Prema Entha Madhuram Today January 3rd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: రాధతో పెళ్లికి ఒప్పుకున్న ఆర్య, ప్రాణాపాయ స్థితిలో అక్కి, అభయ్!
Prema Entha Madhuram Today Episode: తండ్రి కావాలని పిల్లలు మొండికేసి ఉపవాసం ఉండటంతో ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు ఇద్దరినీ హాస్పిటల్లో జాయిన్ చేసిన అను ఆర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
Prema Entha Madhuram Serial Today Episode: వాళ్లు చెప్పారని నీ మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు జెండే.
ఆర్య : నేను పూర్తిగా హెల్ప్ లెస్ సిచువేషన్ లో ఉన్నాను.
జెండే : నీతో అదే సమస్య ఆర్య ఎదుటి వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా భావిస్తావు. సూర్య లాగా ఆ ఇంటికి వెళ్లిన నువ్వు ఆమెని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండగలవా ఇప్పటికైనా ఆలోచించు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తెచ్చుకో.
ఆర్య : నా జీవితం ఏ రోజని నా చేతిలో ఉంది? ఒక ఆశయం కోసం కష్టపడుతున్నప్పుడు రాజనందిని తోడైంది. తర్వాత మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత అను ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది ఆఖరికి పిల్లల్ని చూసుకోకుండా అయిపోయాను. ఇప్పుడు మళ్లీ జీవితంలోకి ఈ పిల్లలు వచ్చారు. అందుకే ఒక డెసిషన్ తీసుకున్నాను అంటాడు.
ఏంటది అని అడుగుతాడు జెండే.
ఆర్య : పెళ్లి అనే ఆఖరి నిమిషం వరకు నేను రాధ గారి భర్తని వెతకడానికి ప్రయత్నిస్తాను లేని పక్షంలో నా జీవితాన్ని ఆఖరి మజిలీకి చేరుస్తాను అంటాడు.
మరోవైపు పిల్లలిద్దరూ కూర్చొని అమ్మ ఎందుకు ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవటం లేదు, ఎందుకు నాన్నని కలవడానికి ఇష్టపడడంలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు.
అను: అప్పుడే పాలు తీసుకువచ్చి తాగమంటుంది.
పిల్లలు: మేము కటిక ఉపవాసం చేస్తున్నాం అప్పుడే మేము అనుకున్నట్లు నాన్నని కలుస్తాము అనటంతో వాళ్లపై కోప్పడుతుంది.
అను : ఎప్పుడూ నాన్న, నాన్న మళ్ళీ ఇంకొకసారి నాన్న అంటే ఊరుకునేది లేదుఅంటుంది.
పిల్లలు: నువ్వెందుకు మా బాధ అర్థం చేసుకోవడం లేదు మా నాన్నని మాకు చూపించు లేకపోతే మమ్మల్ని మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు అంటారు.
ఆ హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.
సుగుణ: ఏం జరిగింది అని అడుగుతుంది.
అను: పాలు తాగమంటే కటిక ఉపవాసం అంటున్నారు ఏమైనా అంటే నాన్న అంటున్నారు వాళ్ళు మంచి కోసమే చెప్తే వినిపించుకోవడం లేదు.
పిల్లలు: మరి నానమ్మ నీ మంచి కోసమే ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోమంటే ఎందుకు చేసుకోవడం లేదు అని నిలదీస్తారు.
కోపంతో వాళ్లపై చేయి ఎత్తుతుంది అను. సుగుణ కూడా అలా మొండిపట్టు పట్టకూడదు అని పిల్లలకు చెప్తుంది. ఆర్య కూడా తల్లికి ఎదురు సమాధానం చెప్పకూడదు అంటాడు.
పిల్లలు: మీరు కూడా మమ్మల్ని అంటున్నారా నానమ్మ? మా బాధ ఎవరికి పట్టదు అనుకుంటూ ఇద్దరు దేవుడి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్లి తల్లిని తండ్రిని కలపమని ప్రార్థిస్తారు. ఉపవాసం వల్ల కలిగిన నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతారు.
బయట ఉన్న వాళ్ళకి లోపల నుంచి ఎలాంటి శబ్దము రాకపోతే కంగారు పడతారు. పిల్లల్ని పిలిచినా పలకకపోవటంతో తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న పిల్లల్ని చూసి కంగారు పడతారు. హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తారు.
డాక్టర్ : సుగుణ ద్వారా జరిగింది తెలుసుకొని పిల్లల చేత ఉపవాసం ఉంచటం ఏంటి చాదస్తం కాకపోతే అందుకే వాళ్లకి వాటర్ లెవెల్స్ తగ్గి డిహైడ్రేషన్ జరిగి కళ్ళు తిరిగి పడిపోయారు. ఇకమీదట ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి టాబ్లెట్స్ రాసి ఇస్తాడు.
యాదగిరి ట్యాబ్లెట్స్ తేవడానికి వెళ్తే అను పిల్లలిద్దరినీ చూడటానికి ఐసియూ లోకి వెళుతుంది. ఇద్దరిని చూసి బాగా కన్నీళ్లు పెడుతుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Read Also: ‘హనుమాన్’ రిలీజ్‌ను ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ