అన్వేషించండి

Meghasandesam Serial Today April 1st: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి ఆస్థి మొత్తం రాసిచ్చిన శరత్‌ - అయోమయంలో నక్షత్ర, అపూర్వ  

Meghasandesam serial today episode April 1st: భూమికి ఆస్థి మొత్తం రాసివ్వడంతో అపూర్వ, నక్షత్రకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: అపూర్వ మీద నక్షత్ర కోపంగా ఉంటుంది. ఏదో ఒకటి చేసి తనను ఆస్థికి వారసురాలిని చేయమని అడుగుతుంది. అపూర్వ మాత్రం మౌనంగా ఉంటుంది. ఇంతలో శరత్‌ చంద్ర, భూమిని తీసుకుని ఇంటికి వస్తాడు. వాళ్లను చూసిన నక్షత్ర షాక్‌ అవుతుంది.

నక్షత్ర: మమ్మీ డాడీ వచ్చారు.. మమ్మీ ఆ భూమి కూడా వచ్చింది.

శరత్‌చంద్ర, భూమి ఇంట్లోకి వస్తారు.

అపూర్వ: బావ..

శరత్‌: ఇవిగో డాక్యుమెంట్స్‌.

భూమి: మనఃస్పూర్తిగా చెప్తున్నాను నాన్న నాకు ఇవేవీ వద్దు..

శరత్: ఇక చాలు ఆపేయ్‌.. మొత్తం నీకు రాసి ఇచ్చేస్తున్నాను ఇక నుంచి ఈ ఆస్థిలో మొత్తం నీకే..రా ఏంటలా చూస్తున్నావు.. వచ్చి సంతకాలు పెట్టు..

భూమి: ఫ్లీజ్‌ నాన్న నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఈ ఆస్తుపాస్తులేమీ వద్దు నాన్న.. మీ కూతురుని అనే గుర్తింపే నాకు అన్నింటికంటే విలువైనది. మీ ప్రేమ అభిమానం నాకు ఉంటే చాలు నాన్న.

నక్షత్ర: తొక్కలో ప్రేమాభిమానాలు దానికి ఇచ్చేసి.. ఆస్థి మనకు ఇవ్వొచ్చు కదా మమ్మీ.

శరత్‌: చూడు గగన్‌ నిన్ను ఇంట్లోంచి గెంటేశాక నువ్వు ఒంటరి దానివి అయిపోయావు. నువ్వు రోడ్డు మీద దిక్కులేని దానిలా తిరుగుతుంటే మీ అమ్మ అది చూసి తట్టుకోలేదు. అందుకే తన ఆత్మ శాంతించాలని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక తండ్రిగా మాత్రం కాదు.. శోభా భర్తగా మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను నేను నా కూతురిగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఈ సొసైటీ దృష్టిలో నువ్వు నా కూతురివే.. కాబట్టి ఈ ఆస్తి నీకే దక్కాలి. తీసుకో దీన్ని తగులబెట్టుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం..

భూమి: నాన్న ఫ్లీజ్‌ నాన్న ఈ భారాన్ని నేను మోయలేను నాన్న.

శరత్‌: ఇక నుంచి ఈ ఆస్థి అంతా నీదే కాబట్టి ఈ ఇంట్లో  ప్రతి ఒక్కరు నువ్వు గీసిన గీత దాటరు. నువ్వు చెప్పిన మాటే వింటారు. నువ్వు ఉండమంటే ఉంటారు. లేదంటే వెళ్లిపోతారు. అది నువ్వు హోదా అనుకుంటావో… బాధ్యత అనుకంటావో..? నీకిచ్చిన బాధ్యత అనుకుంటావో..? అదంతా నీ ఇష్టం.. నువ్వు ఈ ఇంటికి ఈ ఆస్థికి యజమాని అయినా శోభా కూతురివి.. కాబట్టి అదే స్థానంలో నిన్ను ఉంచుతున్నాను.

అంటూ చెప్పి వెళ్లిపోతాడు శరత్‌చంద్ర. భూమి మాత్రం పేపర్స్‌ చూస్తూ.. ఏడుస్తుంది.

నక్షత్ర: అయిపోయింది మమ్మీ అంతా అయిపోయింది. డాడీ ఆస్తి మొత్తం దాని చేతిలో పెట్టేశాడు. ఇక నుంచి ఇది భూమి సామ్రాజ్యం. మనం దాని బానిసలం. ఇక నుంచి అది చెప్పిన దానికి గొర్రెల్లా తలూపడం  తప్పా మనం ఇంకేం చేయలేము మమ్మీ.

అపూర్వ: నోర్మూయ్‌ ఏం మాట్లాడుతున్నావే.. అలాంటి పరిస్థితే వస్తే.. ఈ అపూర్వ చచ్చింది అన్నమాటే.

మీరా: భూమి ఏడవకు భూమి.. అన్నయ్య కోపం నీకు తెలిసిందే కదా..? అన్నయ్య కోపంతో చేసినా ఆలోచించే చేస్తారు. ఎప్పటికైనా ఈ ఆస్తి అంతా నీకు చెందాల్సిందే కదా..?

నక్షత్ర: ( మనసులో) అత్తయ్య ఒక తింగరిది ఆస్తి పేపర్లు దాని చేతిలోంచి లాగేసుకోకుండా మోటివేట్‌ చేస్తుంది.

మీరా: ఇక నుంచి ఈ ఇంట్లో నువ్వు ఏది చెబితే అదే జరుగుతుంది. మేము అందరం నీ ఆధ్వర్యంలోనే ఉంటాం.. నీ కనుసన్నల్లోనే నడుస్తాం.. సరేనా భూమి.. నువ్వు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను..

నక్షత్ర: మమ్మీ చూశావా..? అత్తయ్య కూడా పార్టీ మార్చేసింది.

మీరా: అయినా ఆ శోభాచంద్ర కూతురు అంటే ఎలా ఉండాలి. ఇన్నాళ్లు నువ్వు పడ్డ కష్టాలు కన్నీళ్లు అన్ని మర్చిపోయి ఆ స్థాయి.. ఆ హోదా.. ఆ దర్జా అన్ని నీలో కనిపించాలి. మీ అమ్మ నిన్ను ఎలా చూడాలనుకుందో నేను నిన్ను అలానే చూసుకుంటానమ్మా..?

అంటూ భూమిని తీసుకుని లోపలికి వెళ్తుంది మీరా..? అపూర్వ, నక్షత్ర కోపంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget