Prema Entha Madhuram Serial January 10th - ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: మొత్తానికి పెళ్ళికి ఒప్పుకున్న అను - కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసిన జెండే
Prema Entha Madhuram Serial Today Episode: రౌడీల వ్యాన్లో నుంచి జలంధర్ ని చూసిన పిల్లలు మనం ఇక్కడ ఉంటే సేఫ్ కాదు వాళ్లకు దొరికితే అయిపోతాం ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటారు.
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లలు మనవలు మన ఇంటికి వచ్చే అదృష్టం లేదు భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు. అలాగే మన అమ్మికి మంచి భర్తనీ, కుటుంబాన్ని, అత్తగారిని ఇచ్చారు కానీ ఒకరిని ఒకరు దూరం చేసేసాడు. మనకి అమ్మి ఆనందాన్ని చూసే అదృష్టం లేదు అని ఏడుస్తుంది పద్దు.
సుబ్బు: మనమే ఇలా అయిపోతే ఆర్య సార్ ఇంకెంత బాధ పడుతున్నారో. అష్టైశ్వర్యాలు మధ్య పెరగవలసిన పిల్లలు ఎక్కడో అనాధలు లాగా పెరుగుతుంటే ఆయనకి ఎంత కష్టంగా ఉంటుంది అని ఆర్య గురించి బాధపడతాడు.
అంతా మంచే జరగాలని కోరుకోవడం తప్పితే మనం ఏమి చేయలేము అనుకుంటారు ఇద్దరు.
మరోవైపు ఇంటికి వచ్చిన అను పిల్లలు దొరకలేనందుకు ఏడుస్తుంది.
అను : నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేని పిల్లలు ఈరోజు నా నుంచి దూరంగా వెళ్లిపోయారు అంటే వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటుంది.
సుగుణ: ఈరోజు ఈ పరిస్థితికి కారణం నువ్వే. పిల్లలకి తల్లి ప్రేమ ఎంత అవసరమో తండ్రి తోడు అంత అవసరం నీ ప్రేమను అందించాను అని అనుకున్నావు కానీ తండ్రి కోసం వాళ్లు పడే తపనని తెలుసుకోలేకపోయావు అంటుంది.
ఉష : మీరు మా అన్నయ్యతో పెళ్లికి ఒప్పుకోలేదు అనే పిల్లలు వెళ్లిపోయారు మీరు పెళ్లికి ఒప్పుకుంటే వాళ్ళు ఎలాగైనా తిరిగి వస్తారు అంటుంది.
అను : నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను నా పిల్లల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే వాళ్ళ ఆనందమే నాకు కావాల్సింది అని ఏడుస్తుంది.
దివ్య: రాధగారు పెళ్ళికి ఒప్పుకున్నట్టు పిల్లలకు ఎలా తెలుస్తుంది అంటుంది.
ఉష : అన్నయ్య వాళ్ళు వెతుకుతున్నారు కదా ఎలాగైనా వాళ్ళని తీసుకొస్తారు లేదంటే వాళ్ళైనా ఫోన్ చేసి కనుక్కుంటారు. ఈ విషయం తెలిస్తే వెంటనే వెనక్కి వచ్చేస్తారు అంటుంది.
మరోవైపు ఆర్య జెండే దగ్గరికి వస్తాడు. పిల్లలు దొరికారా అని అడుగుతాడు.
జెండే : లేదు మనవాళ్లు ఆ పని మీదే ఉన్నారు అంటాడు.
ఆర్య : పిల్లలు పెళ్లి విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు నేను రాధ గారు ఇద్దరు పెళ్లికి ఒప్పుకోవటాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు అంటాడు.
జెండే : వాళ్లు నీకు బాగా అటాచ్ అయిపోయినట్లు ఉన్నారు అంటాడు.
ఆర్య : నేను కూడా వాళ్ళకి బాగా అటాచ్ అయిపోయాను అంటాడు.
జెండే: అవును మీకు తెలియని ఏదో అటాచ్మెంట్ ఉంది. బాగా ఆలోచించు ఆర్య అంటాడు.
అనుమానంగా చూస్తాడు ఆర్య, ఏమంటున్నావు అని అడుగుతాడు.
జెండే : అవును ఆర్య, నువ్వు ఆర్యగా ఉన్నప్పుడైనా సూర్య గా ఉన్నప్పుడైనా పిల్లల మీద ఎక్కువగా అటాక్స్ జరిగాయి.
ఆర్య : జలంధర్ ఆ ల్యాండ్ కోసం పిల్లల్ని టార్గెట్ చేస్తున్నాడు.
జెండే : అలా అయితే ల్యాండ్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు. పిల్లలకి, నీకు, రాధ గారికి కలిసిన పాయింట్ ఏదో ఉంది అది మనం తెలుసుకోలేకపోతున్నాం కానీ వాళ్ళకి తెలిసింది. నాకెందుకో ఈ పిల్లలే నీ పిల్లలు అనిపిస్తుంది అంటాడు.
ఆర్య : కాదు, అను అయితే మాన్సీ దెబ్బకి బాగా భయపడి పోయింది నా చుట్టుపక్కల కూడా ఉండదు అంటాడు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే నేను రాధగారితో ముఖాముఖి మాట్లాడాలి అంటాడు.
జెండే : ముందు పిల్లలు దొరకనీ అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడదాం ఈలోపు నేను కూడా రాధగారి బ్యాగ్రౌండ్ గురించి కనుక్కుంటాను అనటంతో ఆర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు వ్యాన్ తో పాటు జలంధర్ ఇంటికి వస్తారు పిల్లలు.
జలంధర్: పిల్లలు దొరికారా అని అడుగుతాడు. లేరు అని రౌడీలు చెప్పడంతో వాళ్లని చడమడ తిడుతూ ఉంటారు జలంధర్ వాళ్ళు.
ఇదంతా కార్ లోంచి చూస్తుంటారు పిల్లలు ఇద్దరు.
అక్కి : ఆరోజు నన్ను కిడ్నాప్ చేయాలని చూసింది ఆ అంకులే అంటూ జలంధర్ ని చూపిస్తుంది.
అభయ్ : మనం ఇక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోదాం వీళ్ళకి దొరికామంటే మన పని అయిపోతుంది అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: 'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? - ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారంటే?