Prema Entha Madhuram promo: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ప్రోమో: ఉష చేసిన పనికి షాక్ లో అను - ఆమె ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా!
Prema Entha Madhuram promo: అను ఆర్యల మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకోవాలని తాపత్రయపడుతున్న ఉష నిజం తెలుసుకుంటుందా? ఉష ప్రశ్నలకి అను నిజం చెప్తుందా తెలుసుకోవాలంటే సీరియల్ ని ఫాలో అవ్వాల్సిందే.
Prema Entha Madhuram promo: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఉష అడిగిన ప్రశ్నలకి కంగారుపడుతూ నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్లాలి అని మడత పెట్టకుండానే బట్టలన్నీ కబోర్డ్ లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో అను ఫోటో కింద పడిపోతుంది. అను కంగారు చూసిన ఉష షాక్ అయిపోతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది.
ఇదేదో తెలుసుకోవాలి అనుకుంటూ ఆ ఫోటోని తీసి దాస్తుంది. అన్నయ్యకు చూపిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి అనుకుంటుంది. టిఫిన్ డెలివరీ కి వెళ్తున్న ఆర్యతో నేను కూడా వస్తాను, అట్నుంచటే గుడికి వెళ్దాం అని చెప్పి అతనితో బయలుదేరుతుంది. మరోవైపు ఛాయదేవి ఇంటికి వెళ్ళిన అనుని చూసి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు అని అడుగుతుంది ఛాయదేవి.
నీ పిల్లలు సేవ్ అయ్యారని నీకు ధైర్యం వచ్చినట్లుగా ఉంది అంటుంది. మాన్సీ కూడా అనుని నానా మాటలు అంటుంది. అయితే అను వారికి తల తిరిగిపోయే సమాధానం చెప్తుంది అయితే ఆ మాటలు భరించలేని జలంధర్ కోపంతో ఆమె మీదకి గన్ గురిపెడతాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు అతనిని అరెస్టు చేస్తారు. వాళ్లు షీ టీం వాళ్లని నేనే పిలిపించాను అని చెప్తుంది అను. పోలీసుల కళ్ళముందే గన్ గురి పెట్టడం జలంధర్ మాట్లాడిన మాటలు రికార్డు చేసి పోలీసులకు వినిపించడంతో జలందర్ ని అరెస్టు చేసే తీసుకుని వెళ్ళిపోతారు పోలీసులు.
తన అన్నని అరెస్టు చేయించినందుకు కోపంతో రగిలిపోతుంది ఛాయాదేవి. మరోవైపు గుడిలోకి వెళ్లిన ఉష ఆర్య కి అను ఫోటో చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆర్య ఇది నీకు ఎక్కడ దొరికింది, ఈ అమ్మాయిని నువ్వు చూసావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. నిజం చెప్తే ఎలాంటి సమస్య వస్తుందో అని గుడిలో దొరికింది అని చెప్పేస్తుంది ఉష. ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడిగితే తెలియదు అంటాడు ఆర్య.
ఇక ప్రోమో విషయానికి వస్తే ఈ ఫోటో మీ పర్మిషన్ లేకుండా తీసుకు వెళ్ళాను మా అన్నయ్యకి చూపించాను అని అనటంతో అను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఉష మళ్లీ ఇలా చెప్తుంది. ఫోటో చూపించిన వెంటనే అన్నయ్య ఈ అమ్మాయి నీకు తెలుసా, తనని ఎక్కడైనా చూసావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు. మీరు కూడా మా అన్నయ్య మిమ్మల్ని చూడకుండా మొహం ముసుగేసుకుని తిరుగుతారు.
మా అన్నయ్య మీకు ముందే తెలుసా అని నిలదీయడంతో అను మరొక్కసారి అవాక్కవుతుంది. మరి ఉష ప్రశ్నలకి అను నిజం చెప్తుందా.. అను ఆర్యలని కలపాలనుకుంటున్న ఉష ప్రయత్నం ఫలిస్తుందా.. అను మీద పగతో రగిలిపోతున్న ఛాయాదేవి తన పగని ఎలా తీర్చుకుంటుంది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
View this post on Instagram