అన్వేషించండి

Seethe Ramudi Katnam serial Today April 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పనివాడి మీద అర్చన ప్రతాపం, కొరడాతో చితక్కొట్టిన భార్యభర్తలు.. సీత ఆట షురూ!

Seethe Ramudi Katnam serial Today Episode మధుమితకు నిద్రమాత్రలు ఇచ్చినందుకు సాంబను కొరడాతో అర్చన కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode  మహాలక్ష్మి, జనార్థన్ ఇంటికి వస్తారు. వాళ్లని చూసిన రేవతి చలపతితో హాస్పిటల్‌కి వెళ్లకుండా ఇంటికి వచ్చారేంటో అని అంటుంది. దీంతో చలపతి మధుని తీసుకొని అందరూ ఇంటికి వస్తున్నారు అని రామ్ కాల్ చేసి చెప్పాడని అంటాడు. ఇంతలో మధుమిత వాళ్లు వస్తారు. ప్రీతిని దిష్టి తీసుకురమ్మని చెప్పిన మహాలక్ష్మి తనే స్వయంగా దిష్టి తీస్తుంది.

రేవతి: ఇప్పుడెలా ఉంది మధు.. ఒంట్లో ఏ సమస్య లేదు కదా..
చలపతి: చచ్చి బతికొచ్చావ్ అమ్మ. అసలు చావాలి అన్న ఆలోచిన ఎందుకు వచ్చింది. 
మహాలక్ష్మి: నేను ఇంటి దగ్గర లేను కాబట్టి మధు అలాంటి పని చేసింది. ఎవరో కావాలనే మధుని సూసైడ్ చేసుకునేలా చేశారు. ఇకపై అలా జరిగితే నేను సహించను. ఇంట్లో మధుని ఎవరూ ఏమీ అనడానికి వీళ్లేదు. చూడు మధు చావాలి అన్న ఆలోచన చాలా చెడ్డది. మనం ఎప్పుడు జీవితంలోకి సంతోషాల్ని ఆహ్వానించాలి కానీ చావును కాదు. నీకు సమస్య వచ్చినా నేను సాల్వ్ చేస్తా నాతో చెప్పు. నిన్ను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. వెళ్లి రెస్ట్ తీసుకో.. మధుమిత నా మనిషి ఇంట్లో ఎవరి తనని బాధ పెట్టినా ఊరుకోను. తను ఈ మహాలక్ష్మి మనిషి.
సీత: మా అక్క ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మీరు. 
మహాలక్ష్మి: నేను మీ అక్కని కాపాడటానికి తీసుకొచ్చా. నీలా సూటి పోటి మాటలు అనుకోలేదు. 
సీత: కాటు వేసింది మీరే మందు రాస్తుంది మీరు. మీరు పచ్చటి కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోలేని దాన్ని కాదు.
రామ్: ఆపు సీత.. ఇప్పుడు మీ మధు అక్క చావు నుంచి బయట పడింది. మా పిన్ని జర్నీ చేసి వచ్చారు. రాగానే ఈ గొడవ ఏంటి. అయినా మధు వచ్చింది మన ఇంటికి దిక్కు లేని చోటుకు కాదు. మీరు కూడా పిన్నితో గొడవ పడకండి అత్తయ్య. అసలు ఎవరు కూడా పిన్నితో గొడవ పడొద్దు. 

మరోవైపు ఫ్లాష్‌బ్యాక్‌లో సుమతి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంది. శివకృష్ణకు తన భర్త గురించి చెప్తుంది. అనుమతి ఇస్తే తన భర్తను ఇంటికి తీసుకొని వస్తాను అంటుంది. దీంతో శివకృష్ణ సుమతిని తిడతాడు. ఇంట్లో కూడా స్థానం లేదు అని చెప్తాడు. శివ తల్లి, లలిత సుమతిని క్షమించమని ఎంత చెప్పినా శివకృష్ణ వినకుండా తిట్టి పంపేస్తాడు. ఆ రోజు సుమతితో మీరు బంధం తెంచుకుంటే ఈ రోజు మధు మనతో బంధం తెంచుకుంది అని లలిత చెప్పుకొని బాధ పడుతుంది. ఆ సుమతిని క్షమించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు లలిత బాధ పడుతుంది. 

మరోవైపు మహాలక్ష్మి అర్చన  చెంప పగలగొట్టి ఇద్దరినీ తిడుతుంది. మధు చనిపోయి ఉంటే నేను చావాల్సి ఉండేదని తిడుతుంది. మధుమితకు ఏదో గట్టి దెబ్బ తగిలి ఉంటుందని లేదంటే మధు ఇంత పని చేయదని మహా అంటుంది. ఇకపై అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఇక అర్చన మధుకి నిద్ర మాత్రలు తెచ్చి ఇచ్చిన సాంబని కొట్టడానికి కొరడా తీసుకొని వస్తుంది. సాంబని పిలిపించి సాంబని కొడుతుంది. గిరిధర్, ప్రీతి కూడా సాంబని కొడతారు. సీత వాళ్లు చూసి బాధ పడతారు. చలపతి అడ్డుకుంటే వాళ్లతో వాగ్వాదానికి దిగుతారు. ఇంతలో మధు అక్కడికి వస్తుంది. సీత కూడా వచ్చి సాంబకు నిద్ర మాత్రలు తెమ్మన్న మధుని కొట్టమని అంటుంది. మధు సాంబని ఏమీ అనొద్దు అంటుంది. కవర్ చేయడానికి అర్చన ఆట అని అబద్ధం చెప్తుంది. సీత ఆట నాకు నచ్చింది నేను ఆడుతాను అని కొరడా తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఒక్కదెబ్బతో అన్నదమ్ములను కలిపేసిన మీరా.. మళ్లీ ముకుంద ప్రేమలో ఆదర్శ్‌.. అంతేనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Bill TDP: వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
TG TET 2024: తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
Raashii Khanna : స్టన్నింగ్ లుక్స్​లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
స్టన్నింగ్ లుక్స్​లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జలపాతంలో కలెక్టర్, సామాన్యుడిలా ఎంజాయ్!ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Bill TDP: వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
TG TET 2024: తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
Raashii Khanna : స్టన్నింగ్ లుక్స్​లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
స్టన్నింగ్ లుక్స్​లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో బస్‌ పడి 28 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో బస్‌ పడి 28 మంది మృతి
Embed widget