Prema Entha Madhuram Serial Today January 13th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: పండక్కి ఊరికి రానన్న రవి – యాదగిరి ఫోన్ చేయడంతో మారిపోయిన సీన్
Prema Entha Madhuram Today Episode: పండక్కి ఊరికి వెళ్తున్న శంకర్ వాళ్లను ఎలాగైనా ఆపాలనుకుంటాడు రాకేష్ దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: అసలు ఈ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. అయినా మళ్లీ మీ ఊరుకు రమ్మంటే ఎలా అంటూ నిలదీస్తాడు రవి. దీంతో చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నావు రవి అంటూ అకి అడుగుతుంది. మరోవైపు అభయ్ డల్లుగా కిందకు వెళ్తాడు.
శంకర్: ఏంటి అభయ్ చెల్లిని బావను ఊరికి ఇన్వైట్ చేసి వస్తున్నావా..?
అభయ్: రవి ఊరికి రాను అంటున్నాడు.
పైనుంచి అంతా వింటుంది మాయ..
మాయ: గుడ్ ఊరికి రానని మొండి పట్టు పట్టాడన్నమాట. అయితే ఊరి ఫ్రోగ్రాం క్యాన్సిల్
శంకర్: ఎం కాదు అందరం కలిసే ఊరికి వెళ్తాం..
జెండే: రవి రానని మొండి పట్టుపడుతున్నావు కదా శంకర్.. రవి లేకుండా మనం ఎలా వెళ్తాం.
శంకర్: చూడండి జెండే సార్ అయిదు నిమిషాల్లో రవి చెంగు చెంగున లేడి పిల్లలా గంతులేసుకుంటూ వస్తాడు చూడండి.
గౌరి: అదెలా సార్..
శంకర్: ఎలాగంటే…
పైన రూంలో..
అకి: రవి ఫ్లీజ్ అర్తం చేసుకో మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్దాం పద రవి..
రవి: ఏయ్ చెప్తున్న కదా.. నేను రానంటే రాను. నువ్వు కూడా వెళ్లడానికి వీల్లేదు అంతే.. ఇదేంటి నాన్న ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తాడో.. చెప్పండి నాన్నా..
యాదగిరి: ఏరా ఊరికి బయలుదేరారా..?
రవి: నాన్నా.. నేను..
యాదగిరి: రేయ్ బయలుదేరారా లేదా..? ఆర్యవర్థన్ గారి కూతురు, అల్లుడిగా నువ్వు అకి పాప సొంతూరు వెళ్లాలి. అక్కడ అందరితో కలిసి పండగ జరుపుకోవాలి. ఇంకా బయలుదేరకుండా ఏం చేస్తున్నారు.
రవి: బయలుదేరుతున్నాం నాన్నా..
అకి: మామయ్యగారు ఏమన్నారు రవి..
రవి: సూట్ కేసు తీసుకుని తగలడు..
అని చెప్పి ఇద్దరూ కలిసి సూట్ కేసు తీసుకుని కిందకు వస్తుంటారు. శంకర్ చూసి నవ్వుతూ..
శంకర్: జెండే సార్ నేను చెప్పాను కదా వస్తాడని…? చూడండి వస్తున్నారు.
జెండే: శంకరా మజాకా..?
శంకర్: రండి రండి త్వరగా.. ఏంటి అకి ఇంత లేటు.. పండక్కి పదిరోజులు ఊళ్లోనే ఉందామని మీ ఆయన నీతో ఎక్కువ బట్టలు సర్దించారా ఏంటి..?
గౌరి: ఇల మాట్లాడుతుంటే ఎప్పుడు బయలుదేరేది.
శంకర్: అవును పదండి మీరు ముందు నడవండి..
అంటూ శంకర్ చెప్పగానే అందరూ బ్యాగులు తీసుకుని బయలుదేరుతారు. కారులో వెళ్తుండగా మాయకు అనుమానం వస్తుంది. ఎలాగైనా విలేజ్‌కు వెళ్లకుండా ఆపాలని అనుకుంటుంది. అందుకోసం రాకేష్‌కు ఫోన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. కొద్ది దూరం వెళ్లాక ఒక షాపు దగ్గర కారు ఆపమని అడిగి షాపు దగ్గరకు వెళ్లి రాకేష్‌కు ఫోన్ చేస్తుంది మాయ.
మాయ: శంకర్ ఇంత పట్టుబట్టి మరీ విలేజ్ కు తీసుకెళ్తున్నారు అంటే.. రవిలో మార్పు తీసుకొచ్చి అకి లైఫ్‌కి అన్యాయం జరగకుండా చూడాలనేమో..?
రాకేష్: అవును మాయ నువ్వు చెప్పింది నిజం.. ఆ శంకర్ ప్లాన్ లో భాగమే ఈ విలేజ్ టూర్..
మాయ: అందుకే ఈ ప్రయాణానికి నువ్వే ఏదైనా అడ్డంకి కలిగించాలి. విలేజ్‌కు వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం కలిగించాలి.
రాకేష్: ఓకే మాయ నేను చూసుకుంటాను.
అని చెప్పి రాకేస్ ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత తన మనుషులను పిలిచి ఎలాగైనా శంకర్ వాళ్లు విలేజ్ కు వెళ్లకుండా ఆపాలని చెప్తాడు. మీరు వెళ్లి వాళ్ల కార్లకు ఆడ్డుపడండని చెప్పగానే సరే అని వెళ్లిపోతారు. కార్లలో వెళ్తున్న శంకర్ వాళ్లకు ఎదురుగా యాక్సిడెంట్ అయి ఉంటుంది. కారు దిగి చూస్తే అక్కడ కారు, బైక్ ఢీకొని ఉంటాయి. ఇంతలో అక్కడ ఒక వ్యక్తి శంకర్ వాళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూస్తుంటే ఏదో శుభకార్యానికి వెళ్తున్నట్టుగా ఉన్నారు ఇలాంటి ఎదరు అసలు మంచిది కాదని చెప్తాడు. మీరందరూ ఈ ప్రయాణం మానుకుని వెనక్కి వెళ్లిపోండని చెప్పడంతో శంకర్ వాళ్లు షాక్ అవుతారు. మాయ మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















