అన్వేషించండి

Podharillu Serial Today December11th: మహా పెళ్లి చూపులు ఎలా జరిగాయి..? మాధవ్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన గాయత్రికి ఎదురైన అనుభవం ఏంటి..?

Podharillu Serial Today Episode December11th: తండ్రి మాట విని మహా పెళ్లిచూపులకు ఒప్పుకుంటుంది. అటు మాధవ్‌ పెళ్లిచూపులకు వెళ్తున్నాడని తెలిసి మరదలు గాయత్రి వచ్చి గొడవపెట్టుకుంటుంది.

Podharillu Serial Today Episode: మహా తీసుకొచ్చిన గోల్డ్‌మెడల్స్‌ చూసి ప్రతాప్‌ ఆమెను అభినందిస్తాడు. నువ్వు చాలా గ్రేట్‌ తల్లి నీ గొప్పతనం తక్కువ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నీలాగే మీ నాన్న గ్రేట్ అనిపించుకోవాలంటే...నీ పెళ్లి చాలా గ్రాండ్‌గా చేయాలి కదా అంటాడు. నీ కమ్యూనిటీ కోసం నా ఆశలు వదులుకోవాలా అని మహా అంటుంది. ఇంతలో  వదిన తరఫు తల్లిదండ్రులు నీ పెళ్లి అయిన తర్వాత కూడా నువ్వు జాబ్‌ చేయవచ్చు కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తారు.  పెళ్లికి ముందు నువ్వు జాబ్‌కు  వెళ్లి అక్కడ ఎవరినైనా ప్రేమించి ఇంటికి తీసుకొస్తే....మీ నాన్న తలెత్తుకుని తిరగగలడా అని అంటారు. ఇవి జస్ట్ పెళ్లి చూపులే కదా నువ్వు వాళ్లకు నచ్చాలి, వాళ్లు నీకు నచ్చాలి కదా వాళ్లు ఇంటికి పిలిచి ఇప్పుడు కాదంటే కుదరదమ్మా అంటూ బుజ్జగిస్తాడు. నువ్వు రెడీ అయి వచ్చి వాళ్ల ముందు కూర్చోమని చెప్పి ప్రతాప్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

                 చిన్నప్పటి నుంచి మాధవ్‌ను ఇష్టపడుతున్న గాయత్రి...ఇప్పటికీ  అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. బావతో పెళ్లి జరగాలంటూ  దేవుడి గుడిలో మొక్కుకుంటుంది.  ఇంతలో వాళ్ల ప్రెండ్‌ వచ్చి మీ మాధవ్‌ బావకు పెళ్లిచూపులని చెబుతుంది. తొందరగా వెళ్లి ఆపకపోతే  మీ బావ పెళ్లి చూపులకు వెళ్లిపోతాడని చెబుతుంది. దీంతో ముడుపు మర్చిపోయామని...ఇంటికి వెళ్లి తీసుకొస్తానని చెప్పి గుడిలో నుంచి వెళ్లిపోతుంది. నేరుగా మాధవ్‌ వద్దకు వెళ్లి నిలదీస్తుంది. నేను ఉండగా...నువ్వు ఇంకో అమ్మాయిని చూడటానికి ఎలా వెళ్తావని అడుగుతుంది. నీకు అన్నీ తెలుసని...మీ అమ్మ ఒప్పుకుంటే నేను బయట సంబంధాలు ఎందుకు చూసుకుంటానని అంటాడు. నువ్వు మాఇంటికి వచ్చావని తెలిస్తేనే మీ అమ్మ ఒప్పుకోదు...అలాంటింది కోడలిగా ఎలా పంపిస్తుందని అనుకుంటున్నావ్ అంటాడు. మరికొద్దిరోజులు ఆగొచ్చు కదా అని గాయత్రి అడగ్గా...ఇప్పటికే  చాలా లేట్‌ అయ్యిందని చిన్నా అంటాడు. ఇంతలో నారాయణ,చక్రి అక్కడికి వచ్చి మీ అమ్మను ఎదిరించి రా మీ పెళ్లి మేం చేస్తాం అంటారు. నా బతుకు ఇంతే అంటూ గాయాత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
   

                             పెళ్లిచూపులకు మహాను రెడీ చేయడానికి వదిన హారిక రాగా...ఆమెతో వాదిస్తుండగా తల్లి లలిత అక్కడికి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదా అని అంటుంది. పెళ్లి కొడుక్కి రెడ్‌ కలర్‌ అంటే అస్సలు నచ్చదంటా కాబట్టి ఆ శారీ కట్టుకోవద్దని చెప్పి తొందరగా  రెడీ అవ్వమని వెళ్లిపోతుంది. ఇంతలో పెళ్లిచూపులకు పెళ్లివారు వస్తారు.తల్లి లలిత పైకి వెళ్తుంది. అక్కడమహా నగలు వద్దని మారం చేస్తుంది. నీకు ఎలా అనిపిస్తే అలా  రెడీ అవ్వు అంటూ తొందరపెట్టి కిందకు తీసుకొస్తుంది. పెళ్లికొడుకు,పెళ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకోవడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Sri Ram Venkat: నటుడి నుంచి ప్రొడ్యూసర్ వరకు.. 'జయం' శ్రీరామ్ వెంకట్ రియల్ లైఫ్ విషయాలు
నటుడి నుంచి ప్రొడ్యూసర్ వరకు.. 'జయం' శ్రీరామ్ వెంకట్ రియల్ లైఫ్ విషయాలు
Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget