Prema Entha Madhuram Serial Today April 2nd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: హోమం చెడగొట్టిన అజయ్ - వార్నింగ్ ఇచ్చిన ఆర్య
Prema Entha Madhuram Today Episode: మీరా, అజయ్ ని రెచ్చగొట్టడంతో అజయ్ ఇంటికి వచ్చి హోమాన్ని చెడగొడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య, అను, పిల్లలు పూజ కోసం రెడీ అవుతుంటారు. ఇంతలో శారదాదేవి వచ్చి అనుకు నగలు ఇస్తుంది. ఆర్యకు బ్రాస్‌లెట్ ఇస్తుంది. అందరూ కలిసి కిందకు వస్తారు. ఆర్య, అను పూజలో కూర్చుంటారు. అకి పూజ ఎందుకు చేస్తున్నారని అడగ్గానే.. అభయ్ ప్రసాదం కోసం అంటాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు.
శారదాదేవి: అలా కాదు నాన్న మీ అమ్మా నాన్న ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ పూజ చేస్తున్నాను.
అభయ్: మరి పిన్ని బాబాయ్ లతో చేయించాలి కదా?
కేశవ: అభయ్ ఈ ఇంటికి పెద్ద మీ అమ్మా నాన్న కదా ముందు మీ అమ్మా నాన్నలు చేసిన తర్వాత వాళ్లు చేస్తారు.
అకి: పూజారి గారు మంత్రాలు గట్టిగా చదవండి లేదంటే అమ్మవారికి వినిపించవు.
అనగానే అందరూ నవ్వుతుంటారు. నవ్వండి..నవ్వండి కాసేపట్లో అంతా ఏడుస్తారు. అని మనసులో అనుకుంటూ ఈ ఫోటోలను మీరాకు పంపిచాను. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది అని మనసులో అనుకుంటుంది మాన్షి. మరోవైపు ఫోటోలు చూసిన మీరా డల్‌గా ఉండటంతో
అజయ్: వాట్ హాపెండ్ మీరా సడెన్‌గా డల్ అయిపోయావు.
మీరా: నువ్వే చూడు ( అంటూ ఫోన్‌లో ఫోటోలు చూపిస్తుంది.)
అజయ్: ఏ జరుగుతుంది మీరా అక్కడ.
మీరా: అను ఆర్యవర్ధన్ లు కలకాలం సంతోషంగా ఉండాలని మీ అమ్మగారు వాళ్ల చేత హోమం చేయిస్తున్నారు.
అజయ్: నీకు ముందే తెలుసా?
మీరా: మనతో ఎందుకు చెప్తారు అజయ్. నీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ల లైఫ్‌లో మనం చాలా డిస్టర్బ్ గా తయారయ్యామని.. ఒకరకంగా మనల్ని వదిలించుకోవడానికే ఈ పూజలు హోమాలు. వాల్ల దృష్టిలో మనకు అసలు వ్యాల్యూయే లేదు.
అనగానే అజయ్ కోపంగా మనం వెళ్దాం పద అది మన ఇల్లు మన ఇంట్లో వాళ్లు పూజలు చేయడం ఏంటని కోపంగా ఆనందిని తీసుకుని వెళ్దాం పద అంటాడు. నువ్వు ఇలా రెచ్చిపోయి అక్కడ గొడవ చేయడమే నాకు కావాల్సింది అని మీరా మనసులో అనుకుంటుంది. హోమం జరుగుతుంటే అజయ్, మీరా, ఆనంది వస్తారు.
అజయ్: ఆపండి.. ఏం జరుగుతుంది ఇక్కడ.
శారద: అజయ్ ఈ ఇంటి క్షేమం కోసం హోమం చేయిస్తున్నాము.
అజయ్: ఈ ఇంటి కోసమా? ఆర్యవర్దన్ ఫ్యామిలీ కోసమా?
ఆర్య: అజయ్ మా ఫ్యామిలీ అంటే మేం నలుగురం అని మాత్రమే కాదు. మనందరం కలిస్తేనే ఫ్యామిలీ. వర్ధన్ ఫ్యామిలీ..
అజయ్: సర్ నేమ్ ఉంటే సరిపోదు. బ్లడ్ రిలేషన్ కూడా ఉటేనే ఫ్యామిలీ..
శారద: ఏం మాట్లాడుతున్నావు అజయ్ ఇప్పుడంత పెద్ద మాటలు ఎందుకు? ఇంట్లో ఎవరు పూజ చేసినా ఫలితం అందరికీ దక్కుతుంది.
మీరా: అదేంటి అత్తయ్యా మీరు తింటే నా కడుపు ఎలా నిండుతుంది. సో ఎవరు చేసిన పూజ వాళ్లకే ఫలితాన్ని ఇస్తుంది.
శారద: దానిదేం ఉంది మీరా మీరు కూడా వచ్చి పూజలో కూర్చోండి. ఎవరు వద్దనలేదు కదా?
అజయ్: అలా కాదు అమ్మా ఈ ఇంట్లో ఏం జరిగినా ఏ చిన్న కార్యక్రమం అయినా నేనే ముందుండాలి. ముఖ్యంగా నా చేతుల మీదుగానే జరగాలి. అదే నేను కోరుకునే విలువ.
శారద: పెద్దకొడుకు అర్య ఉండగా నువ్వు చేయకూడదు. అది ధర్మం కాదు.
అనగానే అర్య ఒక్కడే మీ కొడుకా? అజయ్ మీ కొడుకు కాదా? అంటుంది మీరా. అజయ్ కూడా నేను మీ కొడుకు లాంటి వాణ్ని కాదా? అంటాడు. దీంతో నీరజ్ అజయ్‌ని నువ్వు అనామకుడివి అంటూ తిట్టగానే అజయ్ కోపంగా నీరజ్‌ను కొట్టబోయేసరికి ఆర్య, అజయ్ చేయి పట్టుకుని ఇంకొకసారి నీరజ్ మీదకు చెయ్యి లేసిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో వాడు నాకు తమ్ముడే అంటూ అజయ్ అనగానే నీరజ్ ఎవడ్రా నీకు తమ్ముడు అంటూ అజయ్ మీదకు వెళ్తాడు. ఇంతలో శారదాదేవి కల్పించుకుని ఏడుస్తుంది. తామే పూజ జరిపిస్తామని అజయ్ చెప్పి రెడీ అయి వస్తామని పైకి వెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: నటి శరణ్య పొనన్వన్నన్ పై కేసు నమోదు