అన్వేషించండి

chinni serial today April 1st: చిన్ని సీరియల్: మ్యాడీ, చిన్నిల చేతుల మీదగా కల్యాణం.. లోహిత తిక్క కుదిరిందా!

chinni serial today episode April 1st మ్యాడీ, చిన్నిలు కలిసి కల్యాణం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వరుణ్‌తో మ్యాడీ చిన్నిని నేను ఇంకా ప్రేమిస్తున్నా అని నీకు ఎవరు  చెప్పారు అని అడుగుతాడు. నువ్వే చెప్తున్నావ్.. చిన్ని గురించి ఎవరైనా మాట్లాడితే కోప్పడే వాడివి.. చిన్నిని కోపంగా చూడటం మానేశావ్.. ప్రేమగా చూస్తున్నావ్.. బావ ఓ ఫ్రెండ్‌లా నాదో సలహా.. గతం గురించి ఆలోచించి చిన్నిని దూరం చేసుకోవడం కంటే.. చిన్నికి దగ్గరగా ఉంటూ గతం గురించి తను ఏం చెప్తుందో తెలుసుకుంటే బెటర్.. చిన్ని ప్రేమ తప్ప నిన్ను ఏదో సంతోషంగా ఉంచదు అని నా నమ్మకం అని అంటాడు. 

మ్యాడీ ఆలోచనలో పడతాడు. మ్యాడీ చిన్నిని తలచుకొని నువ్వు ఇంత సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను అని అనుకుంటాడు. ఇక దేవా దగ్గరకు తన మనిషి వచ్చి చిన్ని ఫోన్ ట్రాప్ చేసి ఎస్‌పీ లొకేషన్ చెప్పారు.. బాలరాజు దొరికిపోతాడని అంటాడు. ఈరోజే మీ నాన్న చనిపోయాడు అన్న వార్త నువ్వు వింటావే.. సంతోషంగా ఉన్న నిన్ను సగం చంపేస్తా.. తర్వాత నీ అంతు చూస్తా.. అప్పుడే నేను నా భార్యని చంపాను అన్న నిజం భూస్థాపితం అవ్వదు అని అనుకుంటాడు. లోహిత చిన్ని కల్యాణం చేయకుండా ఆపడానికి లోహిత దురద గుంట ఆకు రెడీ చేస్తుంది. శ్రేయ ఏం చేస్తున్నావ్ అంటే ఈ దురద గుంట ఆకు చిన్ని చీరకి రాసేస్తా అప్పుడు పూజలో గోక్కుంటూ తెగ ఇబ్బంది పడి పూజకు రాలేదు అని అంటుంది. ఐడియా సూపర్ అని శ్రేయ అంటుంది. 

చిన్ని స్నానానికి వెళ్లి చీర బెడ్ మీద పెడితే లోహిత ఆ చీరకు దురద గుంట ఆకు రాసేస్తుంది. కల్యాణం మొదలవుతుంది. చిన్ని తల్లిదండ్రులు వస్తారు. టైంకి వచ్చేశారన్నమాట అని దేవా అంటాడు. చిన్నిని తీసుకొస్తా అని స్వరూప అంటే అక్కర్లేదు అని లోహిత అంటుంది. సుబ్బు, స్వరూప షాక్ అయితే వాళ్లే వచ్చేస్తున్నారు కదా అని అంటుంది. చిన్ని, మ్యాడీ ఇద్దరూ సీతారాముల వారి విగ్రహాలు తీసుకొని వస్తారు. అందరూ చూస్తారు.. ప్రమీల చూసి చిన్నప్పుడు ఇద్దరూ బొమ్మల పెళ్లి చేయడం గుర్తు చేసుకుంటుంది. ఇద్దరూ సీతారాముల విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు. తర్వాత చిన్ని తల్లిదండ్రులను పలకరించి ఇదంతా సీతారాముల లాంటి తన అత్తయ్యామామయ్య దయ అని చెప్తుంది. దేవా, నాగవల్లి, చిన్ని, మ్యాడీ పీటల మీద కూర్చొంటారు..

లోహిత గోక్కుంటూ ఏంటి చిన్ని ఇంకా గోక్కోవడం మొదలు పెట్టడం లేదు అని అంటే దానికి శ్రేయ అది మొదలు పెట్టలేదు కానీ నువ్వు పెట్టావ్ అంటుంది. వరుణ్, లోహిత కూడా పీటల మీద కూర్చొంటారు.. కానీ లోహిత దురద అని గోక్కుంటుంది. తెలీకుండా ఏదో అపచారం చేసిందని చిన్ని సెటైర్లు వేస్తుంది. లోహిత తన వల్ల కాదు అనడంతో మీ రెండు జంటలు పూజ చేయండి అని ప్రమీల అంటుంది. లోహిత లోపలికి పరుగులు పెడుతుంది. పంతులు సీతారాముల కల్యాణం గొప్పతనం చెప్పి భార్య తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి.. అర్థం చేసుకోవాలి అంతే కానీ దూరం చేసుకోకూడదు అని చెప్తాడు. ఇక చిన్ని, మ్యాడీల చేత విగ్రహాలకు కల్యాణం జరిపిస్తారు. మ్యాడీ చిన్ని ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటారు. సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. ఇక లోహిత అయితే గోక్కుంటూ గదిలో గోల గోల చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 5th:మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
Karthika Deepam 2 Serial Today August 5th: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!
Rashmi Gautam: చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
Gundeninda Gudigantalu August 5th: బాలు, మీనాకు దొరికిపోయిన మేక మాణిక్యం...రోహిణి చెంప పగులగొట్టి ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: బాలు, మీనాకు దొరికిపోయిన మేక మాణిక్యం...రోహిణి చెంప పగులగొట్టి ప్రభావతి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Embed widget