అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today Fabruary 15th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గౌరికి నిజం చెప్పిన జెండే – మాయను ఇరికించిన శంకర్‌

Prema Entha Madhuram  Today Episode: మాయ, రవిలు రాకేష్‌ మనుషులేనని జెండే, గౌరికి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Prema Entha Madhuram  Serial Today Episode:  వర్కర్స్‌ అందరూ రాకేష్‌ దగ్గరకు వెళ్లి మీరు చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది కదా..? మళ్లీ మీరు ఫోన్‌ ఎత్తకుండా ఉండరు కదా..? అని అడుగుతారు. దీంతో ఏం జరగదని రాకేష్ చెప్పగానే.. ఏదైనా తేడా జరిగితే బాగుండదని వార్నింగ్‌ ఇస్తారు. దీంతో రాకేస్‌ భయంతో మాయకు ఫోన్‌ చేసి ఎలాగైనా ఆ ఫ్యాక్టరీ రీ ఓపెన్‌ అయ్యేట్టు చూడు అని చెప్తాడు. మాయ కంగారు పడుతుంది.

మాయ: ఏమైంది అన్నయ్యా..?

రాకేష్‌: వర్కర్స్‌ అందరూ ఇక్కడ నన్ను చుట్టు ముట్టారు. రేపు అగ్రిమెంట్‌ చేసుకుందామని ఫోర్స్‌ చేస్తున్నారు. నేను చెప్పిందంతా అబద్దం అని తెలిస్తే వీళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు. అభయ్‌తో మాట్లాడి ఒప్పించి ఎలాగైనా కాంప్రమైజ్‌ చేయించు.

మాయ: సరే అన్నయ్యా నేను చూసుకుంటాను.

శంకర్‌: ఏంటో జెండే సార్‌ ఈ మధ్యన నా టంగ్‌కు పవర్‌ బాగా పెరిగిపోతుంది. ఇలా అనగానే అలా జరిగిపోతుంది. చూశారా రాకేష్‌ను అప్పుడే వర్కర్స్‌ చుట్టుముట్టేశారు.

జెండే: పాపం మాయకు పెద్ద టాస్క్‌ వచ్చింది శంకర్‌. తనకు టెన్షన్‌ ఎందుకులే ఆలోచించుకోని..

శంకర్‌: అంతేనంటారా..? మీ మాట ఎందుకు కాదంటాను సార్‌ రండి మనం అలా చల్లగాలిని ఆస్వాదిస్తూ.. టెర్రస్‌ పైన మాట్లాడుకుందాం. నువ్వు ఆలోచించుకో బాగా ఆలోచించుకో.. ఆల్‌ ది బెస్ట్‌. రండి జెండే సార్‌..

అంటూ జెండే, శంకర్‌ పైకి వెళ్లిపోతారు. తర్వాత డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఎవ్వరూ భోజనం చేయకుండా కూర్చుని ఉంటారు. అప్పుడే అక్కడికి జెండే, శంకర్‌ వస్తారు.

శంకర్‌: ఏంటి అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎవరూ ఏమీ వడ్డించుకోలేదు.. ఏమైంది.

గౌరి: ఏమైందో ఏంటో మీకు తెలియదా..?

శంకర్‌: ఫ్యాక్టరీ ప్రాబ్లమ్‌ గురించా అది క్లోజ్‌ చేశాం. ఇంకా ప్రాబ్లమ్‌ ఏంటి..?

అకి: ఫ్యాక్టరీని క్లోజ్‌ చేస్తే అది ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయినట్టు కాదు కదా శంకర్‌ గారు.

అభయ్‌: చెప్పండి శంకర్‌ గారు ఫ్యాక్టరీ ఎందుకు క్లోజ్‌ చేయించారు.

పెద్దొడు: అన్నయ్యా నీ మనసులో ఏముందో చెప్పు. నిన్ను ఎవరూ ఏమీ అనుకోవద్దు.

చిన్నోడు: వర్దన్‌ ఫ్యామిలీ మీకు చాలా వ్యాల్యూ ఇస్తుంది.

శ్రావణి: శంకర్‌ గారు మీరు ఏం చేసినా రీజన్‌ ఉంటుంది. అదేంటో చెప్పండి.

అభయ్‌: ఏంటి శంకర్‌ గారే ఏంటి మీ స్ట్రాటజీ..

శంకర్‌: చెప్పాల్సింది నేను కాదు మాయ..

అని శంకర్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. మాయ వైపు ఆశ్చర్యంగా చూస్తారు.

మాయ: నా పేరు చెప్తున్నాడేంటి..? ఏం ప్లాన్‌ చేశాడు. ( అని మనసులో అనుకుంటుంది.)

అభయ్‌: మాయా..?

శంకర్‌: అవును మీ అందరూ ఈ డిసిషన్‌ నాది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నిజానికి నాకు ఈ ఐడియా ఇచ్చింది మాయానే..!

రవి: మాయ ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్‌ చేయమంది.

శంకర్‌: ఎందుకంటే ఫ్యాక్టరీలో గొడవలు రావడానికి కారణం రాకేషే కాబట్టి.

అకి: రాకేషా…?

శంకర్‌: అవును అకి.. అంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఈ మాయకు తెలిసింది. మాయ నువ్వేం టెన్షన్‌ పడకు మీ అన్నయ్య ప్లాన్‌కు నీకు ఎలాంటి సంబంధం లేదు.

రవి: అంటే ఫ్యాక్టరీ విషయం ఇంత వరకు వస్తుందని తెలిసే ఇంత కుట్ర చేశారన్నమాట. ఎంత ద్రోహం. ( అని మనసులో అనుకుంటాడు.)

జెండే: వావ్‌ సూపర్‌ మాయ. వర్ధన్‌ ఫ్యామిలీ కోసం సొంత అన్నయ్యనే ప్రాబ్లంలో పడేసి ఎంత త్యాగం చేశావు.

శంకర్‌: ఇంత చేసి కూడా ఏమీ చేయనట్టు మౌనంగా ఉంది కదా అదీ సార్‌ ఆవిడ గొప్పదనం.

అని జెండే, శంకర్‌ కలిసి మాయను ఇరకాటంలో పడేస్తారు. మాయ అయోమయంగా చూస్తుంది. తర్వాత గౌరి, జెండే దగ్గరకు వెళ్లి ఫ్యాక్టరీని క్లోజ్‌ చేయాలన్న డిసిషన్‌ శంకర్‌ దే కదా సార్‌ మరి ఎందుకు మాయది అని చెప్పారు అని అడుగుతుంది. దీంతో జెండే మాయ, వర్దన్‌ కుటుంబం మీద పగతోనే ఈ ఇంట్లోకి అడుగుపెట్టిందని నిజం చెప్తాడు. దీంతో గౌరి షాక్‌ అవుతుంది. రవి గురించి చెప్తాడు. ఇదంతా  ఎందుకు చేస్తున్నాడని గౌరి అడిగితే మాయను  అభయ్‌ లవ్‌ చేస్తున్నాడని అందుకే రవి, మాయను మార్చాలని శంకర్‌ ఇలా చేస్తున్నాడని జెండే చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
Karthika Deepam 2 Serial Today July 17th: కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 17th: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
నువ్వులేక నేను లేను: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
Podarillu Serial Today July 17th:మహా బర్త్‌డేకు చక్రి సర్‌ఫ్రైజ్ ప్లాన్‌....అంతకన్నా ఎక్కువ షాక్‌ ఇచ్చిన మహాలక్ష్మీ
పొదరిల్లు: మహా బర్త్‌డేకు చక్రి సర్‌ఫ్రైజ్ ప్లాన్‌....అంతకన్నా ఎక్కువ షాక్‌ ఇచ్చిన మహాలక్ష్మీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget