Oorvasivo Rakshasivo Serial Today February 9th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: పవిత్రను ఆశ్రమానికి తీసుకొచ్చిన దుర్గ.. రక్షిత, ధీరులు చూసేస్తారా!
Oorvasivo Rakshasivo Serial Today Episode ఆశ్రమంలో రక్షిత ధీరు, దుర్గలను చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Oorvasivo Rakshasivo Today Episode ఎక్కడ చూసిన ఎందుకు తనకు దుర్గే కనిపిస్తుంది అని రక్షిత అనుకుంటుంది. ఇప్పటి వరకు తన శత్రువులు ఎవరూ కలలో కూడా కనిపించేవారు కాదని కానీ ఇప్పుడు ఇలా నీడను చూసినా దుర్గలా కనిపిస్తోంది అని దుర్గ గురించి ఓవర్‌గా థింక్ చేస్తున్నానా అని అనుకుంటుంది. దుర్గని అంత తేలికగా తీసుకోకూడదు అని మధుసూదన్‌కి అసలు కళ్లు ఎందుకు తెప్పించిందని అది కూడా తన కొడుకు ధీరు చేత ఎందుకు చేయించిందని రక్షిత ఆలోచిస్తుంది. అది యాక్సిడెంటల్‌గా జరిగిందా లేక దుర్గ కావాలనే చేసిందా అని ఆలోచిస్తుంది. ఇంతలో రక్షిత కాలు బెనుకుతుంది. నమూద్రీ ఆశ్రమానికి బయల్దేరుతుంది రక్షిత. మరోవైపు దుర్గ కూడా అదే ఆశ్రమానికి తన చెల్లిని తీసుకొని వెళ్తుంది. మరోవైపు ధీరు దుర్గ కార్‌ని ఫాలో చేసి ఆశ్రమానికి వెళ్తాడు.
రక్షిత: నమస్కారం నమూద్రీ గారు మెట్లు దిగుతుంటే కాలు బెనికింది.
నమూద్రీ: మరేం పర్లేదు అమ్మ తైలంతో మర్దనా చేస్తే నొప్పి తగ్గిపోతుంది.
పవిత్ర: అక్క మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం.
దుర్గ: నమూద్రీ ఆశ్రమానికి నీకు ఆరోగ్యం బాగోలేదు కదా అప్పుడప్పుడు ఊరికే భయపడుతున్నావ్ కదా అందుకే డాక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం. ఇద్దరూ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ దుర్గ పవిత్ర గురించి చెప్తుంది. ఆయన అందుకు తగ్గ జాగ్రత్తలు చెప్పి వైద్యం ప్రారంభిస్తారు. మరోవైపు రక్షితకు మర్దనా జరుగుతుంటుంది. ఇక ధీరు అక్కడికే వస్తాడు.
రక్షిత: వాసు ధీరు ఎక్కడున్నాడు. ఉదయం నుంచి ఫోన్ కలవడం లేదు.
వాసు: నాకు తెలీదు మేడం.
దుర్గ: ధీరు ఇక్కడికి వచ్చాడు ఏంటి. పవిత్రను నేను ఇక్కడికి తీసుకురావడం చూశాడా.. ధీరుని ఇక్కడికి రాకుండా ఆపాలి.
ధీరు: దుర్గ..
దుర్గ: నవ్వేంటి ఇక్కడికి వచ్చావ్. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు.
ధీరు: నువ్వు కలుద్దాం అంటే రోడ్డుమీద ఉన్నాను. కానీ నువ్వేమో చెప్పాపెట్టకుండా ఇక్కడికి వచ్చావు.
దుర్గ: సారీ ధీరు నాదే తప్పు. అనుకోకుండా డాక్టర్ గారిని కలవాల్సి వచ్చింది అందుకే నీకు చెప్పలేకపోయా..
ధీరు: ఎవరికి బాలేదు.. ఎవర్ని తీసుకొని వచ్చావ్.. నిన్నే..
దుర్గ: వేరే ఒక అమ్మాయి నీకు తెలీదు.
ధీరు: నా కంటే నీకు తనే ఇంపార్టెంటా. అంత ఇంపార్టెంట్ మనిషి ఎవరు నేను చూడాలి. నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా..
దుర్గ: నేను నిన్ను ఎందుకు అవాడ్ చేస్తాను నువ్వు నా ఫ్రెండ్.
ధీరు: దుర్గ వెళ్లిన తర్వాత.. దుర్గ నిన్ను చూసిన ప్రతీసారి నా దగ్గర ఏదో దాస్తున్నావ్ అని అనిపిస్తుంది.
రక్షిత: ధీరు.. ఇక్కడేం చేస్తున్నావ్.. ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. ఇక్కడ నీకు ఏం పని.. నిజం చెప్పు ధీరు ఎందుకు ఫోన్ లిప్ట్ చేయడం లేదు.
ధీరు: ఫ్రెండ్‌తో వచ్చాను అమ్మ.
రక్షిత: ఎవరు ఆ ఫ్రెండ్.. నాకు తెలుసు నవ్వు అబద్ధం చెప్తున్నావ్. నా అనుమానం నిజం అయితే నువ్వు ఆ దుర్గతో వచ్చి ఉంటావ్. అసలు నీకు ఆ దుర్గతో ఫ్రెండ్‌షిప్ చేయొద్దు అన్నాను. ప్రాబ్లమ్స్ అన్నీ తన వల్లే అని నా అనుమానం. ఈవిషయం నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా నీకు నా కంటే తనే ఎక్కువ కదా.
ధీరు: అమ్మా నువ్వు దుర్గను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్. తను నలుగురికి సాయం చేస్తుంది. ఒకరికి అన్యాయం చేయదు. తన గురించి నీకు చెప్పినా అర్థం కాదు.
రక్షిత: నువ్వు దానికి దూరంగా ఉండు. నీ ఫ్రెండ్ ఎక్కడ ఉందో నేను ఇప్పుడే చూసి వస్తా.. అని లోపలికి వెళ్తుంది. దుర్గా..
ధీరు: మామ్..
రక్షిత: ఏమన్నావు ధీరు దుర్గతో రాలేదు అన్నావ్ మరి దుర్గ ఇక్కడే ఉంది ఏంటి. ఏం జరుగుతుంది ధీరు. నాకు ఎందుకు అబద్ధం చెప్తున్నావ్. నువ్వు తప్పు చేస్తున్నావ్ ధీరు.
ధీరు: మామ్ తనకు హెల్త్ బాలేదు అంటే ఇక్కడికి వచ్చాం. ప్రామిస్‌గా మేం ఇద్దరం కలిసి రాలేదు.
దుర్గ: మనసులో.. ధీరు, రక్షిత ఇద్దరిలో ఏ ఒక్కరు పవిత్రని చూసినా తనకు ప్రమాదం. పవిత్ర వాళ్లని చూస్తే మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతుంది. ఈ గండం నుంచి ఎలా అయినా బయట పడేలా చూడు స్వామి. నాకు వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటుంది. కానీ నేను ఇప్పుడు బయపడే స్థితిలో లేను. భయపెట్టే స్థితిలో ఉన్నాను. త్వరలో నీకు భయం అంటే ఏంటో చూపిస్తా.
ధీరుకి బుద్ధి చెప్పమని రక్షిత దుర్గకు అంటుంది. దీంతో దుర్గ చెప్పాను బాగా చెప్తాను. ధీరుని పూర్తిగా మార్చేస్తా ఎంతలా అంటే మీరే షాక్ అవుతారు అంతలా అని అంటుంది.ఇక దుర్గ జాగ్రత్తలు చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.