Satyabhama Serial Today December 24th: సత్యభామ సీరియల్: సత్యని దెబ్బకొట్టడానికి క్రిష్ దగ్గర మాట తీసుకున్న మహదేవయ్య.. మామ కాని మామకు MLA టికెట్!
Satyabhama Today Episode సత్య క్రిష్ దగ్గర మాట తీసుకోవడం చూసిన మహదేవయ్య క్రిష్‌తో ఎమోషనల్‌గా మాట్లాడి తాను మాట తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode సత్య క్రిష్‌తో ఒంటరిగా మాట్లాడుతుంది. ఎలాంటి పరిస్థితిలో నన్ను వదిలి వెళ్లొద్దని మాట తీసుకుంటుంది. క్రిష్ సత్య చేతిలో చేయి వేసి జీవితాంతం నీతోనే కలిసి ఉంటానని పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతూ ప్రమాణం చేశా ఇప్పుడు మరోసారి చెప్తున్నా జీవితాంతం నా చేయి నీ చేతిలోనే ఉంటుందని మాట తప్పిన రోజు నా ప్రాణం పోతుందని అంటాడు. సత్య సంతోషంతో క్రిష్‌ని హగ్ చేసుకుంటుంది. సత్యకి క్రిష్ మాట ఇవ్వడం చూసిన మహదేవయ్య కోపంతో రగిలిపోతాడు. ఇక క్రిష్ సత్యకి ఒక కోరిక కోరుకోమన్నాను కోరికో అంటే దానికి సత్య ఇప్పుడు అడగను కైకేయిలా అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని అంటాడు. కచ్చితంగా నీ కోరిక తీర్చుతానని అంటాడు.
మహదేవయ్య: ఈ సత్యది మామూలు తెలివి కాదు ఆ ఎర్రడి ముందర కాళ్లకు బంధం వేస్తుంది. రివర్స్ ప్లాన్ చేయకపోతే కాదు. ఉదయం క్రిష్ మహదేవయ్య దగ్గరకు వచ్చి ఎలక్షన్‌కి పార్టీకి సంబంధించి ఏ పని చేస్తానని అన్నా మహదేవయ్య వద్దని అనేస్తాడు. నేను చూసుకుంటా అని అంటాడు.
క్రిష్: బాపు నాతో ఏమైనా తప్పు జరిగిందా.
మహదేవయ్య: నువ్వు మహదేవయ్య కొడుకువిరా తప్పు ఎందుకు చేస్తావ్.
క్రిష్: మరి ఎందుకు దూరం పెడుతున్నావ్ అన్ని పనులు నువ్వే ఎందుకు చూసుకుంటున్నావ్.
మహదేవయ్య: తప్పేముందిరా.
క్రిష్: తప్పే బాపు నువ్వు రాజువి సింహాసనం మీద కూర్చొని ఆర్డర్లు వేయాలి పనోడి లెక్క నేను అన్ని పనులు చేయాలి. ఇన్నాళ్లు జరుగుతుంది అదే కదా ఇప్పుడు రూల్ మార్చావేంటి.
మహదేవయ్య: ఎందుకురా చిన్నా ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావ్.
క్రిష్: ఇది చిన్న విషయం కాదు బాపు నీ దిమాక్‌లో ఏదో నడుస్తుంది. నువ్వు ఏదో దాస్తున్నావ్ కదూ.
మహదేవయ్య: దాచుడేంట్రా దాచుడు ఎర్రోడిలా మాట్లాడకు. నా పనులు నేను చేసుకోవాలి కదా.
క్రిష్: అలా అంటావేంటి నేను పుట్టిందే నీ పనులు చేయడానికి నేను ఉండగా నీ పనులు నువ్వు చేసుకుంటే నేను బతికుంది దేనికి. సడెన్‌గా నేను ఎందుకు పనికి రాకుండా పోయాను.
మహదేవయ్య: నా చిన్న కోడలికి నేను ఎలక్షన్‌లో నిలబడటం ఇష్టం లేదు. సడెన్‌గా సత్య ఎలక్షన్‌లో నా వెంట తిరగొద్దని నీకు ఆర్డర్ వేసిందే అనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి. నేను మూల పడినట్లే కదా.
క్రిష్: నీ వెనక తిరగొద్దని సత్య నాకు ఎప్పుడూ చెప్పదు. తన భయం అంతా గొడవలకు వెళ్లి నాకేమైనా అవుతుందనే. అయినా సత్య చెప్తే నేను ఎందుకు తన మాట వింటాను అనుకుంటున్నావ్. బాపుకి దూరం ఉండమని దేవుడు చెప్పినా వినను అలాంటిది సత్య చెప్తే ఎందుకు వింటాను. నాకు సత్య అంటే ప్రాణం నా కాళ్లకి అడ్డు పడనంత వరకు. ఎమ్మెల్యే అవుడు నీ కల అయితే బాపుని ఎమ్మెల్యే చేయడం నా లక్ష్యం. నిన్ను ఎమ్మెల్యేని చేసిన వరకు నీ వెంటే ఉంటా దాని కోసం ఎవరినైనా ఎదిరిస్తా ఎంత దూరం అయినా పోతా.
మహదేవయ్య: అలా అని మాటియ్యురా.
క్రిష్, మహదేవయ్య మధ్య సంభాషణ క్రిష్ తండ్రికి మాటివ్వడం మొత్తం సత్య చూసి కోపంతో వెళ్లిపోతుంది. మహదేవయ్య సత్య దగ్గరకు వెళ్లి దిమ్మతిరిగే షాక్ తగిలిందా కోడలా అని అంటాడు. చిన్నా నీ పరువు తీసి పక్కన పెట్టాడని అంటాడు. దానికి సత్య పరిస్థితులకు తల దించాను కానీ మీ ముందు కాదు రేపోమాపో మీ తల దించేలా చేస్తాను అంటుంది. మహదేవయ్య పెద్దగా నవ్వుతాడు. ఏదోలా సాక్ష్యాలు సాధిస్తాను మీ అంతు చూస్తానని సత్య అంటుంది. తాను ఒకసారి ఎమ్మెల్యే అయితే పవర్ వాడుకొని మీ నుంచి క్రిష్‌ని కాపాడుకుంటానని అంటుంది. దానికి మహదేవయ్య ముందు నామినేషన్ వేయు తర్వాత ఆలోచిద్దాం అంటాడు. మరోవైపు మైత్రి హర్షకి కాల్ చేస్తుంది. నందిని లిఫ్ట్ చేయగానే మైత్రి తిట్టుకుంటుంది. నిన్ను ఉద్దరించాలని నా మొగుడు లేని పోని అప్పులు చేసి రోడ్డుకి ఈడ్చేశాడని అంటే మైత్రి నాకు తెలీదు సారీ నందిని అని అంటుంది.
నందిని మైత్రిని తిడుతుంది. ఈ ఇంటి వైపు వచ్చినా హర్షకి కాల్ చేసినా మర్యాదగా ఉండదని చెప్తుంది. ఇక మైత్రి కాల్ గురించి హర్షకి తిట్టొద్దని నెంబరు డిలీట్ చేస్తుంది. మైత్రితో తన ఫ్రెండ్ నందిని ఉండగా నువ్వు హర్షని చేరుకోలేవని అంటుంది. దానికి మైత్రి నేను హర్షని వదలను అని అంటుంది. ఆ ఇంటిలో వాళ్ల దృష్టిలో మళ్లీ జాలి సంపాదించుకోవడానికి ఇంటిని అమ్మేసి నాటకం మొదలు పెడతానని మైత్రి అంటుంది. ఇక క్రిష్ ఇంట్లో సందడి చేస్తాడు. బాపునకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫ్మమ్ అయిందని గెంతులేస్తాడు. అందరూ బయటకు చేరుకొని సంతోషంగా ఉంటారు. క్రిష్ 1000 వాలా కాల్చుతాడు. అందరూ స్వీట్స్ తినిపించుకొని సంతోషంగా గడుపుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: ఇన్నాళ్ల దూరం.. గుండెల్లో గాయం.. అయింది బంధం.. విమానంలో తల్లికి బిడ్డ వీడ్కోలు!