అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today October 4th: నువ్వుంటే నా జతగా: బ్రహ్మముడి కావ్య వచ్చింద్రోయ్.. దేవాపై పురుషోత్తం కుట్ర! కాంతం, త్రిపురల కొత్త ప్లాన్..!

Nuvvunte Naa Jathaga Serial Today Episode October 4th మిథున కోసం మిథున ఫ్రెండ్స్ రావడం త్రిపుర మిథునని అవమానించాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode శారద వాళ్లు బతుకమ్మ పెట్టి దండం పెట్టుకుంటారు. మిథున, దేవా కలిసిపోవాలని శారద మొక్కుకుంటుంది. ఇక భాను అయితే మిథున కోరిక నెరవేరకూడదు అని దేవా మీద తాను రుమాలు విసిరాను దేవా నాకే దక్కాలి.. మా అత్త కోరిక నెరవేరకూడదు అని అంటుంది. కాంతం భానుతో మనసులో మాటలు మైక్‌లో చెప్తున్నావ్ వద్దు అని అంటుంది. శారద నవ్వుకుంటుంది. 

శారద దేవాని కూడా కోరుకోమని చెప్తుంది. నువ్వు అమ్మ కదా నీ కోరిక నెరవేరితే చాలు అని అంటాడు. ఇక దేవా కోసం పురుషోత్తం గుడికి వస్తాడు. దేవా వెళ్తుంటే మిథున దేవా వెనకాలే వెళ్తూ కుంకుమ పెడతానని దేవాతో చెప్తుంది. దేవా వద్దు అంటే మిథున పెడుతుంది. ఆ టైంలో మిథున పడిపోతుంటే దేవా పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. కుంకుమ బొట్టుతో ఎంత బాగున్నావో తెలుసా అని మిథున దేవాని అంటుంది. నాకు చాలా పనులు ఉన్నాయ్ నన్ను వదిలేయ్ అని దేవా వెళ్లిపోతాడు. 

దేవా పురుషోత్తం కాలు మొక్కితే నువ్వు ఉండాల్సింది నా గుండెల్లో అని దేవాని హగ్ చేసుకుంటాడు. వదినను తీసుకొచ్చుంటే బాగున్ను అన్న అని దేవా అంటే నేను తీసుకురాకపోతే ఏంటి నువ్వు ఫ్యామిలీతో వచ్చావ్ కదా అని అంటాడు. దానికి దేవా అమ్మవాళ్లతో తను వచ్చింది అన్న అంటాడు. నువ్వు తను నీకు ఇష్టం లేదు అంటావ్.. ఇక్కడ చూస్తే అలా లేదు అని పురుషోత్తం అంటాడు. దానికి దేవా తనతో అదే సమస్య అన్న వద్దు అన్నా వినదు అని దేవా చెప్తాడు. ఇక దేవాని పురుషోత్తం వెళ్లిపోమని చెప్తాడు. పురుషోత్తం తన మనిషితో ఆదిత్య చెప్పింది కరెక్టేరా దేవా, మిథున కలిసి ఉంటే మిథున దేవాని నా దగ్గరకు రానివ్వదు అని అంటాడు. గుడిలోనే దేవాని చంపేయాలని పురుషోత్తం అనుకుంటాడు.

మిథున, సూర్యకాంతం ముత్తయిదువులకు కుంకుమ పెడతారు. ఇంతలో మిథున పుట్టింటి వాళ్లు వస్తారు. మిథున చాలా సంతోషపడుతుంది. అలంకృత అక్కతో మీకు ఇంకో సర్‌ఫ్రైజ్ అని చెప్పి మిథున ఫ్రెండ్స్‌ని చూపిస్తుంది. బ్రహ్మముడి కావ్య.. పాపే మా జీవనజ్యోతి సీరియల్‌లో కుట్టీ, మరో సీరియల్ నటి ఆనంది బతుకమ్మ తీసుకొని వస్తారు. వాళ్లని చూసి మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నలుగురు చక్కగా మాట్లాడుకుంటారు. మిథున వాళ్లని అత్తకి పరిచయం చేస్తుంది. కాంతాన్ని చూసి మీ తోటి కోడలు చాలా సరదాగా ఉంది మీకు ఫుల్‌గా టైం పాస్ అనుకుంటా అని అంటారు. నేను విలన్ అనుకుంటే మీరేంటి కామెడీ పీస్ అంటున్నారని కాంతం హర్ట్ అయిపోతుంది.

మిథున ఫ్రెండ్స్ దేవుడు ఇచ్చిన మీ భర్త ఎక్కడ అని అడుగుతారు. భార్యగా అంగీకరించని వాడు భర్త ఎలా అవుతాడని త్రిపుర అంటుంది. నీ బంధం గెలిపించుకోవడానికి చాలా కష్టపడుతున్నావని కావ్య అంటుంది. త్రిపుర ఓ చోట ఉంటే త్రిపుర చేతి బంగారు గాజులు కాంతం తీసుకుంటుంది. మిథున కొట్టకుండానే చెంప పగులేలా చేస్తుంది. అందరిలో మిథున పరువు పోవాలని కాంతంతో త్రిపుర చెప్తుంది. అప్పుడే ఓ జంట ఓ కంకణాన్ని తరతరాలుగా అమ్మవారిగా భావిస్తున్నాం అని బతుకమ్మ ఆడినప్పుడు అమ్మవారి దగ్గర పెట్టాలని మాట్లాడుకుంటారు. త్రిపుర అది వింటుంది. ఆ కంకణం కాంతానికి చూపించి అది మాయం చేసి ఆ క్రెడిట్ మిథున అకౌంట్‌లోకి వేయమని అంటుంది. దేవా కొంతమందితో మాట్లాడుతున్న దేవా దగ్గరకు వెళ్లి చేతికి కంకణం కట్టమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget