అన్వేషించండి

Podharillu Serial Today December9th: మాధవ్‌ పెళ్లి చూపుల వ్యవహారం అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసింది. చక్రి,కేశవ్‌ ఒకరినొకరు ఎందుకు కొట్టుకున్నారు..?

Podharillu Serial Today Episode December9th: మాధవ్‌ పెళ్లిచూపులకు రెడీ అవ్వడంతో ఊళ్లోవాళ్ల అన్న మాటలకు కేశవ్ ఆవేపడతాడు. దీంతో అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకుంటారు.

Podharillu Serial Today Episode: పెళ్లి ప్రయత్నాలు వద్దని చెప్పినా  వినడం లేదని కుటుంబ సభ్యులపై మహలక్ష్మీ మండిపడుతుంది. నా డ్రీమ్‌  ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు నేను ఎలాంటి పెళ్లి చేసుకోనని చెబుతుంది. తాను కాలేజీకి వెళ్లాలని  చెప్పి బయటకు వెళ్లిపోతుంది. కానీ ఆమె తన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్న సంగతి ఇంట్లో చెప్పదు. తన ప్రెండ్‌ కిరణ్‌ను పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పగా...అతను ఓ క్యాబ్‌ బుక్‌చేస్తాడు. అతను చెప్పినట్లుగా కారు వెతుక్కుంటూ  చక్రి నడిపే క్యాబ్‌ వద్దకు వచ్చి అదే తాను బుక్‌ చేసుకున్న కారు అనుకుంటుంది. మహిని చూడగానే  చక్రి తాను నాకోసమే పుట్టిందన్నంత సంతోషడతాడు. కానీ ఈలోగా తాను ఎక్కాల్సిన కారు వెనక ఉందని  తెలుసుకుని మహి చక్రి కారు దిగి వెళ్లిపోతుంది.

   అన్నయ్య పెళ్లిచూపులకు త్వరగా ఇంటికి వెళ్తున్న  కేశవ్‌కు దారిలో వాళ్ల నాన్న నారాయణ టీకొట్టులో టీ తాగుతూ కనిపిస్తాడు. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి....పెద్ద కొడుకు పెళ్లిచూపులు పెట్టుకుని ఇంత తాపీగా ఇక్కడ కూర్చుని టీ తాగుతున్నావా అని నిలదీస్తాడు. అసలు నీకు బాధ్యత లేదా అని కోప్పడతాడు. అప్పుడు అక్కడే ఉన్న వాళ్ల పెద్దనాన్న బిగ్గరగా నవ్వుతూ....ఐదుగురు మగాళ్లు ఉన్న మీ కొంపకి ఎవరైనా ఆడబిడ్డను ఇస్తారురా అంటూ హేళన చేస్తాడు. దీంతో తండ్రిపై కేశవ్ మరింత కోప్పడతాడు. నువ్వే సరిగా ఉన్నట్లయితే ఇప్పుడు అందరితో ఇలా మాటలు పడాల్సి వచ్చేది కాదంటాడు. దీంతో వాళ్ల పెదనాన్న ఆ ఇంటిని వదిలి పెళ్లిపోనంతకాలం మీకు పెళ్లిళ్లు కావని చెబుతాడు. దీంతో కేశవ్‌ వాళ్ల పెదనాన్న చొక్కా పట్టుకుని కొట్టడానికి రెడీ అవుతాడు. అక్కడ ఉన్నవారందరూ  వీరిద్దరినీ విడదీసి కేశవ్‌ను ఇంటికి పంపిస్తారు. కోపంతో ఊగిపోతూ కేశవ్ ఇంటికి వస్తాడు. అప్పుడు అక్కడ మాధవ్‌కు  మేకప్‌ వేస్తూ అన్నదమ్ములు ఉంటారు. ఎందుకు అంత కోపంగా ఉన్నావని వాళ్లు కేశవ్‌ను అడుగుతారు. అతను కోపంలో ఈ ఇంటికి ఏ ఆడదిరాదని అనడంతో  చక్రి కోపంతో కేశవ్ చెంప పగులగొడతాడు. అన్న పెళ్లిచూపులకు వెళ్తుంటే పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్ అని కోప్పడతాడు. బయట అందరూ ఇలాగే  వాగుతున్నారని అంటే....ఎందుకు నోరుమూసుకుని  వచ్చావని చక్రి నిలదీస్తాడు. టీ కొట్టు దగ్గర జరిగిన సంగతి...నాన్న ఏం మాట్లాడకుండా,ఏం పట్టనట్లుఉన్న సంగతి కూడా చెబుతాడు. దీంతో చక్రి, కేశవ్‌ ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటారు.

                       అటు మహి తన ప్రాజెక్ట్ ఓకే చేయించుకునేందుకు  ఓ కంపెనీకి వెళ్లి ప్రజెంటేషన్‌ ఇస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ కావడం వల్ల ప్రభుత్వంతో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయని...మేం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత నిన్ను సంప్రదిస్తామని చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్లు ఈ అమ్మాయికి బొత్తిగా లోకజ్ఞానం లేనట్లు ఉందని అనుకుంటారు. బయటకు వచ్చిన మహి ఎంతో సంతోషంగా ఉంటుంది. కిరణ్‌ రాగానే...నా ప్రాజెక్ట్‌ మీ డైరెక్టర్లకు ఎంతో నచ్చిందని చెబుతుంది. నిన్ను కూడా ఈప్రాజెక్ట్‌లోకి తీసుకుంటానని అంటుంది.  మహి అమాయకత్వం చూసి కిరణ్‌కూడా జాలిపడతాడు.

                             మహివాళ్ల నాన్న సంస్థ నుంచి షేర్లు వెనక్కి తీసుకుంటున్నట్లు  చలపతి లెటర్‌ పంపడంతో..ఎందుకు ఇలా చేస్తున్నావని మహి తండ్రి చలపతిని నిలదీస్తాడు.ఇప్పుడు చేపట్టబోయే ప్రాజెక్ట్‌లో బాగా లాభాలు వస్తాయని చెబుతాడు. జీవితంలో ఎలాంటి ఆశలు లేవని...అందుకే షేర్లు వెనక్కి తీసుకుంటున్నాని  చలపతి వైరాగ్యంతో చెబుతాడు. నాకు,నా భార్యకు ఇప్పుడు ఉన్న ఆస్తి సరిపోతుందంటాడు. నీ కూతురు కల్యాణి సంగతి ఏంటని అడిగితే...తన ఇష్టం తనదంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెబుతాడు. ఎవడో నచ్చాడని అతనితో వెళ్లిపోయిందని చెబుతాడు. ఒక్కగానొక్క ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచితే ఇలా చేసిందని బాధపడతాడు. దీంతో మహి గురించి వాళ్ల నాన్న భయపడతాడు. నీకు ఒక ఆడపిల్ల ఉంది...చాలా జాగ్రత్తపడమని చలపతి సలహా ఇస్తాడు. మా మహాలక్ష్మీ అలా కాదని...నన్ను అడగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెబుతాడు. మేం కూడా అలాగే అనుకున్నామని...తాను వెళ్లిపోయే వరకు మాకు ఏం తెలియకుండా దాచిందని చలపతి హెచ్చరిస్తాడు. వాళ్లు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని సలహా ఇస్తాడు.చలపతి ఆలోచనలతో ఇంటికి బయలుదేరిన మహితండ్రికి...ఓ దృశ్యం కంటపడుతుంది. ఆమె కిరణ్‌తో మాట్లాడుతుండటాన్ని ఆయన చూస్తాడు. ఆ తర్వాత కిరణ్‌...మహిని బైక్‌పై ఎక్కించుకుని బస్టాండ్ వద్ద డ్రాప్‌ చేయడానికి వెళ్లడాన్ని చూడటంతో ఈ రోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Embed widget