Prema Entha Madhuram Serial Today April 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి వాల్ల బాబయ్‌కి సీరియస్ కండీషన్ – పెళ్లి చేసుకుంటామని మాటిచ్చిన గౌరి
Prema Entha Madhuram Today Episode: గౌరి వాళ్లు ముగ్గురు తను చూసిన సంబంధాలనే పెళ్లి చేసుకోవాలని వాళ్ల బాబాయ్ కోరడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: గుడిలో గౌరి దగ్గరకు వెళ్ళిన శంకర్ పెళ్లిళ్ల గురించి ఏం ఆలోచించారు అని అడుగుతాడు. దీంతో గౌరి బాబాయ్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ నేనేం చేయలేకపోతున్నాను అంటుంది. దీంతో శంకర్ మీరేం ఆలోచించకండి మనం అనుకున్న ముహూర్తానికే మా తమ్ముళ్లు, మీ చెల్లెళ్ల పెళ్లిళ్లు, అభయ్, మాయల పెళ్లి చేస్తాను అని చెప్తాడు.
గౌరి: అది సరే కానీ దాని కంటే ముందు..
శంకర్: ఆ దాని కంటే ముందు.. ( మనసులో) మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడగొచ్చు కదా గౌరి గారు.
గౌరి: ( మనసులో) నన్ను పెళ్లి చేసుకుంటానని అడగొచ్చు కదా…
అకి: గౌరి గారు మిమ్మల్ని కలవడానికే వచ్చాము. మీ బాబాయి గారి హెల్త్ బాగానే ఉందా..?
శంకర్: అకి అదంతా దొంగ నాటకం అకి. వీళ్ల పెళ్లిళ్లు చేయాలని ఆయనలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
గౌరి: శంకర్ గారు… అకి.. అభయ్, మాయని క్షమించేశాడా..?
రవి: మా నాన్న సాధువు వేషం వేసి ఇప్పుడే బ్రెయిన్ వాష్ చేశారండి. ఇక ఫైనల్‌గా ఒక్క ఝలక్ ఇస్తే అంతా సెట్ అయిపోతుంది.
శంకర్: అంతే కదా..? ఇప్పుడే వెళ్లి అభయ్ డైలమాని అంతా క్లియర్ చేసేస్తా..ఓకే
అంటూ శంకర్ వెళ్లిపోతాడు. మరోవైపు సంధ్య ఒక దగ్గర కూర్చుని చిన్నొడిని తిడుతుంది. శ్రావణి, పెద్దొడి గురించి మాట్లాడుకుని బాధపడతారు.
సంధ్య: పాపం కదా..?
చిన్నొడు: ఏంటి పాపం రాత్రి కూడా అంతే వాడి వల్లే దొరికిపోయాము. లేదంటేనా ఇంకాసేపు కబుర్లు చెప్పుకునే వాళ్లం.
శ్రావణి: ఆ కబుర్లు ఏవో ఇప్పుడు చెప్పు
చిన్నొడు: అవును సంధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా..? పనిలో పనిగా మన కళ్యాణం కూడా అయిపోతే ఎంత బాగుంటుందో కదా..?
సంధ్య: అవును అనుకో.. అయినా సరే అందరినీ ఒప్పించి లక్షణంగా పెళ్లి చేసుకుని వచ్చే సంవత్సరం భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుని మనమే కళ్యాణం జరిపిద్దాం.
చిన్నొడు: అబ్బాబ్బా నా బుజ్జి.. అమ్మో శ్రావణి వచ్చేస్తుంది.
సంధ్య: ఓరి దేవుడా ఇప్పుడెలా..? నన్ను ఇక్కడ నీతో చూసిందంటే ఓవరాక్షన్ చేసేస్తుంది.
శ్రావణి: సంధ్యా.. చిన్నోడు ఇక్కడ ఉన్నాడంటే సంధ్య కచ్చితంగా ఇక్కడే ఉంటుంది.
చిన్నొడు: దేవుడా నా ప్రేమకు అడ్డు తగులుతున్న దుష్ట శక్తుల పీడ వదిలిపోవాలి దేవుడా..?
శ్రావణి: ఏయ్ నన్నే అంటున్నావు కదా..?
చిన్నొడు: ఏయ్ శ్రావణి గారు మీరేంటి ఇలా వచ్చారు. నాతో ఏమైనా మాట్లాడాలా..?
శ్రావణి: నీతో నాకు మాటలేంటి..? నేను సంధ్య కోసం వచ్చాను.
చిన్నొడు: ఓ సంధ్యనా..? ఇటు రండి ఇదిగోండి ఈ తలుపు ఉంది కదా ఈ తలుపు పక్కనే దాక్కుంది. వచ్చి తీసుకెళ్లండి.
శ్రావణి: చిన్నొడు ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే సంధ్య అక్కడ లేదన్నమాట ( అని మనసులో అనుకుంటుంది) అక్కడ ఎవ్వరూ లేరని నాకు తెలుసు
అంటూ శ్రావణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత గౌరి వాళ్ల బాబాయ్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో గౌరి వాళ్లు ఇంటికి వెళ్తారు. అక్కడ డాక్టర్ ఆయన్ని పరీక్షించి వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని లేకపోతే ప్రమాదం అని చెప్తాడు. అయితే గౌరి వాళ్లు పెళ్లి చేసుకుంటామని నాకు మాట ఇస్తేనే నేను ఇంజక్షన్ వేయించుకుంటానని వాళ్ల బాబాయ్ కండీషన్ పెడతాడు. దీంతో ముగ్గురు ఆయనకు పెళ్లి చేసుకుంటామని మాటిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















