Seethe Ramudi Katnam Serial Today April 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అర్చనను నిలదీసిన రామ్.. మహాలక్ష్మీ పేరు చెప్పేస్తుందా.. ఇంటి నుంచి వెళ్లేదెవరు?
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ అర్చన తన పేరు చెప్పకుండా అర్చనను కొట్టి ఇంటి నుంచి గెంటేస్తానని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన నాగుతో కలిసి సీతని చంపాలని చూసిందని రామ్ తెలుసుకొని సీతని తీసుకొని ఇంటికి వెళ్తాడు. రామ్ రాక కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రామ్ వచ్చి సంతకం పెడతారని అర్చన చాలా ఆత్రుతగా ఉంటుంది. ఇంతలో రామ్ సీతని తీసుకొని ఇంటికి వస్తారు. అందరూ సీతని చూసి షాక్ అయిపోతారు.
ఆస్తి పేపర్లు చింపేసిన రామ్..
సీతని ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడని మహాలక్ష్మీ మనసులో అనుకుంటుంది. జనార్థన్ రామ్‌తో సీతని తీసుకొచ్చావేంటి రామ్ అని అడుగుతాడు. మహాలక్ష్మీ కూడా రామ్ సీత కోసం వెళ్లడం ఏంటి సీతని తీసుకురావడం ఏంటి అని అంటుంది. ఇక మహాలక్ష్మీ త్వరగా సంతకం పెట్టమని రామ్‌తో చెప్తుంది. రామ్ సీరియస్‌గా వెళ్లి డాక్యుమెంట్లు చింపేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఎందుకు ఇలా చేశావ్ రామ్ అని జనార్థన్ అడిగితే రామ్ ఆడిటర్, లాయర్‌ళ్లకు ఇంత సేపు వెయిట్ చేయించినందకు సారీ నా ఆస్తిలో ఎవరికీ వాటా లేదని చెప్తాడు.
మీ ఫోన్ స్విఛ్ ఆన్ చేయండి పిన్ని..
అర్చనకు వాటా ఇస్తానని ఇప్పుడు ఇలా చేశావ్ ఏంటి రామ్ అని జనా ప్రశ్నిస్తే సీత వల్లే అని మహాలక్ష్మీ అంటుంది. సీత తన గురించి రామ్‌కి చెడుగా చెప్పుంటుందని అర్చన అంటుంది. గిరి కూడా సీత మనకు మంచి చేయనివ్వదు అని అంటే రామ్ సీతని ఏం అనొద్దని అంటాడు. అర్చన పిన్ని చేసిన పని తెలిసిన తర్వాత నా మనసు మార్చుకున్నానని అంటాడు. నేనేం చేశాను అని అర్చన అడిగితే ఫోన్ స్విఛ్ ఆన్ చేయండి పిన్ని అని రామ్ చెప్తాడు. అర్చన ఫోన్ ఆన్ చేసిన తర్వాత రామ్ నాగు ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఎవరు కాల్ చేస్తున్నారని మహాలక్ష్మీ అడిగితే నాగు అని రామ్ చెప్తాడు. నాగు ఎవరు అని జనా అడిగితే నన్ను కిడ్నాప్ చేసిన వాడు మామయ్య అని సీత చెప్తుంది. సీతని కిడ్నాప్ చేయమని నాగుతో చెప్పింది అర్చన పిన్ని అని రామ్ చెప్తే అందరూ షాక్ అయిపోతారు.
అర్చన గొంతు పట్టి కొట్టిన మహా..
అర్చన నాగుతో కలిసి సీతని కిడ్నాప్ చేయించిందని డబ్బు ఇచ్చిందని రామ్, సీతలు ఫోన్ కాల్‌లో విన్నది మొత్తం చెప్తారు. జనార్థన్ అర్చనని ఇది నిజమా అని అడుగుతాడు. అర్చన నిజం చెప్పబోతే మహాలక్ష్మీ తన పేరు చెప్పేస్తుందేమో అని భయంతో అర్చనను కొడుతుంది. గొంతు పట్టుకొని ఆడదానివేనా సాటి ఆడదాని పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తావా అని తన పేరు బయట పెట్టొద్దని బతిమాలు తుంది. దాంతో అర్చన సెలెంట్ అయిపోతుంది. సీతని సపోర్ట్ చేస్తూ అర్చనని అందరి ముందు తిడుతుంది. గిరి కూడా అర్చనను తిడతాడు.
నేను మిమల్ని చాలా నమ్మాను పిన్ని..
నేను మిమల్ని చాలా నమ్మాను పిన్ని. మా పిన్ని తర్వాత మిమల్ని అంతలా చూశాను. ఉషని నా సొంత చెల్లిలా చూశాను. మీరు బాబాయ్ అందరూ బాగుండాలి అని అనుకున్నాను. అలాంటి నన్ను ఎందుకు మోసం చేశావు పిన్ని. నా బాధ చూసి కూడా ఏం అనిపించలేదా.
కట్టుబట్టలతో పంపేద్దాం..
రామ్ తన బాధ చెప్తుంటే మహాలక్ష్మీ ఆపి వీళ్లని కట్టు బట్టలతో ఇంటి నుంచి పంపేయాలని అంటుంది. చలపతి కూడా పంపేయాలని అంటాడు. మహాలక్ష్మీ గౌతమ్‌కి చెప్పి బ్యాగ్‌లు తీసుకురమ్మని చెప్తుంది. గౌతమ్ మీదకు వెళ్తాడు. ఇక మహాలక్ష్మీ గిరికి సైగ చేస్తుంది. దాంతో గిరి రామ్‌కి సారీ చెప్తాడు. అర్చన కూడా ఏడుస్తూ సారీ చెప్తుంది. మహాలక్ష్మీ సారీ ఏం వద్దు మీరు వెళ్లిపోండి అంటుంది. మళ్లీ ఇద్దరికీ సైగ చేసి జనార్థన్‌ని బతిమాలమని చెప్తుంది. గిరి, అర్చనలు జనార్థన్ కాలు పట్టుకొని మనల్ని క్షమించని చెప్పు అన్నయ్య. ఈ ఇంట్లో తప్ప మరెక్కడా ఉండలేమని చెప్తారు.
నీ నిర్ణయమే ఫైనల్ సీత..
రామ్‌తో ఏం చేద్దామని జనార్థన్ అడిగితే సీత నిర్ణయమే ఫైనల్ అని రామ్ అంటాడు. పోలీసులకు పట్టించమని చలపతి సీతతో చెప్తే క్షమించమంటున్నారు కదా బాబాయ్ క్షమించేద్దాం అని అంటుంది. సీత చెప్పింది కాబట్టి మిమల్ని వదిలేస్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని రామ్ అంటాడు. సీతకు అర్చన థ్యాంక్స్ చెప్తే అసలు ముద్దాయి తప్పించుకుంది మిమల్ని శిక్షించి ఏం లాభం అని అనుకుంటుంది.
అత్తయ్య మీద నేను కుట్ర చేయలేదు..
రామ్‌ని సీత పక్కకు తీసుకెళ్లి మహాలక్ష్మీ అత్తయ్యని నేను హత్య చేయాలని చూడలేదని అంటుంది. మహాలక్ష్మీ వచ్చి అర్చన విషయంలో నిరూపించావని అందరి విషయంలో అదే జరుగుతుందని అంటావా సీత అని అడుగుతుంది. అందరి వేలి ముద్రలు తీసుకున్నావ్ ఏమైంది ఏమైనా తేలిందా.. నువ్వు చెప్పిన ప్రతీ దానిలో నీదే కరెక్ట్ అని రామ్‌ని నమ్మించకు అని చెప్తుంది. రామ్ కూడా ఆధారాలతో నిరూపించుకోమని చెప్తాడు. సీత సరే అంటుంది. నిరూపించుకొని ఈ ఇంట్లో కాలు పెడతానని వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?





















