అన్వేషించండి

Podharillu Serial Today April 1st: పొదరిల్లు సీరియల్: పెద్ది, గాయత్రి పెళ్లికోసం మహాలక్ష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చక్రితోపాటు మిగిలిన అన్నదమ్ములకు ఏం చెప్పింది..?

Podharillu Serial Today Episode April 1st: పెద్ది, గాయత్రి పెళ్లికోసం మహాలక్ష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చక్రితోపాటు మిగిలిన అన్నదమ్ములకు ఏం చెప్పింది..?

Podharillu Serial Today Episode: నారాయణకు గాయం పూర్తిగా మానిపోయే వరకు క్రమం తప్పకుండా ప్రతి 6గంటలకు ఓసారి మందులు వేయమని డాక్టర్‌ చెప్పడంతో...మహాలక్ష్మీ అలారం పెట్టుకుని మరీ అర్థరాత్రి మందులు వేయడానికి నిద్రలేస్తుంది. ఆమె అలారం సౌండ్ విని ఇంట్లో అందరూ నిద్రలేస్తారు. మహాలక్ష్మీ బయటకు వెళ్తుంటే...పెద్ది లేచి ఎక్కడకమ్మా అని అడుగుతాడు. మీ నాన్నగారికి  టాబ్లెట్‌లు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అందరూ లేచి ఆమె ఏం చేస్తుందా అని చూస్తుంటారు. వెళ్లి నారాయణను నిద్రలేపి టాబ్లెట్‌ వేసుకోవాలని చెప్పగా.... అతను నాకు ఈ మందులు పనిచేయవని అంటాడు. దీంతో నారాయణను బెదిరించి మరీ మహాలక్ష్మీ టాబ్లెట్లు వేస్తుంది. అది చూసిన ఇంట్లో అందరూ నవ్వుకుంటారు.మళ్లీ తమకు ఏం తెలియనట్లు వెళ్లి పడుకుంటారు.
 
ఇంత మంచి అమ్మాయి మన ఇంటికి రావడం ఎంతో అదృష్టమని చక్రి అంటాడు. అటు గాయత్రి మాత్రం మాధవ్‌ను తలచుకునే చాలా బాధపడుతుంటుంది. ఇంతలో వాళ్ల నాన్న వియ్యాలవారి ఇంటికి వెళ్లి వచ్చి వచ్చే ముహూర్తానికే పెళ్లి చేద్దామని వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని చెబుతాడు. అయితే ఖచ్చితంగా అదే ముహూర్తానికి పెళ్లి చేద్దామని తాయరు కూడా అంటుంది.
 
మళ్లీ తెల్లవారుజామున మహాలక్ష్మీ నిద్రలేచి నారాయణకు ట్యాబ్లెట్లు ఇచ్చి వెనక్కి వచ్చేప్పుడు చూస్తే....మాధవ్‌ అక్కడ కనిపించడు. పెద్ది ఏమయ్యాడని వెతుకుతుండగా...పెరటిలో గాయత్రితో తెల్లవారుజామున మాట్లాడుతూ కనిపిస్తాడు. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ గాయత్రి ఏడుస్తూ తన బావకు చెబుతుంది. నాకు ఏమాత్రం ఆ పెళ్లి ఇష్టంలేదని చెబుతుంది. ఇది మనం ఊహించిన విషయమే కదా అని మాధవ్‌ ఆమెకు సర్దిచెబుతాడు. చిన్నప్పటి నుంచి నాకు కూడా నువ్వంటే ఇష్టమేనని అయినా  నా తమ్ముళ్ల కోసం నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని చెబుతాడు. ఒకవేళ ఈ ఆస్తిలో మీకు వాటా రాసిచ్చినా...మీ అమ్మ నాకు ఇచ్చి నిన్ను పెళ్లి చేయదని అంటాడు. కాబట్టి మనం కలిసి ఉండటం అనేది ఈ జన్మలో జరిగేది కాదని అంటాడు.
 
మనం లేచిపోయి పెళ్లిచేసుకుందామని గాయత్రి కోరగా...అలా  అమ్మాయిని తీసుకొచ్చినందుకే మానాన్న కత్తిపోట్ల వరకు వెళ్లాల్సి వచ్చిందని మాధవ్‌ అంటాడు. నిన్ను తీసుకుని వెళ్తే మీవాళ్లు ఖచ్చితంగా వెతికిమరీ నిన్ను చంపేస్తారని చెబుతాడు.మా తమ్ముళ్లను జైలుకు పంపిస్తారని...ఏ పాపం తెలియని మహాలక్ష్మీ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని నచ్చజెబుతాడు. ఇక  ఈ జన్మకు ఇంతేనని అంటాడు.ఇకపై కూడా నువ్వు నన్ను కలుసుకోవడానికి రావొద్దని ఇదే మనం కలిసే ఆఖరి కలయిక అని చెబుతాడు. ఆ మాటాలన్నీ విన్న మహాలక్ష్మీ చాలా బాధపడుతుంది. ఈ ఇంటికోసం ఇంత చేసిన పెద్దికి తాను ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదనుకుంటుంది.
 
తెల్లారిన తర్వాత మంచంపై నారాయణ లేకపోవడంతో మహా కంగారుపడగా...అప్పుడే బయట నుంచి సైకిల్‌పై వస్తున్న నారాయణను చూసి కోపంతో తిడుతుంది. గాయం పూర్తిగా మానకముందే సైకిల్‌ వేసుకుని ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుంది. నా అవసరాలు నాకు ఉంటాయని అంటాడు. గాయం మానేవరకు అలాంటివి మానేయమని చెప్పి సైకిల్‌కు తాళం వేసి తాళం చెవి తీసుకుంటుంది. ఇంట్లో అందరూ టిఫిన్‌ చేస్తుండగా....మాదవ్‌ పనికి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. అతను వెళ్లిపోయిన తర్వాత మహా అందరినీ తీసుకుని పెరటిలోకి వెళ్లి మాట్లాడుతుంది. తెల్లవారుజామున గాయత్రి వచ్చిందని...వాళ్లిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారని అంటుంది. ఆ విషయం మాకు చిన్నప్పటి నుంచి తెలుసని అంటారు. అయితే ఈ ఇంటి కోసం ఇంత చేసిన మీ అన్నయ్య కోసం మీరు ఏం చేయరా అని మహా నిలదీస్తుంది. వాళ్లిద్దరూకు పెళ్లి చేయడానికి మనం ఏదైనా చేయాలని అనగా....ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పమని చక్రితోపాటు మిగిలినవాళ్లంతా అంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Godavari Serial Today July 8th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
Nindu Manasulu Serial Today July 8th: నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget