Prema Entha Madhuram Serial January 25th - ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: మరదలు మీద విరుచుకుపడిన యాదగిరి.. మీ పెళ్లి నా పెళ్ళికి అడ్డుంటున్న దివ్య!
Prema Entha Madhuram Serial Today Episode: అను ని బిచ్చగత్తెగా చూసిన ఆర్య ఆమె గురించి ఆలోచనలో పడతాడు. ఆపై ఆర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Serial Today Episode: తల్లిని తమతోపాటు వచ్చేయమంటారు అక్కి, అభయ్.
అను : నేను రాను మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్తుంది.
ఆర్య : రాధ గారు ఏంటిది, ఏ కారణం లేకుండా మీరు ఏమీ చేయరని నాకు తెలుసు కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పండి అంటాడు.
అను : నేను ఏమి చేసినా నా పిల్లల కోసం నా కుటుంబ క్షేమం కోసం చేస్తాను. దయచేసి నన్ను ఏమీ అడగకండి పిల్లలకి నచ్చచెప్పి తీసుకుని వెళ్లిపోండి నా ఆశయానికి మీ సహకారం అందించండి అంటుంది.
ఆర్య : ఈ పెళ్లి నుంచి తప్పించుకోవటం కోసం ఏదో కఠోర దీక్ష చేస్తున్నట్లుగా ఉన్నారు అని ఆమె పెళ్ళెంలో కొంత డబ్బు వేసి పిల్లలకి నచ్చజెప్పి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.
అప్పటికే రాత్రి కావడంతో పంతులుగారు అను రాకపోవడంతో గుడికి తాళం వేయాలి అనుకుంటారు ఇంతలో పరుగు పరుగున అను గుడికి చేరుకుని దీక్ష పూర్తి చేసిన సొమ్ముని హుండీలో వేసి పంతులు గారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది.
అను: అలాంటి పరిస్థితులలో చూసి కూడా నా పిల్లలు నాకోసం బాధపడ్డారు తప్పితే నా దీక్షకి అడ్డు రాలేదు అంత అర్థం చేసుకునే పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను అని మనసులో అనుకుని ఆర్య ని, పిల్లలని చల్లగా చూడమని దేవుడికి దండం పెట్టుకుంటుంది.
మరోవైపు పూజ సమయం అయిపోతున్న అను ఇంటికి రాకపోవడంతో సుగుణ వాళ్ళు కంగారు పడుతుంటే దివ్య మాత్రం కోప్పడుతుంది. అసలు నాకు పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ కలగటం లేదు అంటుంది. అయినా ఇంట్లో పూజ ఉందని తెలిసి ఇంత ఆలస్యంగా రావటం ఏమిటి అని కేకలు వేస్తుంది.
జ్యోతి: అలా అనకు ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉందో అని చెల్లెలికి సర్ది చెప్తుంది.
దివ్య: ఏంటి అందరూ ఆవిడ మీద జాలి చూపిస్తున్నారు. ఆవిడ అమ్మేది బట్టల షాపులో బట్టలే కదా అయినా మెయిన్ పెళ్లి నాది సైడ్ ట్రాక్ అయిపోయింది, ఎవరిదో పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది అని గట్టిగా మాట్లాడుతుంది.
యాదగిరి: దివ్య పై కోప్పడతాడు. ఎవరిని ఏమంటున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు అని కేకలు వేస్తాడు.
సుగుణ: తను నీకు కాబోయే వదిన మర్యాద ఇచ్చి మాట్లాడు అత్తగారింటికి వెళ్తున్నావు కాస్త సహనం అలవర్చుకో అంటుంది.
ఇంతలో ఆర్య పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు.
ఆర్య: ఇంకా ఇంట్లోకి రాకముందే అమ్మ ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకండి అలాగే ఇంట్లో ఈ టాపిక్ ఏమీ మాట్లాడకండి అని పిల్లలకు చెప్పి ఇంట్లోకి తీసుకు వస్తాడు.
సుగుణ: పెళ్లి కార్డులకని వెళ్లి ఇంత ఆలస్యం అయింది ఏంటి అని అడుగుతుంది.ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటాడు ఆర్య.
ఇంతలోనే అను ఇంటికి వస్తుంది.
దివ్య: ఏమీ పట్టనట్లు ఎంత ధీమాగా వస్తుందో అంటుంది.
అను: ఏమైంది అని అడుగుతుంది.
దివ్య: మీ పెళ్లికి నా పెళ్లి అడ్డయింది అసలు నా పెళ్లి జరుగుతుందన్న ఉత్సాహమే లేకుండా పోయింది అంటుంది.
సుగుణ దివ్య పై కోప్పడి అనుని రెడీ అయి రమ్మని చెప్తుంది అను రెడీ అయి రావటంతో అను చేత దీపం పెట్టించి ఆపై దివ్య చేత దీపం పెట్టిస్తుంది.
తర్వాత వాకిట్లో కూర్చున్న ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.