అన్వేషించండి

Satyabhama Serial Today October 17th: సత్యభామ సీరియల్: సందడిగా బొమ్మల కొలువు.. రేణుకకి అవమానం.. హర్షని రప్పించడానికి మైత్రి ప్లాన్!

Satyabhama Today Episode నందినిని తీసుకొని హర్ష అత్తారింటికి వెళ్లాడని తెలుసుకున్న మైత్రి హర్షని ఇంటికి రప్పించడానికి కళ్లు తిరిగినట్లు నాటకం ఆడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode దసరా పండగ కోసం క్రిష్ గుమ్మానికి పూల దండలు కడుతుంతాడు. సత్య గులాబి రేకులు పళ్లెంలో తీసుకురావడం చూసి సత్య వచ్చినప్పుడే కావాలని పడిపోయినట్లు చేసి సత్య పట్టుకునేలా చేస్తాడు. ఇక సత్య చేతిలో పళ్లెం విసిరేసి తమ మీద పూల రేకులు పడేలా రొమాంటిక్ సీన్ క్రియేట్ చేస్తాడు. సత్యకి ముద్దు ఇవ్వమని అడుగుతాడు. క్రిష్ ఇవ్వను అంటే సత్య క్రిష్‌ బలవంతంగా తీసుకోబోతే సత్య మామయ్య వచ్చాడు అంటే కంగారు పడతాడు. ఇక అక్కడ ఎవరూ లేకపోవడంతో సత్య నవ్వుతుంది. తర్వాత క్రిష్ సత్యని దగ్గరగా తీసుకుంటే ఈ సారి నిజంగానే భైరవి, మహదేవయ్య వస్తారు. సత్య చెప్పినా క్రిష్ వినడు ఇంతలో భైరవి ఏం చేస్తున్నావ్‌రా అని చివాట్లు పెడుతుంది. అప్పుడే నందిని, హర్ష వస్తారు. అందరూ సంతోషిస్తారు. 

భైరవి: ఎట్లా ఉన్నావే.
నందిని: అత్తింట్లో ఉన్నా కదా హ్యాపీగానే ఉన్నా.
మహదేవయ్య: నిన్ను ఆ ఇంటికి పంపిందే నేను కదా ఇలా రా బిడ్డ. సత్య సైగ చేయడంతో వెళ్తుంది. ఇంతలో జయమ్మ వస్తుంది.
జయమ్మ: ఇప్పుడు ఇంటికి కల వచ్చిందే వస్తావో రావో అని బెంగగా ఉండేది.
నందిని: చిన్న అన్న పిలిచాడు కదా రాకుండా ఎలా ఉంటాను.
భైరవి: నేను పెలిచేదాన్ని కానీ నా ఫొన్ ఎత్తడం లేదు కదా అందుకే చిన్నాతో పిలిపించా.
నందిని: ప్రేమగా మాట్లాడితే ఎందుకు ఎత్తను. నా అత్తారింటి గురించి ఎంక్వైరీ చేస్తావ్ అందుకే ఎత్తను. పెద్దొదినా ఎలా ఉన్నావ్ సీమంతంలో హంగామా చేద్దాం అనుకున్నా కానీ ఇలా అవుతుంది అనుకోలేదు.
భైరవి: ఎవరి దురదృష్టానికి ఎవరు ఏం చేస్తారులే.
నందిని: ఇది ఎవరు చేసిన పనో అంత తెలీకుండా లేనులే. 
రుద్ర: నా దిక్కు చూస్తున్నావేంటే.
నందిని: ఎందుకో తెలీదా.
రుద్ర: ఇదిగో చూడు పిండి వంటలు తిని బుద్ధిగా చీరాసారె పెట్టించుకొని వెళ్లిపో. ఎక్కువ తక్కువ మాట్లాడకు.
క్రిష్: అన్నా. పద్ధతిగా మాట్లాడు.
రుద్ర: అది పద్ధతిగా మాట్లాడుతుందా.. ఎవరు పిలవమన్నారురా దీన్ని. 
నందిని: ఇది నీ ఒక్కడి ఇళ్లే కాదు మా చిన్నన్నది కూడా బాపు వాడికి చెప్పు. 

గొడవని ఆపి బొమ్మల కొలువు చేసుకోవడానికి అందరూ లోపలికి వెళ్తారు. మహదేవయ్య, సత్య ఇద్దరూ బయటే ఉంటారు. ఇంట్లో చిచ్చు పెట్టాలి అని నువ్వు ఎంత ప్రయత్నించినా అని ప్రయత్నం దగ్గరే ఆగిపోతుందని చూశావా కోడలి కానీ కోడలా అంటాడు మహదేవయ్య. దానికి సత్య రోజులు లెక్క పెట్టుకోండి మీ బాణం మీ మీదకే ఎక్కు పెడతా. హ్యాపీ దసరా అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు మైత్రి ఇళ్లంతా హర్ష కోసం వెతుకుతుంది. నందినితో అత్తారింటికి వెళ్లారని విశాలాక్షి వాళ్లు చెప్తారు. ఇక విశాలాక్షి వాళ్లు గుడికి వెళ్తారు. బామ్మ తప్ప ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మైత్రి హర్ష గదిలోకి వెళ్తుంది. హర్ష, నందినిల ఫొటో చూసి నీ పక్కన నేను ఉండాల్సింది నాకు చాలా నష్టం జరిగింది హర్ష అని అనుకుంటుంది. ఇక ఓ షర్ట్ తీసుకొని ఇది నేనే నీ కోసం సెలక్ట్ చేశా హర్ష అనుకొని ఆ షర్ట్ వేసుకొని నువ్వు నాకు కావాలి హర్ష నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటుంది. నిన్ను చూడకుండా  ఉండలేను అనుకొని నిన్ను ఇప్పుడే రప్పిస్తా ఎలా పిలిస్తే వస్తావో నాకు తెలుసని అనుకుంటుంది.

సత్య, నందిని, రేణుక అందరూ కలిసి బొమ్మల కొలువు పేర్చుతారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. సత్య కావాలనే బొమ్మకి ముద్దు పెడుతుంది. క్రిష్‌ తనకు పెట్టలేదని ఫీలవుతాడు. ఇక ఇంతలో భైరవి వచ్చి క్రిష్, హర్షలను పంపేస్తుంది. ఇంతలో ముత్తైదువులు వస్తారు. రేణుక బొట్టు పెట్టడానికి వెళ్తే భైరవితో ముత్తైదువులు మీ పెద్ద కోడలితో కూడా బొమ్మల కొలువు పెట్టించావా తను గొడ్రాలు కదా ఆ పాపం నీ చిన్న కోడలికి కూడా అంటితే అంటారు. దానికి సత్య ముతైదువులు మీద కోప్పడుతుంది. మూఢనమ్మకాలతో సాటి ఆడదాన్ని బాధ పెట్టొద్దని అంటుంది. దానికి పాపం రేణుక రెండు చేతులు జోడించి నేను జీవితంలో చాలా నష్టపోయాను ఇప్పుడు ఇంకేం లేదు అయినా మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని అంటుంది. ఇక నందిని, సత్య పూజ చేస్తారు. ఇంతలో రేణుక కడుపు నొప్పి అన్నట్లు కడుపు మీద చేయి వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సత్య అది చూస్తుంది.

మరోవైపు మైత్రి హర్షని రప్పించడానికి కళ్లు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. దాంతో బామ్మ కంగారు పడి హర్షకి కాల్ చేసి జరిగింది చెప్తుంది. హర్ష కంగారుగా నందినిని పిలిచి విషయం చెప్తాడు. నందిని వెళ్లమంటుంది కానీ ఇద్దరినీ వదలకూడదని నేను వస్తానని సత్యకి చెప్పి వెళ్తుంది. ఇక రేణుక గదిలో ఉంటే సత్య వెళ్లి ఏంటి అక్కా నీ తప్పు లేకపోయినా సైలెంట్‌గా ఉంటావని అంటుంది. పేరంటాలకు వాయినం ఇవ్వాలని రమ్మని పిలిస్తే  రాదు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: నయని వైపు దూసుకొచ్చిన యమపాశం.. మధ్యలో గాయత్రీ పాప దగ్గర యూ టర్న్.. చనిపోయేది ఎవరు?

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 28: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
Illu Illalu Pillalu Serial Today November 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ ఇంటికి వచ్చి తండ్రితో గొడవపడ్డ చందు! చందుతో అంజలిని చూసేసిన వల్లీ?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ ఇంటికి వచ్చి తండ్రితో గొడవపడ్డ చందు! చందుతో అంజలిని చూసేసిన వల్లీ?
Podarillu Serial Today NoV 28: కేశవ్‌ వెంట విజయవాడ వెళ్లిన శైలూ...పెళ్లిచేసుకోవడానికే తీసుకెళ్లాడని వరాలు గొడవ
పొదరిల్లు: కేశవ్‌ వెంట విజయవాడ వెళ్లిన శైలూ...పెళ్లిచేసుకోవడానికే తీసుకెళ్లాడని వరాలు గొడవ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
Embed widget