అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today March 18th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శారదాదేవి అసలు కొడుకు తానేనన్న నిజం తెలుసుకున్న అజయ్‌ - అజయ్‌కు ఆర్య వార్నింగ్‌

Prema Entha Madhuram Today Episode: శారదాదేవి మొదటి కొడుకు అజయ్ అని నిజం తెలియడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ మరింత ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  మార్కెట్‌ నుంచి వస్తున్న అనును మద్యలో అడ్డగిస్తుంది మీరా. నువ్వు మారలేదు. నీ బస్తీ బుద్దులు కూడా మారలేదు అని వెటకారంగా మాట్లాడుతుంది. అందుకే సర్వెంట్‌ లా సరుకులు కూరగాయలు మోసుకెళ్తున్నావు అంటుంది. దీంతో నా ఇంటి పనులు నేను చేసుకోవడంలో నాకు చాలా తృప్తిగానే ఉంటుంది. నా సంగతి పక్కన పెట్టండి మీరు చాలా మారిపోయారు. మీలోని నిజాయితీ ఏమాత్రం కనిపించడం లేదు. మీరు ఇంతలా దిగజారిపోతారని నేనసలు ఊహించలేదు అని అను అనగానే మీరా కోప్పడుతుంది. ఇంకొన్ని రోజుల్లో మీ కంపెనీని ఆర్యవర్ధన్‌ ఆస్తులను మా సొంతం చేసుకుని మిమ్మల్ని ఇలాగే రోడ్డుమీద నిలబెడతాము అప్పుడు మీ పరిస్థితి ఎంటో తెలుసా? ఇలాగే ముష్టి ఎత్తుకోవడం అంటూ మీరా చెప్తుంది. మరోవైపు ఆర్య పిల్లలను స్కూల్‌లో డ్రాప్‌ చేస్తాడు.

ఆర్య: అఖి, అభయ్‌ స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకోవాలి.

అఖి: బుద్దిగా చదువుకోవాలంటే బ్రేక్‌లో బాగా తినాలి.

అభయ్‌: బాగా తినాలి అంటే క్యాంటీన్‌లోకి వెళ్లాలి.

అఖి: క్యాంటిన్‌కు వెళ్లాలి అంటే ప్యాకెట్‌ మనీ ఉండాలి.

ఆర్య: అదేమీ అవసరం లేదు. క్యారేజ్‌ మిగల్చకుండా ఖాలీ చేస్తే చాలు.

అనగానే పిల్లలు డల్‌గా చూస్తుండిపోతారు. ఇంతలో ఆర్య జేబులు చూసుకుని ఆయ్యో వాలెట్‌ మర్చిపోయాను అంటాడు. ఇంతలో అభయ్‌ తన జేబులోంచి వందరూపాయలు తీసి ఈరోజు ఇవి చాలులే అంటారు. తర్వాత ఆర్య  ఫోన్‌ మాట్లాడుతుంటే అజయ్‌ తన కూతురు ఆనందిని తీసుకుని అదే స్కూల్‌లో డ్రాప్‌ చేసి వెళ్లబోతూ ఆర్యను చూసి నోటీస్‌ జీరాక్స్‌ పేపర్స్‌ ను ఆర్య మీదకు వేస్తాడు.

అజయ్‌: వావ్‌ బ్రో ఏది ఎప్పుడు ఎక్కడికి ఎలా చేరుకోవాలో.. అలా చేరుకుంటాయంటారు. అది ఇదేనేమో చూశావా నీకు ఆఫీసియల్‌ నోటీస్‌ పంపిచాను. ఇప్పుడు వాటి నకలు కూడా నీ దగ్గరకు వచ్చాయి.

ఆర్య: నీ ఆశలు కూడా ఇలాగే గాలికి కొట్టకుపోతాయి అనిపిస్తుంది.  

అజయ్‌: నాకేమనిపిస్తుంది చెప్పనా? త్వరలోనే నీ ఆస్థి మొత్తం చేజారిపోతుందని.. యూనివర్స్‌ నీకు గుర్తు చేస్తుందనిపిస్తుంది.

ఆర్య: అనుకోవడానికేముందిలే సవాలక్ష అనుకుంటాం.. జరగాలి కదా నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు జరిగిందా? జరగలేదు. చైర్మన్ అవ్వాలనుకున్నావు జరిగిందా? జరగలేదు. ఇప్పుడు నా ఆస్థి దక్కించుకోవాలనుకుంటున్నావు జరగదు. జరగనివ్వను..

అజయ్‌: ఓవర్‌ కాన్ఫిడెంట్‌..

ఆర్య: ఓవర్‌ కాన్ఫిడెంట్ నీది నా కష్టాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అన్నది నా నమ్మకం..

అంటూ ఇద్దరు ఒకరికొకరు సవాల్‌ విసురుకుని వెళ్లిపోతారు. తర్వాత జలంధర్‌, అజయ్‌ గుడి దగ్గరకు వస్తారు.

అజయ్‌: ఎక్కడికి ఎక్కడికి అంటే చెప్పకుండా గుడి దగ్గరకు తీసుకొచ్చావెందుకు జలంధర్‌.

జలంధర్‌: నీకు నిజాన్ని పరిచయం చేయాలి. నీ గురించి నీకే తెలియని నిజం. నీ తలరాతనే మార్చేసే నిజం. ఇప్పుడు నీ జీవితాన్ని మార్చబోయేది గొప్ప నిజం.

అజయ్‌: నిజం నిజం అంటున్నావు ఎంటా నిజం..

 జలంధర్‌: చెప్పేవాళ్లు చెప్తారు పద

అజయ్‌: జలంధర్‌ ఎవరో ఎంటో చెప్తారు అన్నావు ఎవ్వరు వాళ్లు..

జలంధర్‌: అదిగో నీ జీవితాన్ని మార్చబోయే నిజం..

అంటూ దూరంగా హోమం చేస్తున్న శారదాదేవి ఫ్రెండ్‌ను చూపిస్తాడు. హోమం అయిపోయాక వచ్చిన ఆమె అజయ్‌ని చూసి నువ్వు వసుంధరాదేవి కొడుకువి కాదు శారదాదేవి మొదటి కొడుకువి.. శారదాదేవి సూర్యవర్ధన్‌ రెండవ భార్య. ఆయనకు మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఆర్యవర్ధన్‌, రెండో భార్య అయిన శారదాదేవికి పుట్టిన మొదటి కొడుకువి నువ్వే అని ఆమె నిజం చెప్పడంతో అజయ్ షాక్ అవుతాడు. దీంతో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: డీప్ నెక్ డ్రెస్​లో మంచు లక్ష్మీ.. అదిరే ఫోటోలు షేర్ చేసిన భామ

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget