అన్వేషించండి

Podharillu Serial Today January 28th:మహాను చూడటానికి ఇష్టపడని ప్రతాప్‌..తన అత్తగారి ఇంట్లో ఉన్న మహాను బయటకు గెంటేసిన ఆది...ఇప్పుడు మహా ఎక్కడికి వెళ్తుంది...?

Podharillu Serial Today Episode January 28th: మహాను చూడటానికి ఇష్టపడని ప్రతాప్‌..తన అత్తగారి ఇంట్లో ఉన్న మహాను బయటకు గెంటేసిన ఆది...ఇప్పుడు మహా ఎక్కడికి వెళ్తుంది...?

Podharillu Serial Today Episode: మాహా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో  ఊరివారంతా  నానా రకాలుగా మాట్లాడుకోవడం  చక్రి అన్నదమ్ములకు నచ్చడం లేదు. వాళ్లందరి నోర్లు మూయించాలంటే  మనం తప్పకుండా నాన్న చెప్పినట్లు  రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెట్టాల్సిందేనని అంటారు. ఇప్పుడు అంత ఖర్చు అవసరమా అని కేశవ్‌ అనగా....మనఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం కాబట్టి ఖర్చు గురించి ఆలోచించవద్దని  చెబుతాడు. అందరికీ మటన్ బిర్యానీ పెట్టి మరీ ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉండటానికి  వచ్చిందని చెప్పి నోరు మూయిద్దామని అంటాడు. చక్రి సాయంత్రం అమ్మాయిని తీసుకుని వస్తానన్నాడు కాబట్టి ఈరోజే  ఆ పని చేద్దామని మాధవ్ అంటాడు. ఇంటి ముందే పెద్ద టెంట్‌ వేసి అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేయాలని అన్నదమ్ములు ఏర్పాట్లు చేస్తుంటారు.
               నిహారకి వాళ్ల ఇంట్లో ఉన్న మహాలక్ష్మీతో వాళ్ల అమ్మ మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఎలాంటి భారంకాదని...కాకపోతే నిన్ను ఇక్కడ చూశాడంటే మా అల్లుడు ఏమైనా గొడవ చేస్తాడేమోనని భయంగా ఉందని అంటారు. మీకు  ఆ భయం అక్కర్లేదండీ  నేను ఈరోజే మానాన్నను కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని అంటుంది. నీ పేరు చెబితేనే మీ నాన్న ఒప్పుకోవడం లేదని మీఅన్నయ్య చెప్పాడమ్మా...ఇప్పుడు నువ్వు నేరుగా  వెళితే బాగుండదని చెబుతాడు. ఇంతలోనే ఆది అక్కడికి వస్తాడు. రావడంతోనే  ఇది ఇక్కడ ఎందుకు ఉందని మండిపడతాడు. నిన్ను ఆస్పత్రికి వస్తేనే రానివ్వలేదని...మళ్లీ సిగ్గులేకండా   మా అత్తయ్యవాళ్ల ఇంటికి ఎలా వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నేను నాన్నతో ఒకసారి మాట్లాడి వెళ్లిపోతానని చెప్పినా వినడు. నువ్వు చేసిన పనికే మా నాన్న ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని...మళ్లీ ఏం ముఖం పెట్టుకుని ఆయన్ను కలుస్తావని నిలదీస్తాడు. నీకు నాన్నపై అంత ప్రేమ ఉంటే...పోలీసుస్టేషన్‌లో  నాన్న అంత బ్రతిమాలినప్పుడు ఏం చేశావని ఆది మహాను తిడతాడు. మా పరువుతీసి ఆ డ్రైవర్‌తో తాళి కట్టించుకున్నప్పుడు ఏమైంది నీ ప్రేమ అని అంటాడు. మర్యాదగా బయటకు వెళ్లిపోతావా లేదా అంటూ చేయి పట్టుకుని బయటకు లాక్కుని వచ్చి విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి మహాను పట్టుకుని ఆపుతాడు.
             ఈ డ్రైవర్‌ వెదవ కూడా ఇక్కడే ఉన్నాడా అని ఆది మండపడతాడు. మీరిద్దరూ  ఇక్కడే కాదు ఈ ఊరిలో కనిపించినా చంపేస్తానని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మానాన్నను చూడొద్దని చెప్పడానికి నువ్వెవరివీ...నువ్వు ఏం చేసినా నేను నాన్నను చూసే ఇక్కడ నుంచి వెళ్తానని మహా అంటుంది. దీంతో ఆది వాళ్ల నాన్ను కు ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌చేస్తాడు. మహా ఇక్కడికి వచ్చిందని...నిన్ను చూడాలని గొడవ చేస్తోందని అంటాడు.ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ల గురించి నేను ఆలోచించనని నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని అంటాడు. నేను చచ్చివరకు దాని ముఖం నాకు చూపించొద్దని మండిపడతాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మీ ఎంతో బాధపడుతుంది. నాన్న చెప్పంది విన్నావు కదా...నిన్ను చూడటం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని దయచేసి ఇక్కడ గొడవ చేయకుండా బయలుదేరండని  ఆది చెప్పడంతో  చక్రి మహాను తీసుకుని బయటకు వెళ్తాడు. కోపంలో మీ నాన్న అన్న మాటలు పట్టించుకోవద్దని చక్రి మాహాను ఓదార్చుతాడు. నాకు  ఇష్టం లేని పెళ్లి చేయాలని చూసి వాళ్లు తప్పుచేసి ఇప్పుడు నిందలు నాపై వేస్తున్నారని మహా ఏడుస్తుంది. పెళ్లికి ముందు నేను చెప్పేది వినకుండా  నన్ను ఆ జుట్టుపోలిగాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారని...ఇప్పుడు అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోవడం లేదని అంటుంది. ఇప్పుడు  ఏం చేద్దామని అంటే మీ వదినకు ఒకసారి కాల్‌ చేసి మాట్లాడమని చక్రి ఫోన్ ఇస్తాడు. నిహారిక ఫోన్ చేయగా...నీమీద మీనాన్న,అమ్మ చాలా కోపంగా ఉన్నారని..నిన్ను మా ఇంట్లో ఉంచినందుకు నామీద కూడా మండిపడ్డారని చెబుతుంది. మీ నాన్నకు తగ్గి ఈ గొడవలు చల్లారే వరకు నువ్వు ఆయన్ను కలవడానికి ప్రయత్నించకపోవడమే మంచిదని చెబుతుంది. అన్ని సర్దుకున్న తర్వాత నేనే నీకు ఫోన్ చేసి చెబుతానని...అప్పటి వరకు ఫోన్ చేయడం గానీ,ఇక్కడకి రావడం గానీ చేయవద్దని అంటుంది. 
  అటు మాధవ్‌ వాళ్ల రిసెప్షన్‌కు అన్నీ ఏర్పాట్లు చేయడమేగాక...ఊరందరినీ పిలుస్తారు. మా ఇంట్లో సాయంత్రం రిసెప్షన్ ఉందని అందరూ తప్పకుండా రావాలని ఇంటింటికి తిరిగి వెళ్లి చెప్పి వస్తారు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget