(Source: ECI/ABP News/ABP Majha)
Oorvasivo Rakshasivo Serial Today March 11th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: ముక్కలైన శుభలేఖను చూసి నిలదీసిన రక్షిత.. పవిత్ర జాడ తెలుసుకున్న విజయేంద్ర, షాక్‌లో దుర్గ!
Oorvasivo Rakshasivo Serial Today Episode దుర్గ ఇంటి దగ్గర శుభలేక చింపేయడం చూసిన రక్షిత దయాసాగర్, దుర్గలను ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Oorvasivo Rakshasivo Telugu Serial Today Episode: ధీరుకి పసుపు రాస్తారు. ఇక విజయేంద్ర దుర్గతో వీడియో కాల్ మాట్లాడుతూ.. త్వరలో మీరు మా ఇంటికి రాబోతున్నారు. మేం హ్యాపీ అని అంటాడు. ఇక దుర్గ విజయేంద్రని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన విజయేంద్ర ఏమైందని అడుగుతాడు. దాంతో దుర్గ ఆనంద బాష్పాలు అని కవర్ చేస్తుంది. ఇక ధీరుని రెడీ చేసిన తర్వాత అందరూ దుర్గ ఇంటికి బయల్దేరుతారు.
ధీరు: నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది దుర్గ. ఫైనల్లీ మన పెళ్లి అవుతుంది. ఈరోజు పసుపు కొట్టి నన్ను రెడీ చేశారు. ఆ తర్వాత పెళ్లి తర్వాత మన..
దుర్గ: చాలు ధీరు ఆపేయ్..
ధీరు: ఇప్పుడు నువ్వు నేను చెప్పకుండా ఆపొచ్చు కానీ పెళ్లి తర్వాత కార్యక్రమాన్ని నువ్వు ఆపలేవు కదా..
దుర్గ: ధీరు నేను మీ అమ్మానాన్నలు వచ్చేలోపు ఏర్పాట్లు చేసుకోవాలి ఉంటాను..
ధీరు: సరే.. నన్ను నీ వెనక పిచ్చొడిలా తిప్పుకున్నావు. నా బెట్ నేను గెలవబోతున్నాను.
దయాసాగర్: మన వైపు నుంచి ఎవరూ లేకపోతే రక్షితకు అనుమానం వస్తుందేమో దుర్గ.
దుర్గ: రానివ్వండి నాన్న వస్తే ఏం చేస్తుంది. తనలో తాను రగిలిపోతుంది కానీ ఏం చేయలేదు. అంతగా మనల్ని సమాధానం అడిగితే నేను చూసుకుంటా.
రక్షిత: అందరూ దుర్గ ఇంటికి వచ్చి.. దుర్గ, దయాసాగర్ మాత్రమే ఉండడంతో.. దయా గారు ఈ రోజు పసుపు దంచడం అని మీకు తెలుసు. పైగా ఇక్కడికి వస్తున్నాం అని దుర్గకు చెప్తున్నాం. అయినా మీ వైపు నుంచి ఎవరూ కనిపించడం లేదు.
దుర్గ: కావాలనే పిలవలేదు అండీ. మాకు రిలేటివ్స్ చాలా తక్కువ. ఉన్నవాళ్లు కూడా డబ్బుని చూసి ప్రేమగా మాట్టాడేవాళ్లే ఉన్నారు. మీ అందరిలా స్వచ్ఛమైన ప్రేమ పంచేవాళ్లు లేరు అందుకే ఈ కార్యక్రమం మీ అందరి చేతుల్లో జరగాలి అనుకున్నాను.
రక్షిత: మనసులో.. నీ మాటల్లో నిజం లేదు అనిపిస్తుంది దుర్గ.
జయ: పెళ్లికి ముందే మా అందరి ప్రేమకు ఆశీర్వాదానికి విలువిస్తున్నావ్ అంటే చాలా సంతోషంగా ఉంది..
ఇక దుర్గ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత రక్షితతో పాటు అందరూ దుర్గకు పసుపు రాస్తారు. ఇక విజయేంద్ర హారతి పళ్లెం తీసుకొని వస్తాడు. కాలు జారి పడిపోబోతే దుర్గ పట్టుకుంటుంది. ఆ సీన్ చూసి రక్షిత ఇబ్బందిగా ఫీలవుతుంది. విజయేంద్ర దుర్గకు సారీ చెప్తాడు. ఇక దుర్గ విజయేంద్రను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి దయాసాగర్ బాధపడతాడు.
రక్షిత: మనసులో.. దయాసాగర్ ఆనందంగా ఉన్నట్లు నటిస్తున్నాడు ఏంటి. ఒక్కగానొక్క కూతురు పసుపు దంచడానికి మంగళస్నానాలకు కనీసం ఐదుమంది ముత్తయిదువులను పిలవలేదు. ఇది ఆశ్చర్యంగాను ఆలోచించాల్సిన విషయంలా ఉంది.
మరోవైపు పవిత్ర దుర్గ ఫొటో చూస్తూ అక్క అంటూ దగ్గరకు వెళ్తుంది. అక్కడ దుర్గ తనకు ఇచ్చిన డైరీ తీసుకొని చదివి మొత్తం గుర్తు చేసుకుంటుంది. తన మీద జరిగిన అత్యాచారం, తన తల్లిదండ్రలు చనిపోవడం గుర్తొచ్చి డైరీ విసిరేస్తుంది. అప్పుడే అక్కడ పేపర్ కనిపిస్తుంది అందులో ధీరు, దుర్గల ఫొటో చూసి.. వీడికి ఏం కాకూడదు.. వీడు రాక్షసుడు అక్కకి ఏం కాకూడదు అని గట్టిగా అరుస్తుంది. అక్క కావాలి అని ఏడుస్తుంది. దీంతో కేర్ టేకర్ దుర్గకు ఫోన్ చేస్తుంది. దుర్గ ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు విజయేంద్రకు తన ఫ్రెండ్ శ్రవణ్ ఫోన్ చేస్తాడు.
శ్రవణ్: పవిత్రను తీసుకెళ్లిన అంబులెన్స్ అడ్రస్ దొరికిందిరా.. ఆ అడ్రస్ నీకు పంపిస్తా చూడు.
విజయేంద్ర: సరేరా పది నిమిషాల్లో నీ దగ్గరకు వస్తాను.
దుర్గ: తన చేయి పట్టుకొని రక్షిత చూడటంతో.. ఏంటి ఆంటీ నా అరచేయి పట్టుకొని అంత తీక్షణంగా చూస్తున్నారు. మీరు జాతకాలు కూడా చూస్తారా.
పురుషోత్తం: నీకేంటి అమ్మ అన్నీ ఉన్న అదృష్టవంతురాలివి నీకు జాతకాలతో పనేముంది.
రక్షిత: ఈ చేతిని నా కొడుకు త్వరలో పట్టుకొని ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ చేయి ఎంత అదృష్టం చేసుకుందా అని చూస్తున్నా..
దుర్గ: సేమ్ మీ లాగే మా నాన్న కూడా మీ లానే అంటుంటారు అంటీ. నీ చేయి పట్టుకోవాలి అంటే అతను ఎంతో అదృష్టవంతుడు అని.
రక్షిత: నాకు దుర్గ మాట్లలో రెండు అర్థాలు అనిపిస్తున్నాయి.
దయాసాగర్: నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని ఎవరి చేతుల్లో పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఫైనల్‌గా మీరందరూ దొరికారు.
ఇక వెళ్తూ వెళ్తూ శుభలేఖ చింపి పడేయడం రక్షిత చూస్తుంది. దుర్గ, దయాసాగర్ షాక్ అయిపోతారు. పెళ్లి కార్డును ఇలా చింపేశారు ఏంటని దుర్గ, దయాసాగర్‌లను రక్షిత ప్రశ్నిస్తుంది.
రక్షిత: నేను మీకు ఇది వరకే చెప్పాను నా కొడుకు విషయంలో నేను ప్రతీది పట్టించుకుంటాను అని మీరు అలాగే పట్టించుకోవాలి. కానీ మీరు చేసింది ఏంటి. ఇదేనా నా మాటకు ఉండే విలువ.. ఇదేనా పట్టించుకోవడం అంటే మాట్లాడరేంటి.
దయాసాగర్: రక్షిత గారు ఆ వెడ్డింగ్ కార్డులో మీ అబ్బాయి ఫొటోనే కాదు మా అమ్మాయి ఫొటో కూడా ఉంది. అయినా కావాలని ఎవరైనా ఎందుకు చేస్తారు. పక్కింటి పిల్లాడు ఇలా చేశాడు అంతే..
పురుషోత్తం: రక్షిత వదిలేయ్.. పద..
దుర్గ: చూశావా నాన్న రక్షితకు మన మీద రోజు రోజుకు అనుమానం పెరిగిపోతుంది.
దయాసాగర్: నిజమే అమ్మా మన గురించి తెలిసిపోకముందే మనం వాళ్ల అంతు చూడాలి.
దుర్గ: త్వరలోనే వీళ్లందరి కథ ముగిస్తాను.
ఇక దుర్గ తన ఫోన్ చూసుకుంటుంది. కేర్ టేకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి పవిత్రకు ఏమైందా అని కంగారుగా బయల్దేరుతుంది. మరోవైపు విజయేంద్ర, శ్రవణ్ కూడా ఆ అడ్రస్‌కు వెళ్తుంటారు. ఇక రక్షిత రౌడీకి ఫోన్ చేసి విజయేంద్రను ఫాలో అవుతున్నావా అని అడుగుతుంది. రౌడీ విజయేంద్ర మిస్ అయ్యాడు అని చెప్పడంతో అతన్ని తిడుతుంది. విజయేంద్ర శ్రవణ్ చెప్పిన అడ్రస్‌కు వెళ్లి అక్కడ పవిత్రను చూసి షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.