Prema Entha Madhuram December 18th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అన్నని ఘోరంగా అవమానిస్తున్న దివ్య.. మాన్సీ, ఛాయాదేవి లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య!
Prema Entha Madhuram Today Episode: ఉత్కంఠభరితంగా నేటి ఎపిసోడ్. దివ్య పెళ్లికి అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నది మాన్సీ, ఛాయ దేవి అని తెలుసుకున్న ఆర్య.
Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీటింగ్ పూర్తిచేసుకుని బయటికి వచ్చిన ఆర్యని చూసి షాక్ అవుతారు దివ్య, హరీష్. వాళ్లని చూసి ఆర్య కూడా షాక్ అవుతాడు.
దివ్య: కంగారుగా ఆర్య దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.
ఆర్య : ఈ కంపెనీ క్యాంటీన్ కాంట్రాక్ట్ మనకి ఇస్తారేమో అడుగుదామని వచ్చాను అంటాడు.
హరీష్: ఇదేమైనా అల్లాటప్ప కంపెనీ అనుకున్నావా ఆర్డర్లు రావడానికి అని వెటకారంగా మాట్లాడుతాడు.
దివ్య: సరే త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే నా పరువు పోతుంది.
ఇదంతా జెండే చూస్తాడు. సిచువేషన్ ని కవర్ చేయడం కోసం అన్నట్లు ఆర్యని ఎవరు మీరు అని అడుగుతాడు.
దివ్య: అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది.
జెండే : నేను మిమ్మల్ని అడగలేదు కదా అంటూ మళ్ళీ ఆర్యవైపు తిరుగుతాడు.
ఆర్య : కాంట్రాక్ట్ కోసం వచ్చాను అంటాడు.
హరీష్ : దొరకదని చెప్తున్నాను సార్ అని గొప్పగా చెప్తాడు.
జెండే : అలా చెప్పటానికి మీరెవరు, ఇక్కడ స్థాయిని చూసి పనులు ఇవ్వరూ.. టాలెంటును చూసి పనులు ఇస్తారు అని చెప్పి మేనేజర్ తో మాట్లాడి మీకు ఇన్ఫామ్ చేస్తాం అని ఆర్యని హగ్ చేసుకుని పంపిస్తాడు.
ఆ తర్వాత కళ్యాణ మండపం మాట్లాడటానికి వెళ్తాడు ఆర్య. కళ్యాణ మండపం ఓనర్ అప్పటికే ఛాయాదేవికి అమ్ముడు పోవటం వలన కళ్యాణమండపం ఖాళీ లేదని చెప్తాడు. అప్పుడు ఆర్య జెండేకి ఫోన్ చేసి కళ్యాణ మండపాల గురించి కనుక్కోమంటాడు.
జెండే: ఊర్లో ఏ కళ్యాణ మండపాలు ఖాళీ లేవు ఆర్య, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అంటాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆర్య.
ఆ తర్వాత హరీష్ వాళ్ళ దగ్గరికి వాళ్ల బాబాయి శంకర్ వస్తాడు.
హరీష్: దివ్యని పరిచయం చేసి నాక్కూడా ఈ కంపెనీలో ఏదైనా కాంట్రాక్ట్ వచ్చేలాగా చేయు అని ఫైల్ అతని చేతికి ఇస్తాడు. ఇంతలో జెండే అక్కడికి వచ్చి శంకర్ ని తనతో పాటు తీసుకువెళ్తాడు.
ఆ తర్వాత ఛాయాదేవి హరీష్ కి ఫోన్ చేసి నీ పెళ్లి ఎస్వీఆర్ మ్యారేజ్ గార్డెన్ లోనే జరిపించాలని అడుగు అంటుంది.
హరీష్: అది సెలబ్రిటీలు పెళ్లి చేసుకునే ఫంక్షన్ హాల్ మేడం అక్కడ అంటే విలువ తట్టుకోగలరో లేదో నా పెళ్ళికి ముప్పు వస్తుందేమో అంటాడు.
ఛాయదేవి : అలాంటిదేమీ జరగదు ఆర్య భాద్యత తీసుకున్నాడు అంటే కచ్చితంగా బాధ్యత నెరవేరుస్తాడు అంటుంది.
దాంతో ఇంట్లోకి వెళ్లిన హరీష్ తన పెళ్లి ఎస్వీఆర్ మ్యారేజ్ గార్డెన్ లో చేయమని అడుగుతాడు. అందుకు ఒప్పుకుంటాడు ఆర్య. కానీ యాదగిరి, సుగుణ మాత్రం ఒప్పుకోరు అక్కడ పెళ్లంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అని చెప్తారు.
దివ్య: నువ్వు అన్నట్టే అదే కళ్యాణ మండపంలో పెళ్లి చేయమని అన్నయ్యకు చెప్తాను అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్. ఆ తర్వాత దివ్యని మందలిస్తారు సుగుణ, యాదగిరి.
దివ్య: పెద్ద గొప్పగా పెళ్లి చేస్తానని చెప్పాడు కదా 50 లక్షల ఖర్చు పెట్టిన వాడికి ఇంకొక 5 లక్షలు ఖర్చుపెట్టలేడా అని అన్నని తేలిక చేసి మాట్లాడుతుంది దివ్య. ఆమెకి సపోర్టుగా మాట్లాడుతుంది జ్యోతి.
యాదగిరి: మీకు మంచి చేయాలని చూస్తున్న వ్యక్తిని ఇలా అవమానించేలా మాట్లాడడం మంచిది కాదు అని జ్యోతిని, దివ్యని మందలిస్తాడు.
ఆ తర్వాత పెళ్లికి అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నది మాన్సీ, ఛాయాదేవి అని తెలుసుకున్న జెండే ఆ విషయాన్ని ఆర్యకి చెప్తాడు.
మరోవైపు పెళ్లికి అడుగడుగునా అడ్డంకులు తగులుతూ ఉండటంతో ఆర్య పడుతున్న ఇబ్బందిని చూసి నవ్వుకుంటూ ఉంటారు మాన్సీ, ఛాయాదేవి.. అంతలోనే హాల్లో సోఫాలో కూర్చున్న ఆర్యని చూసి షాక్ అవుతారు.
ఆర్య : నేను ఎందుకు వచ్చానో నీకు అర్థం అయ్యే ఉంటుంది నా జోలికి వస్తే ఊరుకుంటాను కానీ నా వాళ్ళ జోలికి వస్తే ఊరుకోను. మీ అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకుంటావు అనుకున్నాను అంటాడు.
ఛాయాదేవి : అది ఎప్పటికీ జరగని పని, నేను అంతమవ్వడానికి 5 నిమిషాలు ముందైనా నీ అంతం చూడటానికి ప్రయత్నిస్తాను అంటుంది.
ఆర్య: అది నీ వల్ల కాదు, ఇప్పటివరకు చేసింది చాలు ఇకమీదట ఇవన్నీ ఆపేయ్, ఇంతకుమించి చెయ్యొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read : విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్