అన్వేషించండి

Prema Entha Madhuram December 8th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: జలంధర్‌కు ప్రాణభయం రుచి చూపించిన ఆర్య, పగతో రగిలిపోతున్న ఛాయాదేవి

Prema Entha Madhuram Today Episode: తన అన్నకి నరకాన్ని చూపించాడనే కోపంతో ఛాయాదేవి ఆర్యపై పగ పెంచుకుని మరో కొత్త పన్నాగానికి తెరతీయటంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.

Prema Entha Madhuram Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఊపిరి అందక గలగిలా కొట్టుకుంటూ ఉంటాడు జలంధర్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యని చూసి మరింత భయపడిపోతాడు.

ఆర్య : ఏంటి జలంధర్ ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నావా? మరి నా అనుని నా కళ్ళముందే హింసిస్తుంటే నేను ఎలా భరించగలనుకున్నావు. నీక్కూడా ప్రాణభయం రుచి చూపించాలని ఇలా చేశాను. అయినా నిన్ను చంపను, అలా అని బ్రతకనివ్వను.. చావుకి బ్రతుక్కి మధ్య నరకాన్ని చూపిస్తాను అంటూ జేబులోంచి ఇన్ హెల్లర్ తీస్తాడు.

జలంధర్: ఆర్య ప్రాణం పోతున్నట్లుగా ఉంది అది నాకు ఇవ్వు అని బ్రతిమిలాడుకుంటాడు.

ఆర్య: అంతా త్వరగా ఇచ్చేస్తే ఎలా, నిన్ను చావు అంచుల దాకా తీసుకువెళ్లి బ్రతకాలి అనే కోరికని కలిగిస్తూ ఉంటాను. ఇకమీదట నువ్వు భయపడుతూనే బ్రతకాలి. నీకు చావు ఎలాగైనా రావచ్చు,  నువ్వు తినే తిండి ద్వారా పీల్చే గాలి ద్వారా తాగే నీటి ద్వారా ఎలా అయినా  నీ చావు సంభవిస్తుందని హెచ్చరించి ఇన్హేలర్ జలంధర్ వైపు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు లగేజ్ తో బయటికి వచ్చిన అను వాళ్ళని చూసి ఎక్కడికమ్మా ప్రయాణం అని అడుగుతుంది సుగుణ.

అను: మా ఇంటికి వెళ్లి పోతాము ఇప్పటికే వచ్చి చాలా రోజులైంది కదా.

ఉష : అయితే ఏమైంది, ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏమన్నారు దివ్య అక్క మిమ్మల్ని ఏమైనా అందా?

దివ్య: కోపంగా ఆవిడని అనవలసిన అవసరం నాకు ఏముంది.

అను : నన్ను ఎవరు ఏమి అనలేదు కానీ ఇక్కడ ఉంటే పిల్లలు మీ అందరికీ బాగా అలవాటైపోతున్నారు కొన్ని రోజులు పోతే విడిచి ఉండలేని పరిస్థితికి వచ్చేస్తారు.

సుగుణ: అయితే ఏమైంది, అందరం కలిసే ఉందాము. అయినా మీరు ఒంటరిగా ఉంటే ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయంతోనే కదా ఇక్కడ ఉండమన్నది. ఇన్నాళ్లు ఉన్నారు ఇప్పుడు తొందరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నువ్వు బాధ్యతగా చూసుకుంటావు అనుకున్నాను. అయినా నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్తున్నావు కదా ఏమైనా లేట్ అయితే పిల్లలకి ఇబ్బంది కదా ఆలోచించు అంటుంది సుగుణ.

పిల్లలు కూడా ఇక్కడే ఉందాము, ఇక్కడే బాగుంది అంటారు.

అను : సార్ కి కూడా దెబ్బ తగిలింది ఇక్కడే ఉంటే ఆయనని చూసుకోవచ్చు పెళ్లయిన వరకు ఇక్కడే ఉందాం అని మనసులో అనుకొని ఇక్కడే ఉంటామని అందరికీ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. వాళ్ళని తీసుకొని ఉష లోపలికి వెళ్ళిపోతుంది.

తర్వాత ఇంటి ముందు ఆటోలో దిగుతున్న పెద్ద అల్లుడిని చూసి షాక్ అవుతుంది సుగుణ. ఇతను ఏంటి ఇప్పుడు వచ్చాడు అని కంగారు పడుతుంది.

సుగుణ: అతనికి ఎదురెళ్ళి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.

మిగిలిన వాళ్ళు కూడా వెళ్లి అతనిని పలకరించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

అల్లుడు: నాకు ఇచ్చె కట్నం డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని నిలదీస్తాడు.

సుగుణ: ఆ ప్రయత్నంలోనే ఉన్నాము కానీ ఎక్కడా కుదరడం లేదు.

అల్లుడు: నేను అంత పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా చేతిలో డబ్బులు లేకుండానే మరదలు పెళ్లి ఫిక్స్ చేశారా అని అడుగుతాడు.

దివ్య: నా పెళ్లి నా సంపాదనతో జరుగుతుంది. అయినా నాది లవ్ మ్యారేజ్ అతను నీలాగా కట్నం అడగలేదు.

సుగుణ : అవును అతనికి కట్నం ఇవ్వటం లేదు, పై ఖర్చులకి సూర్య సంపాదిస్తున్నాడు.

అల్లుడు: సూర్య అంటే నా బామ్మర్ది, అవును అతను ఇంటికి వచ్చాడంట కదా ఏడి కనిపించడం లేదు, నేను వచ్చానని దాక్కున్నాడా అని వెటకారంగా మాట్లాడుతాడు.

ఉష : అన్నయ్య పని మీద బయటకు వెళ్ళాడు.

టాపిక్ మార్చడం కోసం సుగుణ బయటే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అని ఆహ్వానించడంతో అందరూ లోపలికి వెళ్తారు.

మరోవైపు జైలుకి వచ్చిన ఛాయాదేవి, మాన్సీ జలంధర్ పడుతున్న ఇబ్బందిని చూసి చాలా బాధపడతారు.

ఛాయదేవి: ఆయన అంత ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ కి తీసుకెళ్లడం మానేసి ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్న పోలీస్ ని అడుగుతుంది.

పోలీస్ : మేము తీసుకెళ్తామని అన్నాము.. కానీ ఆయనే సపోర్ట్ చేయడం లేదు అంటాడు.

ఛాయాదేవి : హాస్పిటల్ కి వెళ్దాం రండి అన్నయ్య అంటుంది.

జలంధర్ : భయంతో వణికిపోతూ నేను రాను.. ఆర్య నన్ను చంపేస్తాడు నువ్వు కూడా వాడి జోలికి వెళ్ళకు.

ఛాయాదేవి : జలంధర్ పరిస్థితిని చూసి బాధపడుతూ పోలీస్ తో డాక్టర్ని పంపిస్తాను ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది.

కారు దగ్గరికి వచ్చిన ఛాయాదేవి మాన్సీతో మా అన్నయ్యకి ఇంత నరకాన్ని చూపించిన  ఆర్యని వదిలిపెట్టేది లేదు అంటుంది.

ఏం చేస్తారు అంటుంది మాన్సీ.

ఛాయాదేవి : బంధాలు బంధుత్వాలు అంటూ తిరుగుతున్నాడు కదా ఆ బంధాలే భారమయ్యేలాగా చేస్తాను అంటూ ఏదో ప్లాన్ చెప్తుంది ఛాయాదేవి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget