అన్వేషించండి

Satyabhama Serial Today May 30th: సత్యభామ సీరియల్: కాళీ దగ్గర సత్య ప్రైవేట్ వీడియో, తల పట్టుకున్న విశ్వానాథం.. మహదేవయ్య హత్యకు కుట్ర తిప్పికొట్టిన క్రిష్ 

Satyabhama Serial Today Episode సత్య ఫ్రెండ్ తనతో క్లోజ్‌గా ఉండటం క్రిష్ అతన్ని కొట్డడం విషయం మీద క్రిష్, సత్య ఇద్దరూ గొడవపడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య ఫ్రెండ్‌ సత్య భుజం మీద చేయి వేసి హగ్ చేసుకున్నాడు అని క్రిష్ శివని కొడతాడు. అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు. దీంతో సత్య క్రిష్‌ని తిడుతుంది. తన ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిశాడు అని ఎందుకు అలా కొట్టావ్ అని తిడుతుంది.  

క్రిష్: మాట్లాడితే పర్లేదు. ముట్టుకున్నాడు. హగ్ చేసుకున్నాడు.
సత్య: అది ఫార్మాలిటీ. నీకు అర్థం కాదు. నీకు చదువు లేదు. 
క్రిష్: ప్రపంచంలో నీకు అందరూ అర్థం అవుతారు. ఒక్క నా మనసు తప్ప. నువ్వు నా సొంతం కేవలం నాకే సొంతం. పరాయి వాడు ఎవడైనా నిన్ను ముట్టుకున్నా, పట్టుకున్నా నేను ఒప్పుకోను. నువ్వు కూడా ఇది గుర్తుపెట్టుకో. 
సత్య: నువ్వు నిజంగానే మూర్ఖుడివి. నీకు సంస్కారం లేదు. నా కళ్ల ముందే నా ఫ్రెండ్‌ని కొట్టావు.
 క్రిష్: ఏయ్ నీకు వంద సార్లు చెప్పా. నేను ఇంతే నా లెక్కే ఉంటా మారను.
సత్య: చెప్పావు కానీ మారుతావ్ ఏమో అని సంస్కారం నేర్చుకుంటావేమో అని అనుకున్నాను కానీ అది ఈ జన్మకు జరగదని నాకు అర్థమైంది. నిన్ను చూసి అయ్యో అనుకోవడం నాది తప్పు. ఆరు మైళ్ల దూరంలో ఉంచాల్సిన నిన్ను అడుగు దూరం వరకు రానించడం నేను చేసిన పెద్ద తప్పు. 
చక్రి: మనిషి మారాడు పద్ధతి మార్చుకున్నాడు. పై మెట్టు ఎక్కడానికి ఎంతో దూరంలో లేడు అని మురిసిపోయాను. కానీ నా ఆశ నిరాశ పరిచాడు. ఈ ఆట వీడి వల్ల కాదేమో. 

మరోవైపు విశ్వనాథం మార్కెట్ నుంచి వస్తుండగా రౌడీ కాళీ ఎదురుగా వస్తాడు. విశ్వనాథం కాళీని చూసి భయపడతాడు. తనకు పది లక్షలు ఇవ్వమని అడుగుతాడు. విశ్వనాథం డబ్బులు లేవు అంటే బెదిరిస్తాడు. డబ్బు ఇవ్వకపోతే సత్యకి చెందిన పర్శనల్ వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తాను అని బెదిరిస్తాడు. క్రిష్‌కి చెప్తే తన అసలు రంగు చూస్తావని అంటాడు. విశ్వనాథం ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. ఇక సత్య బాధగా కూర్చొంటే అక్కడికి హర్ష వస్తాడు. మరోవైపు క్రిష్ దగ్గరకు తన బాబాయ్ చక్రవర్తి వెళ్తాడు.

హర్ష: బావగారు అలా ప్రవర్తించారు అంటే అస్సలు నమ్మలేకపోతున్నా సత్య.  బావగారి ప్రేమ దగ్గరుండి చూశా. నీకోసం ప్రాణాలు ఇస్తారు.
క్రిష్: ఇప్పుడు నా ప్రాణాన్ని నేనే చేజేతులా తీసుకున్నట్లు అయింది బాబాయ్. సత్యకు నా ముఖం ఎలా చూపించేది. బాబాయ్ ఒకసారి సత్యతో మాట్లాడాలి బాబాయ్.
సత్య: నేను చచ్చినా మాట్లాడను అన్నయ్య.
హర్ష: ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా. బావగారు అలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వమో పిచ్చితనమో కాదు పొసెసివ్ నెస్. ఓవర్ పొసెసివ్ నెస్. నీకు చెందిన ఎలాంటి అనుభూతులు ఫీలింగ్స్ అయినా కేవలం తనకే చెందాలి అనే స్వార్థం. నువ్వు వేరే వారితో క్లోజ్‌గా మూవ్ అవుతుంటే  చూసి తట్టుకోలేని మనస్తత్వం.  
చక్రవర్తి: ఒక మనిషి మీద అతి ఇష్టం అతి అపేక్ష పెంచుకుంటే ఇలాగే అవుతుంది. 
హర్ష: జరిగిన దాన్ని మర్చిపోయి బావగారిని అర్థం చేసుకో. నిన్ను ఇష్టపడే మనిషిని బాధ పెట్టకు. 
క్రిష్: దగ్గర అవుతున్నాను అని సంతోష పడినంత సమయం ఉండలేదు బాబాయ్ ఆ సంతోషం. 
చక్రి: నువ్వేమనుకున్నా సరే నా మనసులో మాట చెప్తారా. మీ ఇంట్లో మగాళ్లు తమకు నచ్చినట్లే ఉంటారు కానీ ఆడవాళ్లే బావిలో కప్పల్లానే ఉంటారు. మీరు కూడా వారు అలాగే ఉండాలి అనుకుంటారు. వాళ్ల స్వేచ్ఛని మీరు తట్టుకోలేరు. ఒప్పుకోరు. అందుకే సత్య తన ఫ్రెండ్‌తో ఫ్రీగా ఉంటే తట్టుకోలేకపోయావ్. 
హర్ష: కూల్‌గా ఆలోచించు బావగారి మీద అలగకు కోప్పడకు అర్థం చేసుకో. 

ఇంతలో క్రిష్‌కి ఓ మెసేజ్ వస్తుంది. తనకు ఒక పని పడిందని క్రిష్ వెళ్తాడు. ఇక మహదేవయ్యకు గడ్డం గీయడానికి ఓ వ్యక్తి వస్తాడు. మహదేవయ్యను చంపాలని ఆయనకు నర్శింహ చెప్తాడు. చెప్తే పది లక్షలు ఇస్తానని చెప్తాడు. మహదేవయ్యకు గడ్డం గీస్తూ ఆ వ్యక్తి చేయి వణుకుతుంది. అది చూసి మహదేవయ్య అడుగుతాడు. ఇక క్రిష్ తన అన్నకి కాల్ చేసి ఆ వ్యక్తి తన తండ్రిని చంపడానికి వచ్చాడని చెప్తాడు. రుద్ర షాక్ అయి బాపు అంటూ వెళ్లి ఆ వ్యక్తిని కొడతాడు. మహదేవయ్య వదలమని అంటాడు. రుద్ర ఆగిపోతాడు. ఆ వ్యక్తి మహదేవయ్య కాళ్ల మీద పడతాడు. ఇక మహదేవయ్య తన స్టైల్‌లో వాడికి క్లాస్ ఇచ్చి పీక కోసేస్తాడు. ఆ బాడీని నర్శింహ ఇంటికి పార్శిల్ చేయమని అంటాడు. 

ఇక మహదేవయ్య ఫోన్ తీసుకొని క్రిష్‌తో నువ్వు ఎంత మందిని చంపినా మగాడు అనరని తన చేతికి వారసుడిని ఇస్తేనే మగాడు అంటారని అంటాడు. దీంతో క్రిష్ ఫోన్ కట్ చేసేస్తాడు. మరోవైపు క్రిష్, సత్యలను కలపడానికి చక్రవర్తి పార్టీ ఏర్పాటు చేస్తాడు. సత్య మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఆ పార్టీ ఏర్పాటు చేస్తారు. సత్య క్రిష్‌ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక తాను ఓ పోటీలను పెడతాను అని అందులో గెలిచే వారికి రాధాకృష్ణుడి బొమ్మ గిఫ్ట్‌గా ఇస్తానని అంటాడు. దాంతో క్రిష్ తాను సత్య రాధా కృష్ణుల్లా ఊహించుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణని ఇంటికి తీసుకొస్తున్న ముకుంద.. ఆడదాని చేతిలో మోసపోయానని తల్లి దగ్గర కుమిలిపోయిన ఆదర్శ్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget