అన్వేషించండి

Satyabhama Serial Today March 25th: సత్యభామ సీరియల్: నందిని హంగామా.. కూతురి కోసం భైరవి కొత్త ప్లాన్.. సత్యని ఆ మాట అన్న తోటికోడలు!

Satyabhama Serial Today Episode భోజనంలో నాన్ వెజ్ లేదు అని నందిని ఇంట్లో గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్ ప్రేమతో సత్యకు అన్నం తినిపిస్తాడు. ఇంతలో క్రిష్ నానమ్మ అక్కడికి వస్తుంది. ఇద్దర్ని అలా చూసి మురిసిపోతుంది. ఇక క్రిష్ వెళ్లిపోమని అంటే నేను వెళ్లను అని సైగలు చేస్తుంది. ఇంతలో సత్య ప్లేట్ తీసుకొని నేను తింటాను అని తానే తీసుకొని తింటుంది. క్రిష్ తన నానమ్మ వైపు కోపంగా చూస్తాడు. సత్యను చూస్తూ అలా ఉండిపోతాడు. మరోవైపు విశాలాక్షి తన కోడలు నందినిని భోజనానికి పిలవడానికి వెళ్తానంటుంది. దీంతో హర్ష తల్లిని ఆపుతాడు.

హర్ష: వచ్చినదగ్గరి నుంచి తన ప్రవర్తన చూస్తున్నావు కదా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. నువ్వు వెళ్లి పిలిస్తే ఇప్పుడే అదే జరుగుతుంది. ఎందుకు నువ్వు వెళ్లి మాటలు అనిపించుకోవడం.
విశాలాక్షి: పోనీ నువ్వెళ్లి తీసుకొస్తావా..
శాంతమ్మ: వాడిని అస్సలు పంపకు. అది అరిస్తే వీడు అరుస్తాడు. అంతే కానీ సర్దుకుపోడు. మొగుడు పెళ్లాలు అన్నాక ఒకరో ఒకరు సర్దుకుపోవాలి ముందు అది నేర్చుకో. వసే విశాలా నువ్వే వెళ్లి నందిని పిలుచుకురా. ఎంత కాదు అనుకున్నా అది మన ఇంటి పిల్ల. 
హర్ష: పుట్టింట్లో ఉండేలా అత్తింట్లో ఉండాలి అంటే ఎలా కుదురుతుంది నానమ్మ.
సంధ్య: కావాలి అని పెళ్లి చేసుకున్నాక వదినను అనే హక్కు నీకు లేదు అన్నయ్య. 

ఇంతలో నందిని వస్తుంది. ఏసీ లేకపోవడంతో ఇబ్బంది పడుతుంది. ఏసీ లేదు అని అత్తింటి వారిని ఎగతాళి చేస్తుంది. ఏమేమ్ వండారు అని అడుగుతుంది. ఇంతలో హర్ష వడ్డిస్తుంది కదా కాసేపు ఆగితే తెలుస్తుంది అంటాడు. మాటా మాటా పెరిగి ఇద్దరూ పోట్లాడుకుంటారు.

నందిని: అసలు ఈ లొల్లి ఏంటి.. నేను ఈ ఇంటి మనిషిని అంటారు. ఫ్రీగా ఉండమని చెప్తారు. ఇదేనా స్వేచ్ఛ అంటే. వంటలు ఏంటి అని అడగడం కూడా తప్పేనా.
విశాలాక్షి: తప్పు ఏం కాదు అమ్మ. ఇక వెజ్ లిస్ట్ చెప్పడంతో నందిని తనకు చికెన్ కావాలి అని అంటుంది. 
నందిని: నాకు చికెన్ కావాలి.. నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద దిగదు. అయినా మీకు నాన్ వెజ్ కొనే స్థాయి లేక మానేశాం అని చెప్పండి. 
హర్ష: అవును కొనే స్థాయి లేదు అందుకే మానేశాం. అయితే ఏంటి నువ్వు కూడా మేం ఏం తింటే అదే తినాలి.
నందిని: నేను తినను.
విశాలాక్షి: ఇప్పటికిప్పుడు నాన్ వెజ్ అంటే కష్టం కదమ్మా. ఈ పూటకి సర్దుకో రేపు చేసి పెడతాను నా బంగారు తల్లి కదా. కూర్చొమ్మా. ఈ ఇంట్లో నీకు ఇది మొదటి భోజనం ఇలా కంచం ముందు లేస్తే మాకు బాధగా ఉంటుంది. ప్లీజ్ అమ్మా కూర్చొ.

నందిని తినడానికి ప్రయత్నించి తినలేక నాన్ వెజ్ లేకపోతే నాకు భోజనానికి పిలవద్దు అని అనేసి తన గదికి వెళ్లిపోతుంది. హర్ష కోపంతో లేస్తే విశ్వనాథం అడ్డుకుంటాడు.

విశ్వనాథం: హర్ష కూర్చొరా పెళ్లి విషయంలో నువ్వు మొండితనంగా ప్రవర్తించావు. ఇప్పుడు ఆ అమ్మాయి మొండితనం చేస్తుంది. ఎవరికి వాళ్లు తక్కువ కాదురా.. కూర్చొ.. 

రుద్ర: ఏంట్రా ఒట్టి చేతులతో వచ్చావ్ ఎంగిలి ప్లేటు తీసుకురాలేదే. 
క్రిష్: సత్య ఇంకా తింటుంది అన్న.
రుద్ర: లేదంటే ఎంగిలి ప్లేట్ తీసుకొచ్చేవాడివా.. 
క్రిష్: డౌటా..
రుద్ర: అమ్మా చిన్నాకి ఒక మంచి చీర తీసుకోవే..
భైరవి: వాడి పెళ్లం కోసమా..
రుద్ర: కాదు చిన్నా కోసమే. గడ్డాలు మీసాలు పెంచాడు కానీ వాడు మగాడు అన్న సంగతి మర్చిపోయాడు. చీర ఒకటి ఇస్తే కట్టుకొని పెళ్లంతో చెమ్మాచెక్క  ఆడుకుంటాడు.
క్రిష్: అన్నా నీ కడుపు మంట ఏంటో నాకు అర్థమైందిరా..
మహదేవయ్య: నేను చెప్తారా ఈ ఇంట్లో ఆడాళ్లేకే కాదు మగాలకు లక్షణ రేఖ ఉంటుంది. దానికి కట్టుబడే ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు ఉండాలి అంటే ఇక్కడ కుదరదు. సేవలు చేసే భార్యకు సేవలు చేయడం తప్పుకాదు. కానీ ఇప్పుడు అంత అవసరం ఏం వచ్చింది నీ భార్యను కూర్చొబెట్టి తినిపిస్తున్నావు. 
భైరవి: ఏంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం గది దాటి బయటకు రాకుండా మహారాణిలా సేవలు చేయించుకుంటుందా. రేపు మేం కూడా మా భర్తలకు సేవలు చేయమని అడుగుతాం చేస్తారా.. 
మహదేవయ్య: బొమ్మ లెక్క ఉన్నావేంట్రా సమాధానం చెప్పు. నువ్వు నీ పరువు తీసుకోవడమే కాకుండా మా పరువు తీస్తావా.. నీ లెక్క మాకు సేవలు చేయమంటావా..
క్రిష్: చూడు బాపు మర్యాద అయినా గౌరవం అయినా ప్రేమ అయినా ఇచ్చి పుచ్చుకోవాలి బాపు. భార్య నుంచి నీకు గౌరవం కావాలి అంటే నువ్వు కూడా ఆమెకు గౌరవం ఇవ్వాలి. 
మహదేవయ్య: ఏమిరో.. పెళ్లి అయిన ఒక్క దినం కాలే అప్పుడే మాకే పాఠాలు నేర్పిస్తున్నావా. అంత మగాడివి అయిపోయావా.
క్రిష్: తెలియని విషయాలు నేర్చుకోవడానికి వయసుతో పనేముంది బాపు. చిన్నాడు చెప్పిన పెద్దొడు చెప్పినా మంచి మంచే కదా.. అమ్మా కాలు కింద పెట్టకుండా బాపు నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తే నీకు ఎట్లా ఉంటుంది అమ్మ కోపం వస్తుందా నచ్చదా.. వదిన అన్న నీకు గోరు ముద్దలు పెడతా అంటే వద్దు అంటావా ఛీ కొడతావా. భార్యని బానిసగా చూడటం కాదు. ప్రేమగా మార్చుకోవాలి. 
రుద్ర: రేయ్ నువ్వే ప్రేమ చూపిస్తే పెళ్లం నెత్తిన ఎక్కి ఆడుతుంది. తాండవం చేస్తుంది. పోను పోను నీకే తెలుస్తుంది. ఇప్పుటి నుంచే పెళ్లాన్ని కంట్రోల్‌లో పెట్టుకో.

రేణుక: పెళ్లి అయిన ప్రతి అమ్మాయికి భర్త ఉంటాడు. కానీ అదృష్టం చేసుకుంటేనే అర్థం చేసుకునే భర్త వస్తాడు. సత్య చాలా అదృష్టవంతురాలు. 

నందిని: తల్లి ఫోన్ చేయడంతో.. ఇప్పుడు గుర్తొచ్చానా.. కళ్లు ముందు లేను. కాళ్లకు అడ్డం లేను ఇక నీ మనసులో ఎందుకు ఉంటానులే. ఎవడో తాళి కట్టి తీసుకెళ్లాడు ఇక దాని చావు అది చస్తుంది అని వదిలేశావులే. ఇక నాన్నకి అయితే కూతురు కంటే ఎమ్మెల్యే పదవినే ఎక్కువ. మీ అందరికీ ఎవరి స్వార్థం ఎవరిది. ఇక్కడ నీ బిడ్డకి శోభనం అంట. గంపెడు పిల్లల్ని కనమని వాళ్లని తుడుచుకుంటూ చావమని అక్షింతలు వేసి దీవించడానికి రావా. ఎట్లా వస్తావులే అక్కడ నీ ముద్దుల కొడుకుకు కూడా శోభనం ఏర్పాట్లు చేయాలా కదా.. చేసుకో అమ్మా చేసుకో పండగ చేసుకో..
భైరవి: అనవే అనవే నీకు ఇష్టం వచ్చినట్లు అనవే. ఈ అమ్మ నీ గురించి ఎంత ఆలోచిస్తుందో నీకు ఏం తెలుసు.
నందిని: ఈ రోజు నన్ను రెడీ చేసి గదిలోకి తోలి గడియ వేస్తారు. ఆ పిచ్చొడి చేతికి సిమ్లా ఆపిల్ దొరికినట్లు. 
భైరవి: చూడు బిడ్డ ఏదో ఒకటి చేసి నీకు ఈ శోభనం జరగకుండా చేస్తా వాడిని దూరంగా ఉంచు. వాడికి వాడే నీకు ఇక్కడికి తీసుకొచ్చి నీ కాపురం ఇక్కడ పెట్టాలా చేస్తా. అదంతా జరిగేలా ప్లాన్ చేయడానికి నేను చేస్తా. చూడు నువ్వేం చేయాలి అంటే.. ప్లాన్ చెప్తుంది. 

విశాలాక్షి కొడుకు శోభనానికి గది రెడీ చేస్తుంది. హర్ష రెడీ అయి ఆరు బయట కూర్చొని ఏదో ఆలోచిస్తాడు. ఇక విశ్వనాథం ఏవో పాటలు పెట్టుకొని వింటూ ఉంటే విశాలాక్షి వచ్చి హర్ష గురించి చెప్తుంది. హర్షని నచ్చచెప్పమని పంపిస్తుంది. కొడుకుకు శోభనం గదికి వెళ్లమని నందిని గొప్పింటి పిల్ల అని సర్దుకోమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ మార్చి 25th: మహాలక్ష్మి అండతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించిన మధుమిత..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget