Nuvvunte Naa Jathaga Serial Today May 28th: నువ్వుంటే నా జతగా సీరియల్: బామ్మ వెళ్లిపోవడంతో మొదలైన రణరంగం.. మిథున ప్రశ్నలకు తలదించుకున్న ఇంటి పెద్ద!
Nuvvunte Naa Jathaga Today Episode బామ్మ వెళ్లిపోగానే మిథునని దేవా, సత్యమూర్తి ఇంటి నుంచి పంపేయాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today ఉEpisode మిథున దేవాని ప్రేమిస్తున్నానని దేవా కూడా తనని ప్రేమిస్తున్నాడని గుర్తిస్తుంది. అద్దం మీద మిథున, దేవా లవ్ బిగన్స్ అని రాసుకొని మురిసిపోతుంది. ఉదయం సూర్యకాంతం, శ్రీరంగం డ్యాన్స్‌లు చేస్తారు. ప్రమోదినిని కాంతం పట్టుకొని గిరగిరా తిప్పేస్తుంది. ఏమైందని అని ప్రమోదిని అడుగుతుంది. కనుక్కో చూద్దాం అని ప్రమోదినిని కాంతం అంటే ఎవరో నాశనం అయిపోతేనే నువ్వు ఇలా ఉంటావ్ అని అంటుంది.
కాంతం, రంగం ఇద్దరూ డ్యాన్స్‌లు చేస్తారు. కాంతం గెంతులేస్తూ ప్రమోదినితో మిథున, దేవాల మధ్య ఏం జరగలేదు అని వాళ్లకి ఫస్ట్‌నైట్ అవ్వలేదు అని గెంతులేస్తుంది. మిథున మన చెల్లి లాంటిది ఇలా తప్పుగా ఆలోచించడం తప్పని ప్రమోదిని ఇద్దరినీ తిడుతుంది. దేవా జీవితంలో మిథునకు స్థానం దొరుకుతుంది అనుకుంటే ఇలా అయిందేంటి అని ప్రమోదిని బాధ పడుతుంది. ఇక బేబీ బామ్మ దేవా వాళ్ల ఇంటి నుంచి బయల్దేరుతుంది. బేబీ వెళ్లిపోతుందని కాంతం ఎరిగిగంతులేస్తుంది. కొడుకు కోడలితో మీకు మిథున రూపంలో బంగారం లాంటి చిన్ని కోడలు దొరికిందిరా అని అంటుంది. శారద చాలా సంతోషంతో మిథునని చూసి మురిసిపోతుంది. మిథునని కన్న కూతురిలా చూసుకోండి తన వల్ల ఇళ్లు సంతోషంతో మునిగిపోతుందని అంటుంది.
దేవాని బామ్మ పిలిచి నువ్వు చాలా అదృష్టవంతుడివిరా నీకు మంచి భార్య దొరికింది. తన చేయి ఎప్పుడూ వదలకురా ఎందుకు అంటే పోగొట్టుకోవడం సులభమే కానీ తిరిగి దక్కించుకోవడం కష్టం అని అంటుంది. మిథునతో బంగారు తల్లి నీకు ఈ ఇంట్లో ఏ చిన్ని ఇబ్బంది వచ్చినా ఒక్క కాల్ చేయ్ వచ్చేస్తా అని అంటుంది. మిథునతో పంతంతో కాకుండా ప్రేమతో నీ భర్త మనసు మార్చుకో అని అంటుంది. బేబీ బామ్మ బయల్దేరుతుంది. అందరూ బేబీని దగ్గరుండి డ్రాప్ చేస్తారు. సంతోషంగా బేబీ ఇంటి నుంచి వెళ్తుంది.
మిథున తల్లి లలిత తన భర్త, అల్లుడు ఒకర్ని ఒకరు గన్‌లు గురిపెట్టుకోవడం గుర్తు చేసుకొని చాలా భయపడుతుంది. అత్త వచ్చి ఏమైందని అడిగితే ఇటు ఈయన అటు దేవా ఇద్దరూ ఒకరి మీద ఒకరు కోపంతో రగిలిపోతున్నారు అని చెప్పి బాధ పడుతుంది. బామ్మ లలితతో దేవా మిథునలది ఆ దేవుడు నిర్ణయించిన బంధం. కనీసం ముఖ పరిచయం కూడా లేని దేవుడు వాళ్లని ముడి వేశాడు అంటే అర్థం చేసుకో కలకాలం వాళ్లు కలిసే ఉంటారు. మిథున జీవితం బాగుంటుంది. నూరేళ్లు వాళ్లు సంతోషంగా ఉంటారు అంటుంది. త్రిపుర బామ్మ మీద కోప్పడుతుంది. ఆ రౌడీ మిథునకు భర్తా అని అంటుంది. జడ్జి గారి కూతురు అంటే ఆస్థాయిలోనే ఉండాలి. రౌడీతో ఉంటే మన పరువు పోతుంది. మిథున నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుంది అని త్రిపుర అంటుంది.
దేవా బయటకు వెళ్తుంటే కాంతం ఆపి నానమ్మ గారు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆవిడను పంపకుండా ఉన్నావేంటి అని అడుగుతుంది. మిథున మీద మనసు పడి ఆవిడను భార్యగా అంగీకరించావా అని అంటుంది. దాంతో దేవా కోపంగా బయట బట్టలు ఆరేస్తున్న మిథునని లాక్కెళ్తాడు. ప్రమోదిని, శారద అడ్డుకున్నా దేవా వినడు. వాళ్ల ఇంట్లో వదిలేస్తా అంటే నేను వస్తువును కాదు అక్కడ వదిలేయడానికి ఇది నా అత్తారిళ్లు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. కాంతం వచ్చి మీకు దేవాకి శోభనం జరగలేదు అని మాకు తెలుసు మిథున మేడం గారు అని అంటుంది. నేను ఈ గుమ్మం దాటను అని మిథున అంటుంది. సత్యమూర్తి దేవాని కోపంతో ఆ అమ్మాయి చేయి వదులు అంటాడు.
మిథునతో ఎందుకు అమ్మా నీ మూర్ఖత్వంతో నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావ్ ఇక్కడ నుంచి వెళ్లిపో అమ్మా నీతో పాటు మేం కూడా ప్రశాంతంగా ఉంటాం నీ వల్ల ఇంట్లో వచ్చిన సమస్యలు పోతాయి అంటాడు. దానికి మిథున ఇదే మాట మీ అమ్మగారు వచ్చినప్పుడు ఎందుకు అనలేదు సార్ అని ప్రశ్నిస్తుంది. అప్పుడు మీ వ్యక్తిత్వం గొప్పగా కనిపించేది కదా అంటుంది. మీ అమ్మగారు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను మీ దృష్టిలో దేవా భార్యని మీ కోడలిని ఇప్పుడు మాత్రం పరాయి దాన్నా.. అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్ ది లవ్ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్ ప్రశ్నలు!





















