Satyabhama Serial Today March 22nd Episode Written Update In Telugu: సత్యభామ సీరియల్: సత్యకు ప్రేమతో గోరు ముద్దలు తినిపించిన క్రిష్ - చిరాకు పడుతున్న నందిని!
Satyabhama Serial Today Episode సత్య కోసం తమ గదికే భోజనం తీసుకెళ్లి క్రిష్ గోరు ముద్దులు తినిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode నందిని, హర్షలను విశాలాక్షి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇక నుంచి ఇది నీ ఇల్లు ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అని కోడలికి చెప్తుంది. దేవుడి దగ్గర దీపం పెట్టడానికి పిలుస్తుంది. నందిని దీపం పెట్టకుపోతే ఏమవుతుంది అని చిరాకుగా మాట్లాడుతుంది.
విశాలాక్షి: తప్పు అమ్మా అలా మాట్లాడకూడదు.
నందిని: కొత్తగా ఈ ఇంటికి వచ్చినా అంటూ దీపం వెలిగించి దేవుడి ముందు హాజరు వేయించుకోవాలా.. లేకపోతే ఆయనకు తెలీదా.. కావాలి అంటే మీరు పోయి చెప్పుకోండి తమాషా అయిపోయింది. హర్ష గొడవకు బయల్దేరితే విశాలాక్షి ఆపేస్తుంది. ఇక నందిని తన గది చూపిస్తే రెస్ట్ తీసుకుంటా అని అంటుంది.
విశాలాక్షి: అమ్మా సంధ్య వదినకు గది చూపించు.
సంధ్య: రా వదిన..
మరోవైపు సత్య క్రిష్ ఇంట్లో పూజ చేసి దేవుడికి హారతి ఇస్తుంది.
సత్య: మనసులో.. స్వామి కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆశలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా మొక్కుకున్నా కరుణిస్తావు అన్న ఆశ నాకు లేదు. నిజంగా నీకు నా మీద జాలి ఉంటే నా కథ ఇక్కడి వరకు తీసుకొని వచ్చేవాడివే కాదు. తర్వాత అత్తామామలతో పాటు అందరికీ హారతి ఇస్తుంది.
మహదేవయ్య: అత్తింట్లో అడుగు పెట్టే దాకా ఆడపిల్లకి పుట్టిల్లే ఎక్కువ. పుట్టింటి గౌరవమే ఎక్కువ. అత్తింటిలో అడుగు పెట్టాక లెక్కలు మారిపోతాయి. మారిపోవాలి. అత్తింటి గౌరవం తర్వాతే ఏదైనా ఎవరు అయినా. అట్టింటి దేవుడే నీ దేవుడు. అత్తింటి మనుషులే నీ మనుషులు.
భైరవి: చెవులు అప్పగించి వినుడు.. కళ్లు అప్పగించు చూసుడు కాదు. నోరు విప్పి అర్థం అయింది అని చెప్పు.
గంట: బామ్మ గంట సౌండ్‌కి.. ఆడపిల్లకు అత్తింటి గౌరవం, పుట్టింటి గౌరవం కంటే ముఖ్యమైనది ఆత్మ గౌరవం ఎవరి కోసమో దాన్ని వదులుకోవద్దు అమ్మ. నువ్వు వీడికి భార్యగా దొరకడం వాడికి ఎంత అదృష్టమో, వాడు నీకు భర్తగా దొరకడం కూడా అంతే అదృష్టం. ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని కాపుర చేసుకోండి.
క్రిష్: అవును కానీ దేవుడికి హారతి ఇచ్చి చాలా ముచ్చట్లు దేవుడిని ఏం కోరావు. నిన్నే అడిగేది ఏం కోరుకున్నావ్..
గంట: అలా అడగకూడదు. మనసులో కోరికలు బయటకు చెప్పకూడదు.
క్రిష్: నేను ఆమె పెనిమిటిని.. దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడిని అయినా చెప్పకపోతే నాకు తెలీదా ఏంటి. నాకు మంచి మొగుడిని ఇచ్చావ్ మంచి జీవితం ఇచ్చావు ఇలాగే నా భర్త ప్రేమ ఎప్పటికీ ఉండాలి అని కోరుకున్నావ్ అంతే కదా..
నందిని: ఛా.. మా ఇంట్లో స్టోర్ రూమే ఇంత కంటే పెద్దగా ఉంటుంది. బాపునకు అన్నీ తెలుసు. ఇది బికారి వాళ్ల కొంప అని తెలిసి కూడా నన్ను తీసుకొచ్చి ఈడ పడేశారు. ఎట్లా ఉంటా అనుకున్నాడు. నేను ఏమైపోవాలి అనుకున్నాడు.
విశాలాక్షి: నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్.. నవ్వొచ్చు కదా అమ్మ..
నందిని: ఎప్పుడు పడితే అప్పుడు నవ్వడం నాకు చేతకాదు.
విశాలాక్షి: పోనీలే నవ్వు వచ్చినప్పుడే నవ్వు ఎదురు చూస్తూ ఉంటాను. పాయసం నీ కోసమే అని తినిపించబోతే వద్దు అనేస్తుంది. ఇష్టం లేదా..
నందిని: అన్నీ ఇష్ట ప్రకారమే జరగాలి అంటే కుదరదు అని మా బాపు చెప్పిండు. పాయసం ఇవ్వాలి అని కాదు ఏదో చెప్పాలి అని వచ్చావ్ కదా చెప్పు.
విశాలాక్షి: మీ బాపు చెప్పింది నీ విషయంలోనే కాదమ్మా. అందరి విషయంలోనూ నూటికి నూరు పాళ్లు నిజం. జీవితంలో అనుకోని, ఇష్టం లేని సంఘటనలు జరుతుతూనే ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేం. గతంలో జరిగిన సంఘటనలు మర్చిపోతే ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ నిజాన్ని మేం అంతా సంతోషంగా ఒప్పుకున్నాం. ప్రేమగా నిన్ను అక్కున చేర్చుకుంటున్నాం. నువ్వు కూడా నీ మనసుకు నచ్చచెప్పుకోవాలి. అత్తింట్లో అడుగుపెట్టగానే ఆడపిల్ల అత్తామామల్లో అమ్మానాన్నలను వెతుక్కుంటుంది. అత్తింట్లో అందరూ కూతురిలా చూసుకోవాలి అనుకుంటుంది. ఎవరికో తప్ప అందరికీ ఆ అదృష్టం దొరకదు అమ్మ. కానీ ఇప్పుడు నీకు దొరుకుతుంది. అలా అని నేను నీకు మాటిస్తున్నాను. ఇక్కడ నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. అప్పటి వరకు నీకు ఏం అవసరం ఉన్నా ఈ అమ్మని అడుగు. ఇక్కడ నీకు ఎవరు శత్రువులు లేరు అందరూ నీ వాళ్లే హర్షతో సహా.
క్రిష్ ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుంటారు. సత్య తన గదిలో జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహదేవయ్య కొత్త కోడలు రాలేదు అని అంటాడు. దీంతో రేణుక కొత్త కద అందరితో కలవడానికి టైం పడుతుంది అని అంటుంది. ఇక రుద్ర అయితే గదిలో ఉంటే అలా ఉంటుందని ఆవిడ గారిని బయటకు రమ్మని అందరితో ఉండమని చెప్పండి అని రుద్ర అంటాడు.
భైరవి: కొత్త కోడలి సంగతి అటు ఉంచరా. నీ తమ్ముడే ఇంత వరకు గది విడిచిపెట్టి బయటకు రాలే.
మహదేవయ్య: అరే ఏందే నీ కడుపు మంట. కొత్తగా పెళ్లి అయింది ముద్దు ముచ్చట్లు ఆడుకుంటున్నారేమో వదిలేయ్ రాదు. ఎందుకు లొల్లి పెడుతున్నావు.
భైరవి: నేను లొల్లి పెట్టడం లేదు. కొత్త కోడలి గురించి అడిగింది నువ్వు నీకు సమాధానం చెప్తున్నా అంతే.
మహదేవయ్య: నాకు సమాధానం చెప్పినట్లు లేదు సూదులతో పొడుస్తున్నట్లు ఉంది.
ఇక క్రిష్ వచ్చి ప్లేట్‌లో భోజనం వడ్డించుకొని తన గదికి తీసుకెళ్తాడు. తన భార్య కోసం తీసుకెళ్తున్నాను అని అంటే.. ఇక్కడే వచ్చి తినొచ్చు కదా పరాయి వాళ్లు ఎవరు ఉన్నారని మహదేవయ్య అడుగుతాడు. దీంతో క్రిష్ నవ్వి కూర చాలా బాగుంది అని భోజనం తీసుకొని గదికి వెళ్తాడు.
క్రిష్: అటు తిరిగి చూస్తే ఏముంటుంది. ఇటు తిరిగి చూస్తే నేను ఉంటా..
సత్య: ఏంటది..
క్రిష్: ఏం చేయమంటావ్ చెప్పు సంపంగి. నీకు గోరు ముద్దులు పెట్టాలని మనసైంది. అక్కడ అందరి ముందు కష్టం కదా. అందుకే ఇక్కడికే ప్లేట్ తీసుకొచ్చా. రా కూర్చో.
సత్య: నాకు ఆకలిగా లేదు.
క్రిష్: ఎందుకు అలా పెళ్లికి ముందు ఎప్పుడో తిన్నావ్. నీరసం వస్తుంది. కండ్లు తిరుగుతాయ్. నాకు గోరు ముద్దలు పెట్టాలి అని ఉందిరా .. రా సత్య రా.. అదేంటో సంపంగి నీ కోసం ప్లేట్‌లో వడ్డించుకొని తీసుకొస్తుంటే అందరూ నన్ను పిచ్చోడిని చూసినట్లు చూస్తున్నారు. మొగుడిని కదా ముచ్చట్లు ఉంటాయి కదా అంత మాత్రం తెలీదా ఏంటి. అని సత్యకు తినిపిస్తాడు. ఎవరూ ఏమీ అనుకోరు అని తినిపిస్తాడు. ఇది కదా ప్రేమ అంటే. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.