అన్వేషించండి

Satyabhama Serial Today February 15th: సత్యభామ సీరియల్: క్రిష్‌ని మెడ పట్టుకొని గెంటేసిన విశ్వనాథం.. మాధవ్‌, సత్యల పెళ్లి క్యాన్సిల్ చేసేసిన శేఖర్!

Satyabhama Serial Today Episode సత్య వల్ల మాధవ్‌కి ప్రమాదమని శేఖర్ పెళ్లి క్యాన్సిల్ చేసేసి మాధవ్‌ని అమెరికా తీసుకెళ్లిపోతామని విశ్వనాథం ఫ్యామిలీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode కోమాలో ఉన్న మాధవ్‌ని తీసుకొని అమెరికా వెళ్లిపోదాం అని శేఖర్ సునందతో చెప్తాడు. విశ్వనాథం ఒప్పించే ప్రయత్నం చేస్తే తనకు ఏం చెప్పొద్దని శేఖర్ అంటాడు. సత్య రూపంలో అదృష్టం తన ఇంటికి వస్తుంది అనుకుంటే దురదృష్టమే మిగిలింది అని బాధపడతాడు. చాలా నష్టపోయామని ఏడుస్తాడు. ఇక ఎవరు ఏం చెప్పినా అమెరికా వెళ్లిపోతామని అంటాడు.. ఆ రౌడీని ఎదురించడానికి మా వాడిని పణంగా పెట్టలేమని అంటాడు..

విశ్వనాథం: పోనీ కనీసం మాధవ్ కోమాలో నుంచి బయటకు వచ్చేంత వరకు అయినా ఆగరా..
శేఖర్: రేయ్ వాడు కోమా నుంచి వచ్చాక మా మాట వినడురా. మమల్ని అయినా వదులుకుంటాడు కానీ సత్యని వదులుకోడురా. అర్థమైంది కదా మా బాధ. సత్య మా కోడలు అవ్వడం మాకు కూడా ఇష్టమేరా కాకపోతే తన పుట్టింటి సారితో పాటు ఆ రౌడీల తాళుక సమస్యలను కూడా మా ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు మీలా మేం కూడా ప్రతీరోజు నరకం అనుభవించాల్సి వస్తుందిరా. మాకు అంత ఓపిక లేదురా.. మమల్ని క్షమించండిరా.. రేయ్ సత్యకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి రా..
శాంతమ్మ: శేఖరం ఒక్కసారి ఆలోచించరా.. 
శేఖర్: సునంద వెళ్దాం పద. డాక్టర్‌తో మాట్లాడి మాధవ్‌ని అమెరికా తీసుకెళ్లొచ్చో లేదో అడుగుదాం పద. 
విశ్వనాథం: క్రిష్‌ని చూసి.. ఎందుకు వచ్చావ్ ఎందుకు వచ్చావ్‌రా అది చచ్చిందో లేదో చూద్దాం అని వచ్చావా.. లేక చావకపోతే మరో కత్తిపోటు పొడుద్దాం అని వచ్చావా..అయిపోయిందిరా నీ కారణం వల్ల నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. కుదిరిన సంబంధం కూడా చెడిపోయింది. నా పరువు పోయింది. మా ఇంట్లో సంతోషం అనేదే లేకుండా పోయింది. జీవచ్ఛవంలా బతుకుతున్నాంరా. చాలా ఇదినీకు చాలా.. సంతోషమేగా.. నువ్వు కోరుకున్నది ఇదేగా.. నీలాంటి రౌడీలకు భయపడి దాన్ని ఆశలను, ఆశయాలను తొక్కేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి అనుకున్నాను. కానీ దాన్ని నువ్వు చావు బతుకుల దాకా తీసుకొచ్చావు. నిన్ను ప్రేమించలేదని చెప్పిందనే కదా చంపేస్తావా..
క్రిష్‌: మాస్టార్ సత్యని కత్తితో పొడిచింది నేను కాదు ఆ కాళీగాడు.
విశ్వనాథం: నువ్వు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు ఇక చాలు బాబు. అసలు నువ్వు నా శిష్యుడివే కాదు కదా అది కూడా అబద్ధమే కదా.
క్రిష్‌: అది మాత్రమే అబద్దం. సత్య కోసం మీకు దగ్గర అవ్వాలని మీకు అబద్ధం చెప్పాను మాస్టారు.
విశ్వనాథం: నీకు ఓ చెల్లులు ఉంది కదా తనని ఎవరైనా ఇలా చేస్తే చూస్తూ ఊరుకుంటావా.. మీ చెల్లికి ఓ న్యాయం నా కూతురుకి ఓ న్యాయమా.. నువ్వు ఇంకా ఇలాగే నా కూతురు వెంట పడితే నా కుటుంబం మొత్తం విషం తాగి చనిపోతాం. కానీ నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను. నీలాంటి నీచుడిని..మృగాన్ని నా అల్లుడిగా చేసుకోను.
క్రిష్: మీరు ఆవేశంలో ఉన్నారు మాస్టారు నిజాలు చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు. నేను ఏం చెప్పినా నమ్మడం లేదు. నేను మీ శత్రువుని కాదు నన్ను నమ్మండి.
విశ్వనాథం: వద్దు నీ మాయమాటలతో కొత్త నాటకం మొదలు పెట్టొద్దు. వెళ్లు ఇక్కడి నుంచి. 
క్రిష్‌: మాస్టార్ ఒక్క సారి నేను సత్యని చూడాలి.. సత్య నా ప్రాణం. మీ ఎవర్నీ ఇబ్బంది పెట్టను దూరం నుంచి చూసి వెళ్లిపోతాను. 
విశ్వనాథం: ఇంకా సత్యని ఏం చూస్తావ్‌రా. నేను చచ్చినా సత్యని చూడనివ్వను. నీ గాలి కూడా సత్యను తాకనివ్వను. అంటూ కాలర్ పట్టుకొని బయటకు తోసేస్తాడు. నువ్వు ఇంకోసారి నా కూతురు ముఖం చూడొద్దు. దాని జీవితంలోకి ఇంకెప్పుడూ రావొద్దు. 
హర్ష: సరిపోతుందా నాన్న నా చేతులు కట్టేశారు. మీరు వాడిని వదిలేశారు. చెల్లిని ఈ స్థితికి చేయాల్సిన వాడికి వేయాల్సిన శిక్ష ఇదేనా.. వాడు తప్పు చేశాడు నాన్న.
విశ్వనాథం: తప్పు చేసింది వాడు కాదురా నేను. దాని బతుకు దానికి బతకనివ్వకుండా అడ్డుకున్నాను. పెళ్లి అని కంగారు పెట్టాను. కన్నతండ్రిలా కాకుండా కసాయివాడిలా ప్రవర్తించాను. నామీద గౌరవంతో తలవంచింది. దాని ఫలితం అందరం చూశాం కదా. చావు బతుకుల మధ్య అది యుద్ధం చేస్తుందిరా. చూడరా.. ఇక ఏ విషయంలోనూ సత్యను బాధ పడనివ్వను.
విశాలాక్షి: ఏవండి సత్య కళ్లు తెరవగానే మాధవ్ గురించి అడుగుతుంది. ఏం చెప్పాలి.
విశ్వనాథం: నిజం చెప్పాలి అంతే.. 

ఇంతలో సత్య కళ్లు తెరుస్తుంది. అందరూ సత్య దగ్గరకు వెళ్తారు. బాబీ పరుగున వచ్చి సత్య కళ్లు తెరిచిందని క్రిష్‌తో చెప్తాడు. క్రిష్ పరుగున వెళ్తాడు. కానీ విశ్వనాథం మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతాడు. ఇక సత్య మాధవ్ గురించి అడుగుతుంది. 

విశాలాక్షి: మాధవ్‌కి పర్వాలేదు అమ్మా. ట్రీట్మెంట్ జరుగుతుంది.
సత్య: ఒకసారి చూడాలమ్మ. 
విశాలాక్షి: ఇప్పుడు కాదు తర్వాత చూద్దవులే. నీకు ఇప్పుడు రెస్ట్ అవసరం.
సత్య: అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడ.. మాధవ్‌కి ప్రమాదం ఏం లేదు కదా.. నేను శేఖర్‌ అంకుల్ వాళ్ల ఇంటికి వెళ్లకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు అమ్మ. మీరు నా పెళ్లి గురించి పడుతున్న మెంటల్ టార్చర్ చూసి బాధగా అనిపించింది. ఈ పెళ్లి చేసుకోకపోతే అసలేంటి అనిపించింది. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు అనిపించింది. అదే మాట చెప్పాలని మాధవ్‌ వాళ్ల ఇంటికి వెళ్లాను. మీకు చెప్పకుండా వెళ్లడం తప్పే కానీ జరుగుతున్న అనార్థాలను ఆపడానికి వేరే దారి కనపడలేదు. అందుకే ఎంగేజ్ మెంట్ రింగ్ తీసుకొని మాధవ్ చేతిలో పెట్టాను. కానీ వాళ్లు ఎవ్వరూ నా ఆలోచనల్ని ఒప్పుకోలేదు. మాధవ్ గారి నచ్చచెప్పి నా మనసు మార్చారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు అండగా నిలబడతాను అన్నారు. మాధవ్ చాలా మంచివారు అమ్మ. 
విశాలాక్షి: జరిగినదాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు రెస్ట్ తీసుకోమ్మా.
సత్య: మాధవ్ గారికి ప్రమాదం లేదు అని తెలిశాక మనసు ప్రశాంతంగా ఉందమ్మ. నేను కోలుకోవడం కన్నా తను కోలుకోవడం ముఖ్యం. నానమ్మ పెళ్లి ఆగిపోతుంది అని నువ్వేం కంగారు పడకు. నాకేం కాలేదు కదా ఇక పెళ్లి పనులకు రెడీ అయిపో. 

క్రిష్‌ డాక్టర్ గెటప్‌లో సత్య దగ్గరకు వస్తాడు. సత్య మాట్లాడటం చూసి హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో సత్యకు దగ్గు వస్తుంది. విశ్వనాథం క్రిష్ డాక్టర్ అనుకొని వచ్చి చూడమంటాడు. క్రిష్ ఏం చేయాలి ఇప్పుడు దొరికిపోతాను అనుకుంటాడు. ఇంతలో నర్సు రాగానే చూడమని చెప్పి క్రిష్ తప్పించుకుంటాడు. సత్యని ఆ పరిస్థితిలో చూసి క్రిష్‌ బాధపడతాడు. జాగ్రత్తగా చూసుకోమని సిస్టర్‌కి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 15th: సడెన్‌గా అమెరికా వెళ్లిన భవాని.. రీజన్ తెలిసి షాక్‌లో ఫ్యామిలీ.. బెస్ట్ కపుల్‌గా కృష్ణ, మురారి!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget