Satyabhama Serial Today September 16th: సత్యభామ సీరియల్: భర్త ముందే రౌడీలను చితక్కొట్టిన సత్య.. రేపే రెండు జంటలకు ఫస్ట్‌నైట్!
Satyabhama Today Episode సత్య క్రిష్‌లకు తొలిరేయి ఏర్పాటు చేశారని తెలుసుకున్న నందిని తన బాధ అత్తమామలకు అర్థమయ్యేలా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode సత్య, క్రిష్ ఇద్దరూ గుడికి వస్తారు. క్రిష్ సత్యని ఆటపట్టిస్తే సత్య శోభనం క్యాన్సిల్ చేయిస్తానని బెదిరిస్తుంది. దాంతో క్రిష్ మరేమనను అని అంటాడు. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తారు. పూజ అయిపోగానే సత్య క్రిష్‌కి బొట్టు పెడుతుంది. క్రిష్ సత్యతో నీ గురించి మొత్తం నాకు తెలుసని అంటాడు. సత్య ఆలోచించకుండా నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పు అని అంటే క్రిష్ తడబడతాడు. సాయంత్రంలో పుట్టిన రోజు ఎప్పుడో చెప్తే జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని అంటుంది. తన ఇంట్లో వాళ్లకి అడగొద్దని కండీషన్ పెడుతుంది..
విశాలాక్షికి జయమ్మ కాల్ చేస్తుంది. క్రిష్, సత్యలకు ఈ రోజు రాత్రికి శోభనం అని మీరు వచ్చి దీవించాలని అంటుంది. విశ్వనాథం తన భార్యకి రామని చెప్పమని సైగ చేస్తాడు. విశాలాక్షి అదే చెప్తుంది. దాంతో జయమ్మ ఏమైందని అడుగుతుంది. మేం వచ్చిన ప్రతీ సారి అక్కడ గొడవ అవుతుందని రామని చెప్తుంది. జయమ్మ ఎంత చెప్పినా విశాలాక్షి రానని చెప్పేస్తుంది. ఇక నా మనవరాలు ఎలా ఉందని అడుగుతుంది జయమ్మ. విశాలాక్షి నందినికి పిలిచి ఫోన్ ఇస్తుంది.
నందిని: బామ్మ నీ కోడలు పర్మిషన్ తీసుకొని ఫోన్ చేస్తున్నావా.
జయమ్మ: నేను దాని పర్మిషన్ తీసుకోవడం ఏంటే ఇది నా ఫోన్ నాకు నచ్చిన వాళ్లతో నేను మాట్లాడుతా. ఇక్కడున్నది జయమ్మ. ఇక్కడ మీ చిన్నన్నకి వదినకు ఈరోజు రాత్రికి శోభనం ఏర్పాటు చేశాం.
నందిని: చేస్తారే ఎందుకు చేయరు వాళ్లు అదృష్టవంతులు వాళ్ల మంచి చెడులు చూసుకోవడానికి పక్కన నువ్వు ఉన్నావ్ కదా. నేనే దురదృష్టవంతురాల్ని.
జయమ్మ: నీకేమే పువ్వుల్లో పెట్టుకొని చూసుకొనే అత్తామామలు ఉన్నారు కదా.
నందిని: పువ్వుల్లో పెట్టుకొని చూసుకొని అత్తామామలు ఉన్నారు కానీ పువ్వులు చల్లి శోభనం చేసే వాళ్లు లేరు. అడవిలో చెట్టు లెక్క ఉంది నా పరిస్థితి నీకు చెప్పుకొని ఏం లాభంలే నా తలరాత అలా ఉంది.
విశాలాక్షి: ఇంత చిన్న విషయం మనం ఎందుకు పట్టించుకోలేదు.
విశ్వనాథం: బాగుంది వాళ్లు కలిసి ఉన్నారని మనం అనుకున్నాం. కానీ మనకేం తెలుసు. వాడికి అయినా బుద్ధి ఉండాలి కదా. కోడలు చక్కగా మనతో కలిసి పోయింది. ఇంకా తనని దూరం పెట్టాలా వాడిని పిలు చెప్తాను.
విశాలాక్షి: నందిని కంప్లైంట్ చేసిందని తన మీద అరుస్తాడు. ఈ రోజు ముహూర్తం ఉంది కదా సైలెంట్‌గా వాళ్లకి శోభనం ఏర్పాటు చేద్దాం.
క్రిష్ సత్య వెళ్తుంటే ఒక వ్యక్తి సత్యకి ఢీ కొట్టి అడిగితే కన్ను కొట్టి ఫ్లైయింగ్ ముద్దు ఇస్తాడు. సత్య క్రిష్‌కి కంప్లైంట్ ఇస్తే నేను సూపర్ పెళ్లానికి మొగుడిని నా పెళ్లాం ఊరమాస్. నువ్వు గణపతి లాంటి దానివి నీ కోసం నేను వెళ్లి ఫైట్ చేస్తే నీకు అవమానం కదా అని సత్యని ఇరికించాలని చూస్తాడు. సత్యకి క్రిష్ ప్లాన్ అర్థమై చీర కొంగు బిగించి ఆకతాయితో పాటు మరో ఇద్దరిన్ని కొబ్బరికాయ టవల్‌లో చుట్టి చితక్కొడుతుంది. సత్య కొట్టుడికి క్రిష్ ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. నొల్చొని చూస్తూ ఉండిపోతాడు.
మైత్రి ఆరుబయట డల్‌గా కూర్చొని ఉంటే హర్ష అక్కడికి వచ్చి మాట్లాడుతాడు. ఇంతలో మైత్రికి కాల్ వస్తుంది. మాట్లాడటానికి పక్కకి వెళ్తుంది. ఇంతలో నందిని పాలు తీసుకొని హర్ష దగ్గరకు వస్తుంది. పాలు తీసుకొని ఈ టైంలో వచ్చావేంటి అని హర్ష అడిగితే ఈ రోజు రాత్రి మన ఫస్ట్ నైట్ అని నాకు సిగ్గు తక్కువ కదా ప్రాక్టీస్ చేస్తున్నా అని అంటుంది. మైత్రి ఆ మాటలు వింటుందేమో అని హర్ష కంగారు పడతాడు. ఇంతలో మైత్రి వస్తుంది. ఇంకా మీకు ఫస్ట్ నైట్ అవ్వలేదా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.