అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today December 6th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:  టెండర్‌ కోట్‌ కొట్టేసేందుకు రాకేష్‌ ప్లాన్‌ – రవికి వార్నింగ్‌ ఇచ్చిన అభయ్‌

Prema Entha Madhuram  Today Episode:  శంకర్‌ చాంబర్‌లో ఉన్న టెండర్‌ కోట్‌ ను కొట్టేసేందుకు రాకేష్‌.. చిన్నొడు, పెద్దొడిని పంపిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Prema Entha Madhuram  Serial Today Episode:   అభయ్‌ రవిని తిట్టి.. జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి రవి వెళ్లిపోతుంటే శ్రావణి, సంధ్య ఆపి రవిని ఓదారుస్తారు. ఇన్ని అవమానాలు పడుతూ కూడా ఇక్కడే ఎందుకు జాబ్ చేస్తున్నారు బయట వేరే జాబ్‌ చూసుకోవచ్చు కదా అని అడిగితే మా నాన్న కోసం ఇదంతా భరిస్తున్నానని రవి చెప్తాడు. దీంతో కొందరుంటారు జీవితాన్ని ఇచ్చిన వాళ్లను కూడా మర్చిపోతారు అంటారు. దీంతో పెద్దొడు, చిన్నోడు ఫీలవుతారు. శంకర్‌ చాంబర్‌లో ఆలోచిస్తుంటాడు.

శంకర్‌: ఏదో టెంబర్‌ అంటున్నారు. కోట్‌ అంటున్నారు. ఏంటో ఈ ఆఫీసు గోల ఒక్క ముక్క అర్థం కావడం లేదు.

రవి: ఎక్స్‌ కూజ్‌ మీ సర్‌ మే ఐ కమీన్‌ సార్‌.

శంకర్‌: ఓ నువ్వా రవి రా.. అయినా మనలో మనకు పర్మిషన్స్‌ ఏంటయ్యా.. అవును ఆఫీసులో పెద్ద ప్రాజెక్టుకు టెండర్‌ వేస్తున్నారట.. అందరూ హడావిడిగా ఉన్నారు. నాకు ఏ పని లేదు కాబట్టి.. టెన్షన్‌ పడే పని చేస్తున్నాను. ఇంతకీ ఆ టెండర్‌ గోల ఏంటయ్యా..

రవి: ఏమీ లేదు సార్‌ ఒక ప్రాజెక్టు చేయడానికి గవర్నమెంట్‌ టెండర్‌ నోటీస్‌ రిలీజ్ చేస్తుంది. కంపెనీస్‌ అన్ని ఆ ప్రాజెక్టును ఇంత బడ్జెట్‌ లో పూర్తి చేస్తామని ఎస్టిమేషన్‌ కోట్‌ చేస్తారు. తక్కువ బడ్జెట్‌ లో కోట్ చేసిన వాళ్లకు ప్రాజెక్టు దక్కుతుంది.

శంకర్‌: ఓహో అంటే ఇదో రకమైన వేలం పాట అన్నమాట. అందుకేనయ్యా అందుకే నేను నిన్ను నా పీఏగా తీసుకున్నాను..  అనుకుంటున్నావా…?  అదికాదు అకిని నిన్ను కలపడానికి నిన్ను ఇక్కడ సెట్‌ చేశాను.

రవి షాక్‌ అవుతాడు. మానాన్నకు బాధ కలిగించే ఏ పని నేను చేయను అంటాడు. ఇంతలో జెండే వచ్చి టెండర్‌ కోట్‌ శంకర్‌ కు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. రవిని తీసుకుని బయటకు వెళ్తాడు జెండే. వాళ్లు వచ్చారు మాట్లాడారు వెళ్లిపోయారు. మళ్లీ నేను ఏ పని చేయాలని టెన్షన్‌ స్టార్ట్‌ అయింది అనుకుంటాడు. మరోవైపు ఉదయ్‌, రాకేష్‌కు ఫోన్‌ చేసి ఆర్యవర్ధన్‌ కోట్‌ చేసే టెండర్‌ లీక్‌ చేస్తా అన్నారు ఏమైందని అడుగుతాడు. ఇస్తానని చెప్తాడు రాకేష్‌. చిన్నోడు, పెద్దొడి దగ్గరకు వెళ్లి నేను చెప్పిన పని ఏమైందని అడుగుతాడు. ఇప్పడే చేస్తామని శంకర్‌ చాంబర్‌లోకి వెళ్తారు.

శంకర్‌: వీళ్లిద్దరేంటి లోపలికి రాకుండా డోర్‌ దగ్గరే స్టెప్పులేస్తున్నారు.

రాకేష్‌: వీళ్లను నమ్ముకుంటే లాభం లేదు. నేనే ఏదో ఒకటి చేసి సెట్‌ చేయాలి. ( అని మనసులో అనుకుంటారు) మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్లి సెట్‌ చేస్తాను. (శంకర్‌ చాంబర్‌లోకి వెళ్తాడు.) మీ తమ్ముళ్లిద్దరూ మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు. కానీ మీకు భయపడి బయటే ఆగిపోయారు.

శంకర్‌: సారీ అయినా వాళ్లు చెప్తారా..? నువ్వే చెప్తావా..?

రాకేష్‌: ఇప్పుడే తీసుకొస్తాను.. ఇంకా ఆలోచిస్తారేంటి.. సారీ చెప్పండి..

అనగానే ఇద్దరూ శంకర్‌ కాళ్ల మీద పడి ఏడుస్తుంటారు. ఇక లేవండి క్షమిస్తాడు మీ అన్నయ్య అని రాకేష్‌ చెప్పగానే ఎలా క్షమిస్తాను అంటాడు శంకర్‌. ఇంతలో ఇద్దరూ మళ్లీ శంకర్‌ను హగ్‌ చేసుకుని ఏడవడంతో శంకర్‌ సరేనని ఇద్దరిని క్షమిస్తున్నాను అని మన ముగ్గురం కలిపిపోయిన విషయం గౌరి గారికి చెప్పాలి అని బయటకు వెళ్తాడు. బయట ఎదురుగా గౌరి వచ్చి శంకర్‌కు డాష్‌ ఇవ్వగానే.. గౌరి గతజన్మలో జరిగింది గుర్తు చేసుకుంటూ నవ్వుతుంది. శంకర్‌ ఆశ్చర్యంగా చూస్తూ గౌరిని కింద పడేస్తాడు. దీంతో ఇద్దరి మద్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu July 13th Episode: బాలుపట్ల తప్పు చేశానని లెంపలేసుకుని క్షమాపణలు చెప్పిన మనోజ్‌...వెంటనే కళ్లు ప్రసాదించిన బాలు
గుండెనిండా గుడిగంటలు: బాలుపట్ల తప్పు చేశానని లెంపలేసుకుని క్షమాపణలు చెప్పిన మనోజ్‌...వెంటనే కళ్లు ప్రసాదించిన బాలు
Illu Illalu Pillalu Serial Today July 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ లేచిపోయిందా.. ఇప్పుడు చూపిస్తా వల్లీ అంటే ఏంటో? తిరుపతితో పెళ్లికి రెడీ అయిన సుక్కు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ లేచిపోయిందా.. ఇప్పుడు చూపిస్తా వల్లీ అంటే ఏంటో? తిరుపతితో పెళ్లికి రెడీ అయిన సుక్కు!
Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Embed widget