Satyabhama Serial Today April 19th: సత్యభామ సీరియల్: సత్యని అలా చూసిన క్రిష్ మతిపోయిందిగా.. టామ్ అండ్ జర్రీ వార్ మామూలుగా లేదు!
Satyabhama Serial Today Episode : సత్యను కౌగిలించుకున్న క్రిష్‌ను సత్య నెట్టేసి దారుణంగా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode సత్య ఫ్యామిలీ అంతా గుడికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న తనతో క్రిష్ ఎలా ప్రవర్తిస్తాడో అని సత్య భయపడుతుంది. అమ్మానాన్నలు వచ్చే వరకు ఏదో ఓ పని చేస్తున్నట్లు వంటింట్లోనే గడిపేస్తాను అనుకుంటుంది. క్రిష్ హ్యాపీగా పడుకుంటాడని అనుకుంటుంది.
సత్య: మంచి సువాసన వస్తుంది ఎక్కడ నుంచి.
క్రిష్: ఇక్కడ నుంచి.. నిజంగానే స్మెల్ అంత బాగుందా.. మనసులో.. వంట ఇంటిలో పెళ్లానికి సాయం చేస్తే అత్తింట్లో మార్కులకు కొట్టేయొచ్చు కదా.. సత్య ఇలా ఇవ్వు నేను కూరగాయలు కట్ చేస్తా..
సత్య: డోంట్ యాక్ట్ స్మార్ట్.. చూడటానికి ఇంట్లో ఎవరూ లేరు.
క్రిష్: అవునా అదేదో ముందే చెప్పొచ్చుకదా.. ఏమన్నావ్.. ఇంట్లో ఎవరూ లేరా..
సత్య : అయ్యో అనవసరంగా చెప్పేశానా..
క్రిష్: అయితే ఎవరూ లేరా.. అవును ఎక్కడికి పోయారు..
సత్య: గుడికి వెళ్లారు.
క్రిష్: అంటే గంటన్నర వరకు రారు.. అసలు వాళ్లు గుడికి ఎందుకు వెళ్లారో తెలుసా..
సత్య: రేపు మనం దాంపత్య వ్రతం చేయాలి అంట దానికోసం పంతులు గారితో మాట్లాడటానికి వెళ్లారు.
క్రిష్: అది మీది మీది మాట అసలు కారణం ఏంటి అంటే మనకు ఏకాంతం ఇవ్వడానికి. మనం ఎన్ని సినిమాల్లో చూడలే..
సత్య: ఇక ఆపుతావా.. మనం నటించాల్సింది అమ్మవాళ్ల ముందే.. ఎప్పుడు పడితే అప్పుడు కదా. ఇక హాల్‌లోకి వెళ్లు.
క్రిష్: సరే నేను టీవీ చూసుకుంటా కాఫీ తీసుకొని రా..
సత్య: ఇది నువ్వు కాఫీ తాగే టైం కాదుకదా..
క్రిష్: పర్లేదు ఇచ్చేయ్ మందులా ఫీలై తాగేస్తా..
టీవీలో రొమాంటిక్ సాంగ్ చూసిన క్రిష్ దేవుడికి తిట్టుకుంటాడు. డాక్టర్ పత్తిం చెప్పినప్పుడే మనసు బిర్యానీ మీదకు మళ్లినట్లు ఉంది నా పరిస్థితి అనుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక కిచెన్‌లో సత్య వంట చేస్తుంటే అలా చూస్తూ ఉంటాడు. చిలిపిగా నవ్వుకుంటాడు. అది సత్య చూసేస్తుంది. దీంతో క్రిష్ ఫోన్ తీసుకోవడానికి వచ్చానని కవర్ చేస్తాడు. మళ్లీ సత్యని చూడగా సత్య వారించడంతో వెళ్లిపోతాడు.
సత్య కాఫీ తీసుకొని వస్తుంది. సత్య నడుముని చూసిన క్రిష్ టీవీలో పాటలు ఆపేసి ఆంజనేయ స్వామిని తలచుకుంటాడు. ఇంతలో సత్య కాఫీ అని అనగానే ఏంటి స్వామి అమ్మాయి వాయిస్‌లో మాట్లాడుతున్నావని అంటాడు. ఇక కళ్లుమూసుకొని ఉన్న క్రిష్ సత్యకే కాఫీ తాగించమని అంటాడు. సత్య తిడితే నేను కళ్లు మూసుకున్నా అందుకే నిన్ను తాగించమన్నా.. కళ్లు తెరిస్తే అక్కడెక్కడో చిక్కుకుపోతాయని అంటాడు. ఎక్కడ చిక్కుకుపోతాయని సత్య అంటే ఓరకంటితో నడుమును చూస్తాడు.
సత్య: ఒక్కసారి చెప్తే సిగ్గు ఉండాలి.
క్రిష్: సిగ్గు ఉండాల్సింది నాకు కాదు నీ చీర కొంగుకు. దానికి ఇష్టం వచ్చినట్లు అది చూస్తుంటే నాకు కన్ను దానికి నచ్చినట్లు అది చూస్తుంది. నేను ఉప్పూకారం తింటున్నా ఆమాత్రం ఉంటుంది. ఇంతదానికే నీ నడుము కరిగిపోయిందా.. మొగుడు అన్న సోయ లేదా. నువ్వు నీ మిలటరీ రూల్స్..
రొమాంటిక్ పాటలు చూస్తున్న క్రిష్ ఇక నావల్ల కాదు అనుకొని గదిలో బట్టలు మడత పెడుతున్న సత్య దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటాడు. వదలమని సత్య చెప్తుంది. దీంతో క్రిష్ ఇంత మంచి ఏకాంతాన్ని వదులుకోను ఏమనుకోకు సంపంగి అంటే సత్య క్రిష్‌ని తోసేస్తుంది.
సత్య: నువ్వు మనిషివా పశువువా.. ప్రేమించాను ప్రేమించాను అని గుండెలు బాధుకొని అరుస్తావు ఇదేనా ప్రేమంటే. దీన్ని ప్రేమ అనరు ఒళ్లు పొగరు అంటారు. మేనర్స్ లెస్ ఫెలో.. అలా కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతాను అనుకుంటున్నావా.. నాటకాలు ఆడకుండా ఇప్పటికైనా ఒప్పుకో నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు మోహం అని. నీకు కావాల్సింది నేను కాదు నా శరీరం అని.. ఆ మాటకు క్రిష్ సత్యను కొట్టడానికి వెళ్లి ఆగిపోతాడు.
క్రిష్: అసలు ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావ్. నాకు చదువు లేదు అను ఒప్పుంటా.. మొండోడిని అను ఒప్పుకుంటా.. కానీ నీ మీద నా ప్రేమను తప్పు పడితే మాత్రం అస్సలు ఒప్పుకోను. నీకు నా మీద ఉన్న ద్వేషం కన్నా నాకు నీ మీద ఉన్న ప్రేమే గొప్పది. అదే నిజం. ఇంకో జన్మ ఎత్తినా ఈ విషయం నీకు తెలీదు.
సత్య: అసలు నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి ఇలా ప్రవర్తించడమా.. నీ మీద నాకు ప్రేమ లేదు అని చెప్పినా నీ బుర్రకు ఎక్కదా.. నీ శరీరంతో తప్ప నా మనసుతో నీకు పనిలేదా..
క్రిష్: ఏయ్.. ఇక ఆపుతావా.. ఏదో ఒకరోజు నువ్వు మారుతావు అనుకున్నా నీది ఇంత రాతిగుండె అనుకోలేదు. ఈ మాట ముందే తెలిసుంటే అసలు నీ వెంట పడేవాడినే కాదు. నిన్ను ప్రేమించే వాడిని కూడా కాదు. తప్పు చేశా.. అవసరం కోసం ఇక ఇలా కలిసి ఉండటం నా వల్ల కాదు.
సత్య: నాకు అంత కంటే ఇష్టం లేదు.. క్రిష్ సత్యకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.. ఆగు.. ఇంటికి వెళ్లాక సత్య ఏది అంటారు ఏమని చెప్తావ్..
క్రిష్: నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్ అని అడుగుతారు. ఇష్టం లేని మనిషితో బతుకుడు కష్టం అని విడిచి పెట్టి చేతులు దులుపుకొని వచ్చానని చెప్తా. భయమా..
సత్య: నీకు అబద్ధాలు చెప్పడమే వచ్చానుకున్నాను.. నిజాలు చెప్పడం కూడా వచ్చా..
క్రిష్: రెచ్చగొట్టకు కాలుతుంది..
సత్య: తప్పదు భరించు.. ఇన్ని రోజులు నచ్చకపోయినా నేను నిన్ను భరించలేదా.. నా కోసం యుద్ధాలు చేశాను అన్ని చెప్పావు మరి అంత గొప్పోడివి సత్యను వదిలాను చెప్తే మీ వాళ్లు ఊరుకుంటారా..
క్రిష్: లేకపోతే ఉరి వేస్తారా.
సత్య: నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు అనగానే మినిస్టర్ సంబంధం విషయంలో తగ్గిన మీ నాన్నకి నన్ను వదిలేశావ్ అని తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా.. నందిని ఏం చేస్తుందో తెలుసా.. అనగానే క్రిష్ వాళ్లని తలచుకొని భయపడతాడు. సినిమా కనిపించిందిగా నీ పరిస్థితి అర్థమైందికదా..
క్రిష్: నా సంగతి సరే మరి నువ్వు తక్కువ చేశావా.. మీ వాళ్లని ఎదురించి నన్ను ఇంటికి పిలిచి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పావ్. నా కోసం పెళ్లిలో మీ నాన్నని ఎదురించావ్. ఇప్పుడు నాతో తెగతెంపులు చేసుకున్నావని తెలిస్తే ఎలా తిడతారో తెలుసా.. నీ కోసం మా చెల్లిని పెళ్లి చేసుకున్న మీ అన్న ఏం చేస్తాడో తెలుసా.. జీవితంలో నిన్ను నమ్మను అని చెప్తాడు. అందరూ పనికి రానిదాని లెక్క చూస్తారు. నన్ను ప్రశ్నించడం కాదు నిన్ను నువ్వు కూడా ప్రశ్నించుకో..
సత్య: రైట్ కాంప్రమైజ్ అవుదాం..
క్రిష్: నేను వెనకనుంచి పట్టుకున్నప్పుడు కాంప్రమైజ్ అయితే ఇంత లొల్లి జరిగేది కాదు కదా.
సత్య: నేను అంటుంది ఆ విషయం గురించి కాదు. మనం కలిసి ఉండటానికి..
క్రిష్: నాతో కాదు..
సత్య: చూడు మన మధ్య గొడవ ఇప్పుడు తేలేది కాదు. పండం అయిన వరకు మనం ఈ ఇంట్లో పబ్బం గడుపుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో మీ ఇంటికి వెళ్లాక ఆలోచిద్దాం.
క్రిష్: నువ్వు నీ కోసం కాంప్రమైజ్‌కు వచ్చావ్. నా కోసం కాదు. సర్లే ఈ డీల్ నాకు ఓకే..
మరోవైపు మహదేవయ్య హాల్‌లో ఉంటే నందిని అక్కడికి వస్తుంది. బంగారు తల్లి అల్లుడు ఎక్కడ అంటే నా పక్కన అల్లుడు లేకపోతే నాతో మాట్లాడవా అని అరుస్తుంది. దీంతో మహదేవయ్య నిన్ను అల్లుడిని పక్కపక్కన చూస్తే సంతోషంగా ఉంటుందని అంటే నందిని నాకు బాపుతో ఉంటేనే సంతోషం అని అంటుంది. తండ్రి దగ్గర ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.