Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Jagadhatri Serial Today Episode July 30th:శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. రౌడీల రివర్స్ ప్లాన్ తిప్పికొట్టి జేడీ,కేడీ వాళ్లన పట్టుకుని శ్రీవల్లిని కాపాడతారు. అటు ఇంటికి వచ్చిన కౌషికి శ్రీవల్లి ఎక్కడ అని అడిగితే మా తమ్ముడికి ఇచ్చి పంపించానని వైజయంతి చెబుతుంది. ఇంతలో కీర్తి వచ్చి ఫోన్‌లో తాను తీసిన వీడియో చూపిస్తుంది.అందులో ఆదిలక్ష్మీని నిషిక తోసివేయడం చూసి కౌషికి మండిపడుతుంది. ఆదిలక్ష్మీకి కౌషికి నిషికతో సారీ చెప్పిస్తుంది.
రౌడీల ఎత్తులకు జేడీపై ఎత్తు
పోలీసులు తన దగ్గర నుంచి బయలుదేరి వెళ్లడంతో పాపారాయుడు వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని చంపేయమని చెబుతాడు. వాళ్లు నా ఫోన్ తీసుకుని చూశారని ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఆధారంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని చెబుతాడు. దీంతో వాళ్లు సరేనంటారు. జేడీ,కేడీతోపాటు రమ్య, సింధూ అందరూ కలుసుకుంటారు. రౌడీలు ఓ చోట ఆగడాన్ని చూసి అనుమానిస్తారు.ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించడానికి రౌడీలు తమను ట్రాక్ చేస్తున్న ఫోన్ వేరొకరికి ఇచ్చి సిటీలోకి పంపిస్తారు.దీంతో రమ్య ఇదేంటీ వీళ్లు మళ్లీ సిటీలోకి వస్తున్నారని అంటుంది. వాళ్లు మనల్ని మభ్యపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని జేడీ చెబుతుంది. మనం వాళ్లను వెతుక్కుంటూ వస్తున్నామని రాయుడు బాబాయి వాళ్లకు చెప్పేసి ఉంటాడని అందుకే మనల్ని ట్రాప్ చేయడం కోసం ఫోన్ మాత్రమే వెనక్కి పంపిస్తున్నారని చెబుతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటుంది. వాళ్లు ఆగిన దగ్గర టవర్ లొకేషన్ తీసుకుని అక్కడ ఉన్న అందరి ఫోన్లు ట్రాక్ చేయమని చెబుతుంది. దీంతో రమ్య ముగ్గురు ఫోన్లు మాత్రమే ముంబయిరోడ్డులో వెళ్తున్నాయని చెబుతుంది. అంటే ఆ ముగ్గురి దగ్గరే శ్రీవల్లి ఉందని చెప్పి జేడీ బయలు దేరుతుంది.
శ్రీవల్లిని కాపాడిన జేడీ
ఒక కారులో నుంచి శ్రీవల్లిని మరోకారులో ఎక్కిస్తుండగా జేడీ, కేడీ అక్కడికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తారు. పోలీసులను చూసిన రౌడీలు రెచ్చిపోతారు. మర్యాదగా గన్‌లు కిందపడేయకపోతే శ్రీవల్లిని చంపేస్తామని బెదిరిస్తారు. దీంతో జేడీ,కేడీ ఇద్దరూ గన్‌లు కిందపడేస్తారు. దీంతో రౌడీలు కారులో తప్పించుకుని ప్రయత్నం చేయగా...సింధూ సాయంతో గన్ తీసుకున్న జేడీ...రౌడీలను కాల్చిపడేస్తుంది. దీంతో వాళ్లు శ్రీవల్లిని వదిలేస్తారు. అప్పుడు జేడీ,కేడీ అందరినీ ఇరగదీసి శ్రీవల్లిని కాపాడతారు. అసలు ఏం జరిగిందని జేడీ అడగ్గా...పాపం రాయుడు మామయ్యను కూడా కొట్టి వీళ్లు నన్ను ఎత్తుకుని వచ్చారని చెబుతుంది.అంటే శ్రీవల్లి పాపారాయుడు మామయ్యనే నమ్ముతుందని..ఇదంతా ఆయనే చేయించాడని తెలుసుకోలేకపోయిందని జేడీ అంటుంది. శ్రీవల్లిని ఇంట్లో అప్పగించమని రమ్యకు చెప్పి పంపిస్తుంది. అటు రౌడీలు పాపారాయుడికి ఫోన్ చేసి పోలీసులు మమ్మల్ని కొట్టి శ్రీవల్లిని కాపాడారని చెబుతారు. దీంతో ప్లాన్ మొత్తం చెడిపోయిందని పాపారాయుడు అనుకుంటాడు.ఇప్పుడు ఆ శ్రీవల్లి కన్నా ముందే నేను ఇంటికి చేరాలని బయలుదేరి వెళ్లిపోతాడు.
ఆదిలక్ష్మీకి సారీ చెప్పిన నిషిక
సుధాకర్, కౌషికి ఇంటికి రాగానే శ్రీవల్లి గురించి ఆరా తీస్తారు. మా అన్నయ్య వచ్చి తీసుకెళ్లిపోయాడని వైజయంతి చెబుతుంది. మేం లేకుండా మాకు మాటమాత్రం కూడా చెప్పకుండా ఎందుకు పంపించావని కౌషికి గట్టిగా నిలదీస్తుంది.మనం పంపిద్దామని అనుకున్నాం కదా అందుకే మా అన్న వస్తే పంపించానని వైజయంతి చెబుతుంది.దీంతో విసుక్కుని లోపలికి వెళ్లిపోయిన సుధాకర్,కౌషికి...వీళ్లు మన దగ్గర ఏదో దాచిపెడుతున్నారని అంటారు.అప్పుడే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతానని ఆదిలక్ష్మీ గొడవ చేస్తుంది. తలకు ఆ దెబ్బలు ఏంటని కౌషికి అడగ్గా...వీళ్లు నన్ను చంపడానికి ప్రయత్నించారని చెబుతుంది. దీంతో నిషిక కోపంతో ఆవిడే కిందపడి మాపై అబద్ధాలు చెబుతుందని అంటుంది. ఇంతలో కీర్తి ఫోన్‌లో తీసిన వీడియో తీసుకొచ్చి కౌషికికి చూపిస్తుంది.అందులో నిషిక ఆదిలక్ష్మీని గోడ వైపు తోసివేయడం ఉంటుంది. వెంటనే వచ్చి నిషికను గట్టిగా నిలదీస్తుంది. తప్పించుకునే ప్రయత్నం చేయగా...వీడియో చూపిస్తుంది. నువ్వు ఒక్కదానివే ఈ పనిచేశావా వీళ్లు కూడా సహకరించారా అని అడుగుతుంది. మాకు ఏం తెలియదని వైజయంతి తప్పించుకుంటుంది. ఫేస్ ప్యాక్‌లో కారం కలిపారనే...నిషిక ఇలాంటి పని చేసి ఉంటుందని చెబుతుంది. దీంతో వాళ్ల అత్తయ్యకు నిషికతో కౌషికి సారీ చెప్పిస్తుంది.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















