Nuvvunte Naa Jathaga Serial Today May 26th: నువ్వుంటే నా జతగా సీరియల్: నన్ను బజారుది అంటున్నాడు బామ్మా.. మిథునకు కొండంత అండగా బేబీ..!
Nuvvunte Naa Jathaga Today Episode మిథున దేవా తనతో అసహ్యంగా మాట్లాడాడు అని ఏడుస్తూ బామ్మకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిథున ఇద్దరూ కలిసి దాంపత్య వ్రతం చేస్తారు. ఇద్దరినీ చూసి బేబీ బామ్మ చాలా సంబర పడిపోతుంది. ఇద్దరూ వ్రతం పూర్తి చేసి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. పంతులు ఇద్దరినీ నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలి అని దీవిస్తారు. బేబీ ఇద్దరితో ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని బతకాలి అంటుంది. భార్యభర్తలు ఒకరికి ఒకరు అండగా ఉండాలని చెప్తారు. ఇద్దరికీ ముడుపు కట్టమని చెట్టు దగ్గరకు పంపిస్తారు.
మిథున చేతిని దేవా చేతిలో పెట్టి ఇద్దరినీ కలిసి వెళ్లమని అంటారు. ఈ దాంపత్య వ్రతం కచ్చితంగా మీ ఇద్దరినీ కలిపే ఉంచుతుందని నాకు నమ్మకం ఉందని బేబీ అనుకుంటుంది. మరోవైపు సూర్యకాంతం, శ్రీరంగం తిప్పలు పడుతూ ఉంటారు. దేవా మిథున ఇద్దరూ ముడుపు కట్టడం కాంతం చూస్తుంది. ఇద్దరి దగ్గరకు వెళ్లి చాటుగా వాళ్ల మాటలు వింటారు. దేవా మిథునతో ఇదంతా నీ ప్లానే కదా మా నానమ్మతో చెప్పి నన్ను ఇలా ఇరికించావ్ అని అంటాడు. దానికి మిథున నాకేం ఇష్టం లేదు బామ్మ కోసం ఒప్పుకున్నా అంటుంది. మన ఫస్ట్ నైట్ అయితే నా భర్యగా పర్మినెంట్‌గా ఉండాలి అనుకున్నావ్ అని కానీ అది కాకపోయే సరికి ఇలాంటి నాటకాలు అంటాడు. ముక్కూముఖం తెలియని వాడి పక్కన కూర్చొని వ్రతం చేయడానికి సిగ్గులేదా అంటాడు. నువ్వు నా మెడలో తాళి కట్టావ్ నా భర్తతో కలిసి వ్రతం చేయడానికి నాకు తప్పుగా లేదు అంటాడు.
మిథున, దేవాల మధ్య ఏం జరగలేదు అని కాంతం వాళ్లు సరదా పడతారు. దేవా మిథునతో పరాయి మగాడి చేయి తగిలితే ఆడవాళ్లు ఒప్పుకోరు అలాంటిది నువ్వు నాతో హగ్ చేసుకొని కోనేటిలో స్నానం చేయడం.. ఇవన్నీ సిగ్గుగా లేదా అంటే దేవా నువ్వు నా భర్తవి అని మిథున అంటుంది. దానికి దేవా నువ్వు నాకు పరాయిదానివే నువ్వు నా పక్కన కూర్చొని వ్రతం చేస్తుంటే నాకు అసహ్యంగా ఉందని అంటాడు. నిజంగా నీకు సంస్కారం ఉంటే నీకు అలాగే ఉండాలి కానీ నువ్వు పరాయి మగాడితో కూర్చొని వ్రతం చేశావు అంటే నీ క్యారెక్టర్‌ని ఏమనుకోవాలి అంటాడు. మాటలు జాగ్రత్త అని మిథున అంటుంది. నన్ను నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తే మర్యాదగా ఉండదు అంటుంది. దేవా చాలా దారుణంగా మాట్లాడుతాడు. మిథున ఏడుస్తూ వెళ్లిపోతుంది.
కాంతం, రంగం సంబర పడిపోతారు. మిథున ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. కోనేటి దగ్గర ఏడుస్తుంటే బేబీ అక్కడికి వెళ్తుంది. పిచ్చిదానా కన్నీటిని దాచుకున్న అంత తేలిక కాదు మనసులో బాధ దాచుకోవడం.. అబద్ధం దాచినంత తేలిక కాదు నిజం దాచడం.. అన్నింటి కంటే ముఖ్యంగా ద్వేషించే వ్యక్తిని భరించడం కష్టం నాకు అన్నీ తెలుసు.. దేవా నీ మెడలో బలవంతంగా తాళి కట్టడం అన్నీ నాకు తెలుసు అని బేబీ అంటుంది. చదువుకున్న అమ్మాయివి తెలివైన అమ్మాయివి అలాంటి నువ్వు ముక్కూ ముఖం తెలియని వ్యక్తి కట్టిన తాళి కోసం వచ్చేశావు అనగానే నా దృష్టిలో ఆకాశమంత ఎదిగిపోయారు. కోడలి స్థానం కోసం ఆ ఇంట్లో యుద్ధం చేశావ్. కానీ నీ భర్త స్థానం గెలిచుకోలేకపోయావ్. అదే నాకు బాధగా ఉంది అని అంటుంది.
మిథున బామ్మతో ఏదో ఒక రోజు తన మనసులో స్థానం గెలుచుకుంటా అని నమ్మకం ఉంది కానీ నిన్న ఈరోజు జరిగిన సంఘటనల వల్ల నమ్మకం కోల్పోయాను అని శోభనం గదిలో ఈ రోజు దేవా మాటలు గురించి చెప్పి బాధ పడుతుంది. మనసులు కలవని వ్యక్తితో శోభనం అనగానే నాకు నచ్చలేదని కానీ ప్రమోదిని అక్క మాటలతో సంతోషంగా వెళ్లానని కానీ అతను నన్ను బజారు మనిషిలా మాట్లాడాడని నా వ్యక్తిత్వం కించపరిచేలా చాలా అసహ్యంగా మాట్లాడాడు అని ఏడుస్తుంది. అతను బండరాయి అని అలాంటి మూర్ఖుడ్ని నేను ఎలా మార్చుకోవాలి అని ఏడుస్తుంది. దానికి బేబీ ఎంతసేపు నా మెడలో తాళి కట్టాడు అని పోరాడావే తప్ప దేవాని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో వాడికి అర్థమయ్యేలా చేయడం లేదని అంటుంది. దేవా తాళి కట్టాడు అనే తప్ప దేవాని నేను ప్రేమించలేదు అని మిథున అంటే అదే నీకు అర్థం కావడం లేదు.. దేవా కాళ్లకి ముళ్లు గుచ్చితే ఏడ్చావ్. తిడతే పడ్డావ్.. అవమానిస్తే ఓర్చుకున్నావ్.. మీ ఇన్ని రోజులు ప్రయాణంలో నువ్వు దేవాని ప్రేమించావ్.. నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా దేవా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని బేబీ అంటుంది.
మిథున బామ్మ అన్నీ తెలుసు మీరు ఇలా మాట్లాడుతారేంటి.. నా పేరు, నీడ కూడా నాకు నచ్చని తను నిన్ను ప్రేమించడం ఏంటి అంటుంది. నేను నిరూపిస్తా అని చెప్పి నీకు ఈత వచ్చా అని అంటుంది. మిథున రాదు అనగానే అది చాలు అని మిథునని కోనేటిలో తోసేస్తుంది. దేవాకి కేక వేసి మిథున నీటిలో పడిపోయింది అని చెప్తుంది. దేవా మిథున అంటూ పరుగున వచ్చి కోనేటిలో దూకేస్తాడు. బేబీ చూసి ఇంత ప్రేమ పెట్టుకొని కథలు పడతారా అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















