Seethe Ramudi Katnam Serial Today April 19th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాని తన గదికి వెళ్లకుండా లాక్ వేసి చాప దిండు ఇచ్చిన గడసరి కోడలు.. ఉక్కిరిబిక్కిరైన జనార్థన్!
Seethe Ramudi Katnam Serial Today Episode సీత గదిలోకి మధుమితని పంపించిన మహాకు బుద్ధి చెప్పడానికి సీత మహాలక్ష్మి గదికి తాళం వేసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode రామ్, మధుమితలను కావాలనే ఒకే గదిలో ఉంచానని మహాలక్ష్మి సీతతో అంటుంది. సీత షాక్ అయిపోతుంది. రామ్, మధులకు కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందని.. నువ్వు ఆ గదిలోకి వెళ్లలేవని సీతను కావాలని రెచ్చగొడుతుంది. రాత్రంతా గది బయట కాపలా కాయడం ఎందుకు కని నువ్వు ఓ పని చేయ్ అని సీతని బయటకు తీసుకెళ్లి సోఫాలో పడుకో అని అంటుంది. సీత ఏం మాట్లాడలేకపోతుంది. ఇక రామ్, మధులకు కూడా ఆల్‌ది బెస్ట్ చెప్పి వస్తాను అని మీదకు మహా వెళ్తుంది.
సీత: ఎంత చెత్త ప్లాన్ వేశావ్ అత్త నీ పని చెప్తాను..
మహాలక్ష్మి: రామ్ ఆల్ ఓకే కదా..
రామ్: ఓకే పిన్ని మార్నింగ్‌కల్లా చేసేస్తా..
మధు: నాకు ఏం ప్రాబ్లమ్ లేదు అండీ ఇలా వర్క్ చేయడం నాకు కూడా ఇష్టమే.
రామ్: మధు గారు చాలా షార్ప్ పిన్ని చాలా తొందరగా నేర్చేసుకుంటున్నారు.
మహాలక్ష్మి: నాకు తెలుసు రామ్. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంటే అది మీరిద్దరూ పని పిచ్చోళ్లని అంటున్నా.
మధు: నేను ఏమో కానీ రామ్ గారు చాలా కష్టపడతారు.
మహాలక్ష్మి: అందుకే రామ్‌ని నిన్ను ట్రైన్ చేయమని చెప్తా. మొహమాట పడకుండా అన్నీ అడుగి నేర్చుకో. ఇద్దరూ నైట్ అంతా కష్టపడి వర్క్ ఫినీష్ చేయండి. నిద్ర వస్తే కాఫీ, టీలు తాగండి..
నాతోనే పెట్టుకుంటావా సీత నీకు నిద్ర పట్టకుండా చేశాను చూడు.
మరోవైపు మహ తన గదికి వెళ్తే లాక్ వేసి ఉంటుంది. జనార్థన్‌ని పిలిచి డోర్ తీయమంటే నేను లాక్ వేయలేదు అని జనార్థన్ చెప్తాడు. మహాలక్ష్మి, జనార్థన్ ఇద్దరూ డోర్ పట్టుకొని లాగుతారు అయినా రాదు. బయట నుంచి ఎవరో లాక్ చేసుంటారు అనగానే మహా ఇదంతా ఆ సీత పని అని అనుకుంటుంది. సీత దగ్గరకు వస్తుంది. సీత సోఫాలో పడుకొని ఉంటుంది. సీతని మహా నిద్ర లేపుతుంది.
మహాలక్ష్మి: దొంగ నిద్రలు నటించింది చాలు కీస్ ఇవ్వు.
సీత: కిస్ ఆ.. నేను మీకు ముద్దు పెట్టడం ఏంటి అత్తయ్య చీ పాడు..
మహాలక్ష్మి: కిస్ కాదే కీస్.. తాళాలు.. మా రూమ్ లాక్ చేశావు. జనా లోపల ఉన్నాడు. నువ్వు బయట డోర్ వేసి లాక్ చేశావు. మర్యాదగా తాళాలు ఇవ్వు.
జనార్థన్: హడావుడికి తన ట్యాబ్లెట్స్ కోసం వెతుకుతాడు..
సీత: ఈ తాళాలేనా అత్తయ్య..
మహాలక్ష్మి: ఇవే ఇవ్వు..
సీత: సారీ అత్తయ్య ఇవ్వను.
మహాలక్ష్మి: ఏంటే నీ పొగరు. నాతోనే ఆడుకుంటావా..
సీత: మరి మీరు నాతో ఆడుకోలేదా. నా భర్త గదిలోకే నాకు వెళ్లకుండా చేశారు. అందుకే మీ గదిలోకి మీ ఎంట్రీ లేకుండా చేశాను. (మరోవైపు జనార్థన్ ట్యాబ్లెట్స్ లేక ఆయాస పడుతుంటాడు.) ఏంటి అత్తయ్య షాక్ అయ్యారా.. నేను ఇలా చేస్తాను అని మీరు ఎక్సపెక్ట్ చేయలేదు కదా ఇప్పుడేం చేస్తారు. సరే ఓ పని చేయండి. ఈ రాత్రికి ఇక్కడే ఈ చాప దిండుతో సర్దుకోండి. రేపు తెల్లారగానే తాళాలు ఇస్తాను.
జనార్థన్: జానార్థన్ గుండె పట్టుకొని ఆయాస పడతాడు. ట్యాబ్లెట్స్ బయట పెట్టినట్లు ఉన్నాను. మహా కీస్ తెస్తాను అని ఇంకా రాలేదు ఏంటి.
మహాలక్ష్మి: నీకు ఎంత ధైర్యమే..
సీత: ఇది మీ భాషలో టిట్ ఫర్ టాట్ మా భాషలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
మహాలక్ష్మి: నన్ను ఇరిటేట్ చేయకు సీత మర్యాదగా ట్యాబ్లెట్స్ ఇవ్వు.
జనార్థన్: మహా నా ట్యాబ్లెట్స్ బయట ఉన్నట్లున్నాయి మహా త్వరగా డోర్ తీయ్.
సీత: మామ మిమల్ని పిలుస్తున్నట్లున్నారు.
మహాలక్ష్మి: ఆయన డోర్ తెరవమంటున్నారు. నువ్వు తాళాలు ఇవ్వు.
జనార్థన్: మహా నేను త్వరగా మందులు వేసుకోవాలి. ఇప్పటికే తల తిరుగుతుంది. త్వరగా డోర్ తీయ్ మహా.. మహా..
మహాలక్ష్మి: సీత ఆయన ట్యాబ్లెట్స్ వేసుకోవాలి త్వరగా తాళాలు ఇవ్వు.
సీత: నేను మీకు తాళాలు ఇవ్వాలి అంటే ముందు నా గదిలో ఉన్న మా అక్క కిందకి రావాలి. నేను లోపలికి వెళ్లాలి. నేను నా భర్త గదిలోకి వెళ్తేనే మీరు మామయ్య గదిలోకి వెళ్తారు.
మహాలక్ష్మి: నాతోనే బేరాలాడుతున్నావా..
జనార్థన్: మహా స్ఫృహా తప్పేలా ఉంది మహా.. డోర్ తీయ్.. ఏం చేస్తున్నావ్ మహా.. మహా..
సీత: పాపం మామయ్య గారు ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ఏదో ఒకటి చేయండి..
పాపం మహాలక్ష్మి రామ్, మధులకు వర్క్ ఆపేయ్‌మని మధుమతిని తన గదికి వెళ్లిపోమని చెప్తుంది. మధు, రామ్‌లు వెళ్లమని చెప్పినా మహా కన్విన్స్ చేస్తుంది. ఇద్దరికీ కొంచెం గట్టిగా చెప్తుంది. దీంతో మధు తన గదికి వెళ్లిపోతుంది. మహా సీత దగ్గరికి పరుగులు తీస్తుంది. దీంతో సీత మహాకి తాళాలు ఇస్తుంది.
సీత రామ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక రామ్ తలనొప్పి అంటే సీత మర్దన చేస్తుంది. ఇక మహాలక్ష్మి తాళాలు తీసి భర్తకు హడావుడిగా ట్యాబ్లెట్స్ ఇస్తుంది. ఇక రామ్, సీతను దగ్గరగా తీసుకుంటాడు. ఇక నుంచి ఆఫీస్ పనులు ఇంట్లో పెట్టొద్దని సీత అంటే సరే నీతోనే ఉంటాను అని రామ్ మాటిస్తాడు.
జనార్థన్: నేను రూంలో ఉన్నాను అని తెలిసి కూడా సీత తాళాలు వేసిందా..
మహాలక్ష్మి: దాని గురించి నీకు ఇంకా తెలీదా జనా తను అనుకున్నది చేయడానికి అది ఎంతకైనా తెగిస్తుంది. నువ్వు అనవసరంగా సుమతి విషయంలో దాన్ని పొగిడావ్. అది నిన్ను చంపాలి అని చూసింది. దానికి నీ మీద పగ తప్ప నీ మీద సుమతి మీద అసలు ప్రేమ లేదు.
జనార్థన్: సారీ మహా సీత ఇంత ఆడ్వాంటేజ్ తీసుకుంటుంది అనుకోలేదు.
మహాలక్ష్మి: ఇకపై సీత విషయంలో జాగ్రత్తగా ఉండు జనా. సుమతి గురించి దానికి ఏ విషయాలు చెప్పకు.
జనార్థన్: అర్థమైంది మహా ఇకపై సీతకు ఏ విషయం పొరపాటున కూడా చెప్పను.
మహాలక్ష్మి: మనసులో.. రంగా అనే ఓ మనిషిని పెట్టి చంపించాను అని జనాకు తెలీదు. సీతకు తెలిసే అవకాశమే లేదు. సుమతి చావు రహస్యం తెలిసింది నాకు ఆ రౌడీ రంగకు మాత్రమే..
మరోవైపు జైలు నుంచి రౌడీ రంగ విడుదలవుతాడు. ఇక రౌడీ రంగ మహాలక్ష్మికి డబ్బులు అడిగి తీసుకొని వస్తాను అని తన చెంచాలకు చెప్తాడు. రంగ మహా ఇంటికి వస్తాడు. సాంబ అతన్ని ఆపితే సాంబని రంగ చితక్కొట్టి లోపలికి వెళ్తాడు. అక్కడ మహా పేపర్ చదువుతుంటే మహాని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: త్రినయని సీరియల్: సుమన నటనకు గాల్లో ఉసిరి దీపాలు.. తొలిబిడ్డ జాడ నయనికి తెలిసిపోతుందా..!