Podarillu Serial Today June 12th: మహాలక్ష్మీ ఆఫీసుకు వెళ్లి రచ్చరచ్చ చేసిన చక్రి...పరువు తీశావంటూ చక్రిపై మండిపడిన మహా
Podarillu Serial Today Episode June 12th: మహా ఆఫీసులో వేరొకరిని తిడుతుంటే మహాలక్షీని అనుకుని ఆఫీసుకు వచ్చి రచ్చ చేసిన చక్రి...సిగ్గుతో తలదించుకునేలా చేశావంటూ చీవాట్లు పెట్టిన మహాలక్ష్మీ

Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ ఆసక్తిగా సాగుతుంది. నాన్నకు సారీ చెప్పమన్న మహాలక్ష్మీపై కోప్పడిన కన్నా ఆ తర్వాత వచ్చి ఆమెను క్షమాపణలు అడుగుతాడు. అటు కేశవ్ కూడా శైలూకు సారీ చెప్పినా ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఇక ఈరోజు చక్రి చేసిన రచ్చ చూస్తే మాత్రం చూస్తున్న మనకే కోపం వచ్చినంత తప్పు చేస్తాడు. మహాలక్ష్మీ ఆఫీసుకు వెళ్లి నిజంగానే రౌడీలా ప్రవర్తించడంతో మహాకు కోపం వస్తుంది.
సారీ చెప్పిన కన్నా
టపాసులు పేలడంతో చేయి కాల్చుకున్న తండ్రికి క్షమాపణల చెప్పమని కన్నాకు మహాలక్ష్మీ చెబుతుంది. అలాంటి మనిషికి నేను సారీ చెప్పడమేంటని కన్నా అంటాడు. ఆయన ఎవరో అన్నట్లు కోపంగా మాట్లాడుతుంటాడు. అది విన్న మాధవ్ కూడా షాకు అవుతాడు. కన్నా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మాధవ్ వచ్చి వాడేంటి అంత సీరియస్‌గా మాట్లాడుతున్నాడని అంటాడు. కాసేపటి తర్వాత మాధవ్, మహాలక్ష్మీ వంట చేస్తుండగా అక్కడికి వచ్చిన కన్నా మహాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మహా వాడితో మాట్లాడకుండా తనపని తాను చేసుకుంటుంది. దీంతో ఆమె చుట్టూ తిరిగి తాను చేసింది తప్పేనంటూ సారీ చెబుతాడు.
శైలూను కలిసిన కేశవ్
శైలూపై చేయిచేసుకున్న దగ్గర నుంచీ కేశవ్ చాలా బాధపడుతుంటాడు. ఆమెను కలిసి క్షమాపణలు చెప్పాలని అనుకుంటాడు. కీర్తితో కలిసి బైక్ వస్తున్న శైలూ....కేశవ్‌పై చాలా కోపంగా ఉంటుంది.ఇక జీవితంలో ఆ ముంగిస ముఖంవాడిని చూసేది లేదని అంటుంది. వాడు నన్నే కొడతాడా అని కోపంగా మండిపడుతుంది. ఇంతలో కేశవ్ ఆమెను కలిసి మాట్లాడాలని దారికాస్తాడు. కేశవ్‌ను చూడగానే కీర్తి బండి ఆపుతుంది. కిందకు దిగి నడిచి వెళ్లిపోతున్న శైలూ చేయిపట్టుకుని కేశవ్ ఆపుతాడు. ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావని శైలూ కేశవ్‌కు గట్టి వార్నింగ్ ఇస్తుంది.మళ్లీ నన్ను కలవొద్దంటూ కోపంతో తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
చక్రి చేసిన రచ్చ
ఆఫీసుకు వెళ్లిన మహాకు లంచ్ టైంలో చక్రి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఆఫీసులో ప్రసాద్ ఆఫీసుబాయ్‌పై గట్టిగా అరుస్తుంటాడు. పనిచేయడం చేతకాదు కానీ ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటావని మండిపడతాడు. ఆ మాటలు మహానే అనుకుని చక్రి పొరపడతాడు. ఇంతలో అక్కడ ప్రసాద్ గట్టిగా అరుస్తున్నాడని మహా కూడా ఫోన్ కట్ చేస్తుంది. మహానే ప్రసాద్ తిట్టాడనుకుని కోపంతో చక్రి రగిలిపోతాడు.నేరుగా మహా పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్తాడు. ఇక్కడ ఎవడ్రా మహాలక్ష్మీని తిట్టిందంటూ గొడవ చేస్తాడు. చక్రి రాక చూసి మహా కంగారుపడుతుంది.
తనను ఎవరూ ఏం అనలేదని చెప్పినా వినిపించుకోకుండా చక్రి హంగామా చేస్తూనే ఉంటాడు. వీళ్లకు ఇంతలా ఎందుకు భయపడిపోతున్నారని మహాను అంటాడు. దయచేసి నా పరువు తీయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోండని చెబుతున్నా వినడు. ఇంతలో ప్రసాద్ వచ్చి ఎవడు వీడు రౌడీలా ప్రవర్తిస్తున్నాడని అంటాడు. ఆ తర్వాత లక్కీ కూడా వచ్చి ఏ జరిగిందని అడగ్గా...ఏం లేదంటూ మహా చక్రిని బయటకు లాక్కెళ్లి తిడుతుంది.అసలు మీకు బుద్ది ఉందా...ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని గట్టిగా క్లాస్ పీకుతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















