అన్వేషించండి

Satyabhama Serial Today June 14th: సత్యభామ సీరియల్: రేణుకకి అబార్షన్ చేయించడానికి డాక్టర్‌తో మాట్లాడిని రుద్ర.. క్రిష్‌కి విషయం చెప్పాలనుకున్న సత్య!

Satyabhama Serial Today Episode రేణుకకి కడుపు తీయించాలి అని రుద్ర డాక్టర్‌తో మాట్లాడటం విన్న సత్య విషయం క్రిష్‌కి చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య క్రిష్‌కి సపర్యలు చేస్తుంటుంది. క్రిష్‌కి మెలకువ వస్తుంది. పక్కన సత్యని చూసి ఆశ్చర్యంగా చూస్తాడు. సత్య తడిగుడ్డ తల మీద పెడుతుంటే వద్దు నాకు ఇష్టం లేదు అని అంటాడు. దానికి సత్య ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నేను కూడా వద్దు అన్నాను నువ్వు విన్నావా అని అడుగుతుంది. ఇష్టం లేని మనిషికి సేవలు చేయడం ఎందుకు అని క్రిష్‌ అడిగితే ఇది తన బాధ్యత అని సత్య చెప్తుంది. ఇంట్లో అందరూ తనని దులిపేసి వెళ్లారని క్రిష్‌తో సత్య చెప్తుంది. 

ఇక క్రిష్ లేవడానికి ప్రయత్నిస్తాడు. క్రిష్ పడిపోతుంటే సత్య పట్టుకుంటుంది. క్రిష్ తనని పట్టుకోవద్దని చెప్తాడు. ఇక సత్య క్రిష్‌ని కూర్చొపెట్టి టిఫిన్ తీసుకొచ్చి బలవంతంగా తినిపిస్తుంది. తర్వాత ట్యాబ్లెట్స్ వేస్తుంది. తర్వాత క్రిష్‌ని పడుకోపెడుతుంది. ఇక తనలో తాను ఏ హక్కుతో క్రిష్ మీద పెత్తనం చెలాయిస్తున్నానో తెలీదు అనుకుంటుంది. ఇక క్రిష్ మనసులో అనవసరంగా నన్ను డిస్ట్రబ్ చేస్తున్నావ్  తర్వాత నేను ఎంత ఇబ్బంది పడతానో నీకు ఎం తెలుసు సత్య అని అనుకుంటాడు. 

రుద్ర: మీరు ఏ ఊరిలో ఉన్నా నాకు తెలీదు డాక్టర్ మీరు వెంటనే రావాలి. ఆపరేషన్ చేయాలి అంతే. 
సత్య: ఆపరేషన్ అంటున్నారు ఏంటి ఎవరికి.
రుద్ర: అవును డాక్టర్ మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత ఇలా జరగకుండా చూసుకుంటాం. ఈ సారి మాత్రం ముందు సారిలాగే కడుపులో బిడ్డను తీసేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఈరోజు వస్తాం. పని పూర్తి అయిపోవాలి.
సత్య: అయ్యో అక్క ప్రెగ్నెన్సీ గురించి బావగారికి తెలిసిపోయిందా. బిడ్డని తీసేయాలి అనుకుంటున్నారా. అర్జెంటుగా ఈ విషయం అక్కకి చెప్పాలి. సత్య రేణుకకి చెప్తుంది. పరిస్థితి చేయి జారిపోయింది అక్క. ఇక లేని పోని ఆశలు పెట్టుకోకు. పద నీ ప్రెగ్నెన్సీ విషయం మామయ్యకి చెప్పేద్దాం. ఈ పరిస్థితిలో ఆయన ఒక్కరే నీకు అండగా నిలబడగలరు. పద అక్క.
రేణుక: సత్య ఆగు మామయ్యకి చెప్తే బిడ్డ ప్రాణం దక్కుతుంది అని నువ్వు అనుకుంటున్నావ్. కానీ బిడ్డ ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా దక్కదు సత్య.
సత్య: అక్క చేయి చేతులా నువ్వే నీ జీవితం నాశనం చేసుకుంటున్నావ్.
రేణుక: బతికిమాలుకుంటేనే పని అవుతుంది. నా ఖర్మకి నన్ను వదిలేయ్ సత్య. నా తంటాలు నేను పడతాను. దయచేసి నా సమస్యకు నువ్వు దూరంగా ఉండు. పట్టించుకోకు ఎవరికీ చెప్పకు. 
సత్య: సరే అక్క ఊరుకుంటాను. కానీ పరిస్థితి హాస్పిటల్‌ వరకు వెళ్తే మాత్రం చూస్తూ ఊరుకోను. ఎంత దూరం అయినా వెళ్తాను.

సత్య, రేణుకల మాటలు రుద్ర వింటాడు. ఏం చేయాలో ఎలా చేయాలో తనకు బాగా తెలుసు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు నందిని గదిలో తింటుంటే హర్ష వచ్చి భర్తతో కలిసి తినాలి అని కూడా లేదా అని అంటాడు. ఇక హర్ష స్నానానికి వెళ్తాడు. ఇంతలో హర్ష ఫోన్‌కు మైత్రి కాల్ చేస్తుంది. నందిని చూస్తుంది. వీడికి ఎవరు కాల్ చేస్తే నాకు ఏంటి అనుకుంటుంది. మళ్లీ మైత్రి కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హర్షతో మాట్లాడాలి అని మైత్రి అంటుంది. నందిని హర్ష ఫోన్ వదిలేసి వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఇంతలో హర్ష వస్తే మాట్లాడుతాడు. ఇద్దరూ మైత్రి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మైత్రి నీకు ఫోన్ చేయడం నాకు నచ్చడం లేదు అని నందిని చెప్తుంది.

సత్య రేణుక ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తుంది. విషయం క్రిష్‌కి చెప్పాలి అనుకుంటుంది. మరోవైపు రుద్ర సత్య మాటలు గుర్తు చేసుకొని రేణుకని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం కష్టమని సత్య కాపలా ఉంటుందని అనుకుంటాడు. సత్యకు తెలీకుండా తీసుకెళ్లాలి అనుకుంటుంది. ఇంతలో క్రిష్ రెడీ అయి బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. ముఖ్యమైన విషయం చెప్పాలి నీతో మాట్లాడాలి అని సత్య అంటుంది. క్రిష్ విడిపోవడానికి నాలుగు నెలలే ఉంది ఇంకేం మాట్లాడుకోవడం ఎందుకు అని అంటాడు. ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడాలి అని సత్య అంటే ఉన్న నాలుగు నెలలు నీకు మా విషయాలు ఎందుకు అని ప్రశాంతంగా నువ్వు ఉండు అని క్రిష్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: ఉలూచిని తిరిగి ఆడపిల్లలా మార్చిన విశాలాక్షి.. సుమన కుట్రను బయట పెడుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget