Prema Entha Madhuram Serial February 1st - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: సూర్య తన అన్న కాదన్న విషయం తెలుసుకున్న ఉష.. ఆర్యని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఛాయాదేవి!
Prema Entha Madhuram Serial Today Episode: సూర్య తన అన్న కాదని, ఆర్య వర్ధన్ అని తెలుసుకున్న ఉష తర్వాత ఏం చేయబోతుంది అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
![Prema Entha Madhuram Serial February 1st - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: సూర్య తన అన్న కాదన్న విషయం తెలుసుకున్న ఉష.. ఆర్యని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఛాయాదేవి! Prema entha madhuram telugu serial February 1st episode written update Prema Entha Madhuram Serial February 1st - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: సూర్య తన అన్న కాదన్న విషయం తెలుసుకున్న ఉష.. ఆర్యని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఛాయాదేవి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/60773b22b0199d1fd3a299dd985b66401706756057703891_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఈ పెళ్లి చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని పిల్లలు చెప్తారు.
అను : మీరు నా ప్రాణం, మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని పిల్లలు ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది.
ఉష : ఏంటి పిల్లలు మా వదిన ని కాకా పడుతున్నారు అని నవ్వుతుంది. తర్వాత గౌరీ పూజకి రెడీ అవ్వాలి అని ఆమెతో చెప్తుంది.
పిల్లలు: నిన్ను మేమే రెడీ చేస్తాము వెయిట్ చేస్తూ ఉండు నాన్న దగ్గరికి వెళ్లి ఇప్పుడే వచ్చేస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు.
ఉష: ఈ పెళ్లి జరుగుతున్నందుకు పిల్లలు చాలా ఆనంద పడుతున్నారు. పిల్లలు మాత్రమే కాదు నేను అమ్మ కూడా చాలా సంతోషిస్తున్నాము అని చెప్పి పూజకి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అను: అందరూ సంతోషంగానే ఉన్నారు కానీ నా మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలి అక్కడ ఆర్య సార్ కూడా సంతోషంగా లేరు, అనుకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని బాధపడుతున్నారు ఈ బాధని ఆ దేవుడే తీర్చాలి అనుకుంటుంది.
మరోవైపు కెనడిని స్కెచ్ త్వరగా రెడీ చేయమని నీరజ్ కి చెప్తాడు ఆర్య. ఆ తర్వాత మినిస్టర్ ఆర్య రూమ్ కి వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అనుమానించాలని కాదు కారణం తెలుసుకోవాలని మాత్రమే అడుగుతున్నాను అంటాడు.
ఆర్య జరిగిందంతా చెప్తాడు. మీ సమస్యలని నేను తీర్చలేను కానీ మీకు ఏ అవసరం వచ్చినా సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఉష ఈ మాటలు అన్ని వింటుంది.
ఉష : ఇక్కడ ఉన్నది మా అన్నయ్య కాకపోతే మరి మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అయోమయం పడుతుంది. డోర్ వేస్తున్న ఆర్య ఉష ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు.
ఉష: ఏం లేదు పెళ్లి పనుల హడావుడి కదా అందుకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మాన్సీ ఛాయాదేవి ఇద్దరు పెళ్లికి వస్తారు. ఆర్య వర్ధన్ ఎదురుగా ఉండి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని నిలదీస్తాడు.
ఛాయాదేవి : చావుకి పిలవకపోయినా వెళ్లాలి, శత్రువుల పెళ్లి అంటే చావు లాంటిదే అందుకే వచ్చాము. మీ పెళ్లికి గిఫ్ట్ కూడా తీసుకు వస్తున్నాడు మీ చిరకాల శత్రువు జలంధర్. అదే సూర్య డెడ్ బాడీ అంటుంది.
సూర్య: ముందు భయపడినట్లుగా నటిస్తాడు కానీ తర్వాత అంబులెన్స్ ని రానివ్వండి ఎందుకంటే ఇటునుంచి మీరు వెళ్ళటానికి పనికొస్తుంది. ఎవరు ఎలాంటి డ్రామాలు వేసినా వాళ్ళకి ఎలాంటి ఎండ్ కార్డు వేయాలో నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అయినా కూడా లోపలికి వచ్చి కూర్చుంటారు మాన్సీ,ఛాయాదేవి.
మాన్సీ ఆఫీసులో వ్యక్తి ఫోన్ చేసి ఇక్కడ కెనడీ తన పిక్చర్ ని నాలుగైదు గంటల్లో కంప్లీట్ చేసేలాగా ఉన్నాడు అంటాడు. మాన్సీ ఎలా అయినా ఆ ప్రయత్నాన్ని ఆపమంటే కుదరదు మేడం పిక్చర్ పూర్తయ్య వరకు జెండే, నీరజ్ సార్ అక్కడ నుంచి కదిలే లాగా లేరు అనటంతో మాన్సీ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది.
ఛాయాదేవి: హరీష్ కి ఫోన్ చేసి నీ కాబోయే భార్యని రెచ్చగొట్టి జరిగితే మన పెళ్లి జరగాలి వాళ్ళ పెళ్లి జరగకూడదు అని గొడవ చేయు అని చెప్తుంది. హరీష్ భయపడుతుంటే నీ పెళ్లికి వచ్చిన డోకా ఏమీ లేదు వాళ్ల పెళ్లి మాత్రం జరగకూడదు అంటుంది. సరే అంటాడు హారీష్. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)