అన్వేషించండి

Prema Entha Madhuram December 19th Episode: శృతిమించి పోతున్న దివ్య ప్రవర్తన.. ఛాయాదేవి వలలో చిక్కుకున్న సుగుణ!

Prema Entha Madhuram Today Episode: భూమి తాకట్టు పెట్టడం కోసం సుగుణ ఛాయాదేవి దగ్గరికి వెళ్లి వాళ్ళు పెట్టమన్నట్లు సంతకాలు పెట్టేస్తుంది.

Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నా జోలికి వస్తే ఊరుకుంటాను కానీ నా వాళ్ళ జోలికి వస్తే ఊరుకోను.. ఇప్పటివరకు చాలా చేశావు ఇకమీదట ఆపేయ్, నీ మంచికే చెప్తున్నాను అని ఛాయదేవిని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆర్య.

ఆ తర్వాత డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ బయట నుంచొని ఉంటాడు ఆర్య. అది చూసిన దివ్య తల్లి దగ్గరికి వచ్చి బట్టలు కొంటే సరిపోతుందా, బంగారం కొనాలిగా అని గట్టిగా అరుస్తుంది.

సుగుణ : ఎందుకలా అరుస్తున్నావు, బట్టల కోసం నాలుగు లక్షలు ఖర్చు చేయించావు, ఇప్పుడు మళ్ళీ బంగారం అంటున్నావు అలా ఎలా అడుగుతున్నావు హరీష్ తో మన ఇంటి పరిస్థితి ఇది అని ఒక్క మాట అయినా చెప్పావా అని మందలిస్తుంది.

దివ్య: ఇంటి పరిస్థితి బాగోలేదని పెళ్లి ముహూర్తం ఆగదు కదా..

సుగుణ: సరే ఏదో ఒకటి చేద్దాము, గట్టిగా అరవకు.. నా కొడుకు వింటే బాధపడతాడు అంటుంది.

జ్యోతి: అంత కష్టం ఎందుకు ఆ ల్యాండ్ అమ్మేయొచ్చు కదా..

ఉష: అన్నయ్య వద్దంటున్నాడు కదా

దివ్య: అలాంటప్పుడు డబ్బులు సర్దగలగాలి, సమస్యలు చెప్పి పెళ్లి తూతూ మంత్రంగా చేస్తే ఊరుకునేది లేదు.

అను : అప్పుడే అక్కడికి వచ్చి నీ వాళ్ళని నువ్వే తక్కువ చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఇంకా ఎంత చులకనగా చూస్తారు.

అప్పుడే యాదగిరి కూడా వచ్చి మీ ఒక్కళ్ళకే పెళ్ళంటే బాధ్యత ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు, ఇంటిపెద్ద బావ ఉన్నాడు కదా అన్ని పనులు చూసుకుంటాడు అని కోప్పడటంతో ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకుంటారు.

దివ్య: నేను చెప్తున్నానని కాదు, నువ్వు కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో లేకపోతే నా పెళ్లి పెటాకులు అవ్వడం ఖాయం అని తల్లికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఈ మాటలు అన్ని ఆర్య వింటూ ఉంటాడు కానీ సైలెంట్ గా ఉంటాడు. బాధపడుతున్న ఆర్యని సర్ది చెప్పమని యాదగిరిని అడుగుతుంది అను. సార్ సంగతి నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తాడు యాదగిరి.

మాన్సీ: మా బ్రో ఇన్ లా ఇచ్చిన వార్నింగ్ తలుచుకుంటే షివరింగ్ వస్తుంది.

ఛాయాదేవి: కాస్త భయపడిన మాట నిజమే కానీ రివెంజ్ తీర్చుకోకుండా ఉండే ప్రసక్తే లేదు కాకపోతే టైం కోసం చూస్తున్నాను అని అంటూ ఉండగానే అక్కడికి సుగుణ వస్తుంది.

ఛాయాదేవి: ఏంటి మీ అబ్బాయి గొడవకి పంపించాడా?

సుగుణ: నేను ఇక్కడికి వస్తున్నట్లు వాడికి తెలియదు అంటూ ల్యాండ్ పేపర్లు తాకట్టు పెట్టడం కోసం డాక్యుమెంట్స్ తీసుకొచ్చినట్లుగా చెప్తుంది.

ఛాయాదేవి మాన్సీని లోపలికి తీసుకువెళ్లి సమయం సందర్భం కోసం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు వచ్చింది ఆ సమయం అని చెప్పి ఒక ప్లాన్ చెప్పి బయటికి వస్తుంది. తర్వాత సుగుణతో మాట్లాడుతూ

ఛాయాదేవి: ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే సర్దడం కష్టం.. మాన్సీ బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతుంది.

మాన్సీ: అప్పుడే అక్కడికి వచ్చి ఇప్పుడే బ్యాంకు వాళ్ళతో మాట్లాడాను ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తే రేపు డబ్బులు ఇస్తారంట అని అనటంతో పేపర్స్ మీద సంతకాలు పెట్టి రేపు డబ్బు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది సుగుణ.

తేలికగా మోసం చేయగలిగినందుకు నవ్వుకుంటారు మాన్సీ, ఛాయాదేవి.

ఆ తర్వాత ఆలోచనలో ఉన్న ఆర్య దగ్గరికి వచ్చి డబ్బు కోసం మీరు ఏమి కంగారు పడకండి అని సర్ది చెప్తాడు యాదగిరి. తర్వాత భూమి గురించి మాట్లాడుతూ ఆ ల్యాండ్ మీద ఇప్పటికే చాలామంది కళ్ళు ఉన్నాయి అంటాడు.

ఆర్య: అతనికి ఒక ఐడియా వచ్చి మనం భూమిని డెవలప్మెంట్ కి ఇస్తే ఎలా ఉంటుంది.. అప్పుడు అన్ని వాళ్లే చూసుకుంటారు కదా ఆర్యవర్ధన్ లా అయితే నేను డీల్ చేసేవాడిని కానీ సూర్యలాగా డీల్ చేయాలి అందుకే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లతో మాట్లాడు అంటాడు.

నా పని అదే కదా బావ అని చెప్పి వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తాడు యాదగిరి.

ఈ విషయం ఛాయాదేవికి తెలుస్తుంది.

ఛాయాదేవి : భూమిని డెవలప్మెంట్ కి ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ ఆ భూమి మన దగ్గర ఉందని అతనికి తెలియదు.

మాన్సీ: తెలిస్తే మా బ్రో ఇన్ లా షాక్ అయిపోతారు.

ఛాయాదేవి: ఆ షాక్ ఏదో మనమే ఇద్దాం పదా అని ఇద్దరు అక్కడికి బయలుదేరుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
Embed widget