అన్వేషించండి
Advertisement
Seethe Ramudi Katnam August 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ మాటలు విని విద్యాదేవి దగ్గరకు వెళ్లిన జనార్ధన్ పరిస్థితి ఏంటి.? ఎందుకు క్షమాపణలు చెప్పినట్టు?
Seethe Ramudi Katnam August 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవియే సుమతి అని నిరూపించేందుకు మహాలక్ష్మీ వేసిన ప్లాన్ ఏవిధంగా బెడిసికొట్టింది. మహా మాటలువిన్న జనార్దన్ ఎలా అవమానింపబడ్డాడు.
Seethe Ramudi Katnam Today Episode:విద్యాదేవి మాటలు, చేష్టలతో మహాలక్ష్మీలో అనుమానాలు రోజురోజుకు పెరిగిపోతుంటాయి. ఎవరు ఆమె...ఎక్కడి నుంచి వచ్చిందని పదేపదే ఆలోచిస్తుంది. సుమతికి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థంగాక తలబాదుకుంటుంది. ఎలాగైనా తాను ఎవరో తెలుసుకోవాలనుకుంటోంది. అప్పుడే అక్కడికి వచ్చిన జనా...మహాలక్ష్మీని పలకరించి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. మార్నింగ్ ఇంటి ముందు జరిగిన కారు ప్రమాదం గురించి డౌట్‌గా ఉందని చెబుతుంది.
జనా: అంటే అది ఎవరైనా ప్లాన్ చేసి చేశారనుకుంటున్నావా..?
మహా: ప్లాన్ అని నేను అనకోవడం లేదు. జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే
జనా: మరీ నీ డౌట్ ఏంటీ.
మహా: ఆ ప్రమాదం నుంచి రామ్, ప్రీతిలను సేవ్ చేసిన విద్యాదేవి పై డౌట్ ఉంది.
జనా: ఆవిడపై డౌట్ ఎందుకు మహా
మహా: రామ్, ప్రీతిలను కాపాడితే నేను కాపాడాలి లేకపోతే సీత కాపాడాలి. కానీ ఏ సంబంధం లేని ఆవిడ ఎందుకు అంత హడావుడిపడిపోయింది. ప్రాణాలకు తెగించి మరీ ఆ ఇద్దరినీ ఎందుకు కాపాడినట్లు.
జనా: ఇది వరకు కూడా ఆమె రామ్‌ను కాపాడింది కదా
మహా: లేదు జనా..ఆవిడ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా...ఆమె పద్దతి, మాట అంతా అనుమానాస్పదంగా ఉంది.
జనా; అనుమానంగా అంటే ఏ రకంగా
మహా: తాను ఏదో మనతో పాత పరిచయం ఉన్న మనిషిలా ప్రవర్తిస్తుంది. సొంత మనిషిలా కలసిపోతుంది.
జనా: ఆవిడ పద్దితే అంతేనేమో
మహా; తాను రామ్, ప్రీతితో నడుుచుకునే తీరు చూస్తుంటే నాకు సుమతి గుర్తుకువస్తోంది. సుమతి గురించి తనకు తెలిసినట్లు మాట్లాడుతోంది. ఆవిడే సుమతి అని నాకు అనిపిస్తుంది
జనా; ఆవిడ సుమతి ఎలా అవుతుంది. వాళ్లిద్దరికీ అసలు పోలీకే లేదుగా
మహా:రూపంలో పోలిక లేకపోవచ్చు కానీ...ఆమె మాటల్లో, ప్రవర్తనలో అంతా సుమతి మాదిరిగానే ఉంది.
జనా: సుమతి గురించి మీ మధ్య నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ కదా..ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది.
మహా; అది తెలియాలంటే ఆవిడకు ఒక టెస్టు పెట్టాలి. నువ్వు నేను చెప్పినట్లు చేస్తే...ఆవిడ సుమతి అవునో కాదో తెలిసిపోతుంది.
మహా చెప్పిన ప్లాన్ చేయనని జనా చెబుతాడు. ఇది పద్దతి కాదని చెబుతాడు. కానీ మహా ఫోర్స్ చేసి అతన్ని ఒప్పిస్తుంది.
ఉదయం జరిగిన ప్రమాదం గురించి తలుచుకుని సీత, రామ్ బాధపడుతుంటారు. ప్రమాదం నుంచి కాపాడిన విద్యాదేవికి రుణపడి ఉన్నామని అనుకుంటారు. ఆవిడకు మనకు ఏదో సంబంధం ఉండబట్టే నిన్ను రెండుసార్లు ప్రమాదం నుంచి కాపాడగలిగందని అనుకుంటారు. నీలో, ప్రీతిలో తన పిల్లలను చూసుకుంటుందని టీచరమ్మ చెప్పారని రామ్‌తో సీత అంటుంది.
ఇంతలో జనా విద్యాదేవి దగ్గరుకు వెళ్లి సుమతి అని పిలుస్తాడు. ఆపిలుపుకు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగి చూస్తుంది. సుమతి అని పిలిచానని ఆశ్చర్యపోతున్నావా అని అంటాడు. నువ్వు సుమతి అని కనిపెట్టేశానని షాక్ అవుతున్నావా అంటాడు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేసిన వాడిని నాకు తెలియదా నువ్వు ఎవరో అంటాడు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే నాకు నీపై డౌట్ వచ్చిందంటాడు. ఆరోజు నుంచే నిన్ను గమనిస్తున్నాను అంటాడు. నీ నడవడిక మొత్తం సుమతిలాగే ఉందంటాడు. ఈ రోజు నువ్వు ప్రాణాలకు తెగించి రామ్, ప్రీతిలను కాపాడిన తర్వాత నువ్వే సుమతి అని నిర్థరణ అయ్యిందంటాడు. దురదృష్టవశాత్తు నువ్వుమాకు దూరమయ్యావు...నీరూపం మారిపోయినంత మాత్రానా నిన్ను కనుక్కోకుండా ఎలా ఉంటాని జనా అంటాడు. నీ ఇంట్లో నువ్వు దొంగలా ఉండాల్సిన అవసరం లేదంటాడు. నువ్వు ఎవరికి బయపడాల్సిన పనిలేదు నిజం చెప్పు అని నిలదీస్తాడు.
జనా మాటలకు రియాక్ట్ అయిన విద్యాదేవి...మీ ఒక్కరి ముందే ఎందుకు అందరి ముందు నిజం చెబుతాను కిందకు తీసుకెళ్తుంది. సీత, మహాలక్ష్మీ అందిరిని పిలుస్తుంది. మేడపైన తనగదిలోకి వచ్చి భుజంపై చేయి వేశాడని చెబుతుంది. నేను ఆయన భార్య సుమతి అన్నట్లు మాట్లాడారని చెబుతుంది. నేను సుమతిలా ఉండటమేంటని....ఈయన విచిత్ర ప్రవర్తనకు కారణమేంటని నిలదీస్తుంది. సీతకోసం ఈ ఇంటికి వచ్చాను...రామ్ ఉండమంటే ఇంట్లో మనిషిలా ఉంటే నేను సుమతి అంటే ఎలా..? ఆయన నాతో చనువుగా ప్రవర్తిస్తే నాకు ఎంత ఇబ్బందిగా ఉందోనంటుంది. ఈయన ఇంత చిన్న బుద్ధి చూపిస్తారని అనుకోలేదని కోప్పడుతుంది.
టీచర్‌గారితో చనువుగా ప్రవర్తించారా అంటూ సీత మామను నిలదీస్తుంది. తాను సుమతిలా ప్రవర్తిస్తుండటంతో తను సమతియేనని అలా ప్రవర్తించానంటాడు. దీంతో విద్యాదేవి మరింత మండిపడుతుంది. అసలు సుమతి ఎవరో, ఎక్కడ ఉందో నాకు తెలియదు. నేను తనలా ఉండటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏ రకంగా నన్ను సుమతి అనుకున్నారని నిలదీస్తుంది. నాతో అసభ్యంగా ఎలా ప్రవర్తిస్తారని ఆమె కడిగిపారేస్తుంది. మామయ్య చేసింది తప్పేనని....అందుకు మా అందరినీ క్షమించాలని సీత విద్యాదేవిని కోరుతుంది.ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని అంటుంది. మామాయ్య అలాంటి వాడు కాదని...ఇది ఆయన సొంత ఆలోచన కూడా అయ్యి ఉండదని ఆమె ప్రాధేయపడుతుుంది. టీచర్‌తో అలా మాట్లాడమని ఎవరు చెప్పారంటూ సీత జనాను నిలదీస్తుంది. మీరు అలాంటి వారు కాదని మా అందిరకీ తెలుసు నిజం దాచి మీరు చెడ్డవారు అవ్వకండని సీత అంటుంది.
జనా: విద్యాదేవిగారిపై నాకు అలాంటి చెడు ఉద్దేశం ఏమీ లేదు.
సీత: మరి టీచర్‌గారితో ఎందుకు అలా ప్రవర్తించారు మామయ్య
జనా: అదీ....మహానే అలా మాట్లాడమని సలహా ఇచ్చింది
సీత: ఏంటత్తయ్యా...ఇదంతా మీ ప్లానేనా.? మీరే మామయ్యను అలా ప్రవర్తించమని చెప్పారా..?
మహా; నాకు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అందుకే ఆయన్ను అలా చేయమని చెప్పాను
విద్యాదేవి: మీకు అనుమానం వచ్చేలా నేనేం చేశానండీ..?
మహా : నువ్వు అప్పుడప్పుడు సుమతిలా ప్రవర్తించావు
విద్యాదేవి; ఆ సుమతి ఎలా ఉందో..ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదు. నేను నాలాగే ఉన్నాను
అర్చన: మహాకి అనుమానం రావడంలో తప్పేముంది. ఆమెకు అనుమానం వచ్చేలా విద్యాదేవి ప్రవర్తన ఉంది కాబట్టి అది తీర్చుకోవాలనుకుంది. అది తప్పేలా అవుతుంది
సీత: రేపు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నా భార్యలా ఉన్నావని అలా ప్రవర్తిస్తే నీకు ఎలా ఉంటుంది చిన్నత్త...మా టీచర్‌కు ఎంత ఇబ్బందికరంగా అనిపించిందో..
అర్చన; మహాకు డౌట్ వచ్చి అలా చేసిందని చెప్పింది కదా. ఈ గొడవ ఇంతటితో వదిలేయండి.
సీత: ఎలా వదిలేస్తాం చిన్నత్తా....ఆ రోజు మామయ్య, టీచర్‌గారి గురించి ఎవరో ఏదో అంటే ఎంత పెద్ద గొడవ చేశారు. ఆఖరికి టీచర్‌గారినే ఇంటి నుంచి గెంటేయ్యాలి అనుకున్నారు కదా..అదంతా నేను ఎలా మర్చిపోతాను.
జనా: అంటే ఇప్పుడు ఏం చేయమంటారు
సీత: మీరు చేసిన పనివల్ల టీచర్ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఆవిడకు క్షమాపణలు చెప్పాలి.
జనా: ఐయామ్ సారీ విద్యాదేవి గారు...మీ విషయంలో తొందరపడి అలా మాట్లాడను. దయచేసి క్షమించండి.
సీత: మామయ్యగారు మాత్రమే కాదు...మహాలక్ష్మీ అత్తయ్య కూడా క్షమాపణలు చెప్పాలి
అర్చన: మహా ఎందుకు సారీ చెప్పాలి
సీత: ఈ ప్లాన్ చేసింది ఆవిడే కదా
అర్చన: బెదిరిస్తున్నావా సీత
సీత: చేసిన తప్పుకు సారీ చెబితే గౌరవంగా ఉంటుంది అంటున్నా..
మహా; జరిగిందానికి సారీ
జరిగిందానికి సారీ టీచర్‌గారు అని సీత చెప్పడంతో...జనా కూడా మరోసారి ఆమెకు క్షమాపణలు చెబుతాడు. తామే తొందరపడి తప్పుగా ఆలోచించామని అంటాడు. అందరిముందు పరువుపోయినందుకు మహా లక్ష్మీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆవిడ వెనకే వెళ్లిన విద్యాదేవిని మహా లక్ష్మీ మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తుంది. అందరి ముందు చెప్పలేని కొన్ని విషయాలు మీకు చెబుదామని వచ్చానని అంటుంది. సాటి మహిళ పట్ల ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారని కడిగిపారేస్తుంది విద్యాదేవి. నాకు అనుమానం రావడంలో తప్పేముందని మహాలక్ష్మీ ప్రశ్నిస్తుంది.
విద్యాదేవి: మీకు అనుమానం వస్తే డైరెక్ట్‌గా మీరే నన్ను అడగాలి గానీ...జనార్ధన్‌గారిని ఇందులో ఇన్వాల్ చేయడం సబబేనా
మహా: ఆయన సుమతి భర్త...
విద్యాదేవి: కావొచ్చు...కానీ ఒక ఆడదాన్ని పరీక్షించడానికి మగాడిని పంపొచ్చా..ఇదేనా మీ సంస్కారం
మహా: అందిర ముందు మీకు సారీ చెప్పాను కదా...మళ్లీ ఎందుకు వచ్చారు
విద్యాదేవి; అందరి ముందు మీ పరువు పోకూడదని అక్కడ మాట్లడలేదు. ఆయన సుమతి భర్తే అయితే మీరు సుమతి ప్రాణస్నేహితురాలు కదా..సుమతి ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో మీకు బాగా తెలుసుకదా..డైరెక్ట్‌గా మీరే ఎందుకు టెస్ట్ చేయలేదు. సుమతిని ఎదుర్కొనే ధైర్యం లేదా
మహా: ఏం మాట్లాడుతున్నారు..? సుమతి అంటే నాకు భయం ఎందుకు
విద్యాదేవి: నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా.....సుమతి పేరు చెప్పగానే మీరు ఉలిక్కిపడుతున్నారు. కొంపదీసి ఆవిడ విషయంలో మీరుగానీ ఏమైనా చేశారా.,?
సీత: కరెక్ట్‌గా అడిగారు టీచర్..మా అత్తయ్యమీద నాకు కూడా ఇదే అనుమానం వస్తుంది. ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే సుమతి అత్తమ్మ పేరు చెబితే చాలు ఎంతో భయపడుతుంది. ఇంతకీ మా అత్తమ్మను మీరు ఏం చేశారు..? కిడ్నాప్ చేసి ఎక్కడైన దాచిపెట్టారా..? లేక చంపేశారా..?
మహా: ఏయ్...?
సీత: ఎందుకు అత్తయ్య అంత కోపం..మీరు సుమతి అత్తయ్యను ఏదో చేశారు కదా..?
మహా: నోర్మూయ్.. ఇక ఆపు.....అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది.
సీత: మీరు అయితే అందరినీ అనుమానించొచ్చు. మేము మాత్రం మిమ్మల్ని అనుమానించకూడదు..ఇదెక్కడి న్యాయం
మహా: సుమతి నా స్నేహితురాలు...తనను ఎంతగానో నమ్మిన మనిషిని నేను.
విద్యాదేవి; నమ్మించి మోసం చేయడం మనుషులకు కొత్తేమి కాదుకదా
మహా: మీరు ఈ మహాలక్ష్మీ గురించి మాట్లాడుతున్నారని మర్చిపోకండి
సీత; మీరు మనిషి కాదా ఏంటి అత్తయ్య...మీకు మోసం చేయడం రాదా? ఏదో ఒకరోజు సుమతి అత్తమ్మ వస్తుంది. ఆరో జు అన్ని విషయాలు బయటకు వస్తాయి.
వాళ్లద్దరి నుంచి తప్పించుకుని మహాలక్ష్మీ జనార్ధన్ వద్దకు వెళ్తుంది. అక్కడ జనా కూడా సుమతి గురించే ఆలోచిస్తుంటాడు. తాను బతికే ఉన్నా ఇంటికి ఎందుకు రావడం లేదని మదనపడిపోతుంటాడు. ఇక్కడికి రావడానికి తనకు అభ్యంతరమేంటో తెలియడం లేదని మహాలక్ష్మీతో అంటాడు. నిన్ను ఒక విషయం అడుగుతాను ఏం అనుకోవద్దంటూ నాకు తెలియకుండా సుమతితో నువ్వు ఎప్పుడైనా గొడవపడ్డావా అని అడుగుతాడు. జనార్ధన్ మాటలకు మహాలక్ష్మీ నిర్ఘాంతపోవడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion