నల్ల ద్రాక్షలను రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

Published by: Geddam Vijaya Madhuri

శరీరానికి వివిధ పోషకాలను అందించాలనుకుంటే వీటిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

నల్లద్రాక్షల్లో విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్​, జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తని పెంచి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఈ ద్రాక్షలు యాంటీ ఏజింగ్ లక్షణాలు మెరుగుపరుస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

బీపీ ఎక్కువగా ఉన్నవారు వీటిని తింటే.. శరీరంలో రక్తపోటు స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి.

మధుమేహమున్నవారు కూడా నల్లద్రాక్షలను హాయిగా తినొచ్చని చెప్తున్నారు నిపుణులు.

ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

జీర్ణ సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు వీటిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు. వీటిలోని ఫైబర్ మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.

స్కిన్​ హెల్త్​కి కూడా చాలా మంచిది. స్కిన్​కి గ్లో అందించడంతో పాటు వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది.