ తన వల్ల కాదని తన తండ్రికి ప్రాబ్లమ్ వస్తుందని అంటాడు. ఇక సీత అంతా మహాలక్ష్మీనే చేసిందని అంటే రామ్ సీత మీద ఫైర్ అవుతాడు.  

మరోవైపు రేవతికి రోడ్డు మీద ఇద్దరూ వ్యక్తులు కలిసి మాట్లాడుతారు. తన కొడుకు అమెరికాలో గ్రీన్‌ కార్డ్ హోల్డర్ అని బాగా సంపాదించాడని త్వరలో పోటీలో పాల్గొంటాడని చెప్తారు. ఇక నిన్ను మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని మహాలక్ష్మీ అంటుందని చెప్తుంది. ఇంతలో కిరణ్ రావడంతో రేవతి కిరణ్ చేయి పట్టుకొని ప్రేమించుకుంటున్నాం అని నెలలో పెళ్లి చేసుకుంటామని అంటుంది. ఇక విద్యాదేవి తన ఫొటో దగ్గర నిల్చొని తన భర్తతోనే నింద రావడంతో బాధపడుతుంది. రామ్ సీతలకు ఒకటి చేసి ప్రీతి పెళ్లి అయిన వరకు ఉండాలని అనుకుంటే ఇలా జరిగిందని బాధ పడుతుంది. తానే సుమతి అని చెప్పినా మహా బతకనివ్వదని రామ్, ప్రీతి, జనార్థన్‌లు తనని పూర్తిగా నమ్మితే చెప్తానని అనుకుంటుంది. తాను ఇంటి నుంచి వెళ్లక తప్పదని సీతే ఇక ఇంటిని చూసుకోవాలని విద్యాదేవి అనుకుంటుంది. ఇక సీత టీచర్‌ని ఎలా అయినా ఆపాలని అనుకుంటుంది. ఇక విద్యాదేవిని తన ఇంటికి పంపిద్దామని శివకృష్ణ అంటాడు. విద్యాదేవి తన బ్యాగ్ తీసుకొని వస్తుంది. అందరూ ధీనంగా చూస్తారు. ఇక విద్యాదేవి జనార్థన్ దగ్గరకు వచ్చి నాకు మీ పరువే ముఖ్యం వెళ్లిపోతున్నా అని చెప్తుంది. ఇక రామ్ ఏం చేయలేకపోతున్నాను సారీ అంటాడు.. ఇక విద్యాదేవి సీతని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. ప్రీతి కూడా డల్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని విడాకులు అడిగిన దీప.. కార్తీక్ ఎమోషనల్ స్పీచ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
Prakash Raj: 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Embed widget