Nuvvunte Naa Jathaga Serial Today May 23rd: నువ్వుంటే నా జతగా సీరియల్: బేబీ మిథున, దేవాల్ని శాశ్వతంగా కలుపుతుందా.. దేవాలో మార్పు వస్తుందా!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా, మిథునలతో గుడిలో ఏం చేయిస్తున్నారో తెలుసుకోవాలని వచ్చిన కాంతాన్ని బామ్మ చూసి వాయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథునల్ని కలపడానికి బేబీ ఇద్దరితో దాంపత్యవ్రతం చేయించాలని అనుకుంటుంది. ఇద్దరిని గుడికి తీసుకొస్తుంది. ఇద్దరిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తుంది. దేవా కాళ్లకి కొబ్బరి చిప్ప తగిలి విలవిల్లాడిపోతాడు. మిథున దేవాని కూర్చొపెట్టి దేవాకి సపర్యలు చేస్తుంది. బామ్మ మనసులో మీ ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది కానీ అది తెలుసుకోవడం లేదు అని అనుకుంటుంది.
బేబీ: ఓరేయ్ మనవడా ఒక వ్యక్తికి మన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఆ వ్యక్తి మన కోసం పెట్టుకున్న కన్నీళ్లే సాక్ష్యం అంటారు. నీ భార్యకి నువ్వు అంటే ఎంత ఇష్టమో తన కన్నీళ్లే చెప్తున్నాయిరా. నీకు చిన్న దెబ్బ తగలగానే ప్రాణం పోయినంతలా విలవిల్లాడిపోయిందిరా. ఇది ఒక్కటి చాలురా మీ బంధం కోసం. ఎన్ని జరిగినా ఈ ప్రేమ మిమల్ని కలిపే ఉంచుతుంది కానీ పొరపాటున కూడా విడదీయదురా. నీకు కూడా తెలీదమ్మా వాడు అంటే నీకు ఎంత ప్రేమో వాడికి ఏమైనా జరిగినప్పుడు ఇదిగో ఇలా బయటకు వస్తుంది. మీరు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీరు మీ మనసుల్లో ఆ బంధాన్ని మరింతగా ముడి వేసుకున్నారు. ప్రస్తుతానికి మీకు ఆ బంధం గురించి తెలీడం లేదు కానీ భవిష్యత్‌లో నా మాటలు మీరు గుర్తు చేసుకుంటారు. సరే సరే వ్రతానికి టైం అయింది బట్టలు మార్చుకొని రండి.
మరోవైపు కాంతం, రంగం ఇద్దరూ గుడి మొత్తం తిరుగుతారు కానీ దేవా, మిథునల్ని కనిపెట్టలేక అలిసిపోతారు. కాంతాన్ని చూసిన బేబి చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది. దేవా మిథునలు బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. ఆ గదికి ఒకటే డోర్ ఉంటుంది. దేవా ముందు వెళ్తాడు. మిథున అక్కడే నిల్చొని తడబడుతుంది. మరోవైపు బామ్మ కాంతం మీద చేయి వేస్తుంది. కాంతం రంగం అనుకొని తిట్టేస్తుంది. బామ్మని చూసి షాక్ అయిపోతుంది. రంగం కూడా షాక్ అవుతాడు. దేవా బట్టలు మార్చుకొని వచ్చేస్తాడు. మిథున డోర్ సౌండ్ చేసి డోర్ లేదని సైగ చేస్తుంది. దాంతో దేవా ఏం మాట్లాడకుండా బయట సెక్యూరిటీగా ఉంటాను అన్నట్లు నిల్చొంటాడు. మిథున దేవాని ప్రేమగా చూసి వెళ్లిపోతుంది.
బామ్మ కాంతాన్ని వాయిస్తూ ఇక్కడేం చేస్తున్నావ్ అంటే దేవుడిని వెతుకుతున్నా అని కాంతం అంటుంది. రంగం కాంతం పని అయిపోయిందని అనుకుంటాడు. తర్వాత రంగాన్ని పిలుస్తుంది. ఎందుకు వచ్చారు అంటే నా కడుపున పిల్లలు పుట్టాలని కోరుకొని వచ్చాం అంటుంది. పొర్లు దండాలు పెడితే మీ కోరిక తీరుతుందని బామ్మ చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. మిథున రెడీ అయి వస్తుంది. దేవా బయటే ఉంటాడు. దేవా మిథునతో మా నాన్నమ్మ పోరు పడలేక వ్రతానికి ఒప్పుకున్నా దీన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని అంటాడు. నటించాల్సిన అవసరం నాకు లేదు నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని మిథున అంటుంది. దానికి దేవా ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటాడు. దానికి మిథున నాకు ఏం జరిగినా నువ్వు ఇలాగే ఫీలవుతావ్ అంటాడు. నీకు ఏం జరిగినా నేను పట్టించుకోను అంటాడు.
కాంతం, రంగం పొర్లు దండాలు పెడుతూ బామ్మని తిట్టుకుంటారు. పారిపోదాం అని రంగం అంటే వద్దు మిథున వాళ్ల గురించి తెలుసుకునే వరకు తగ్గేదే లే అంటుంది. మరోవైపు వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. ఇద్దరూ పీటల మీద కూర్చొంటారు. పంతులు భార్యభర్తలకు బొట్టు పెట్టుకోమని అంటారు. బామ్మ చెప్పడంతో దేవా పెడతాడు. మిథున కూడా దేవాకి కుంకుమ పెడుతుంది. తర్వాత ఇద్దరికీ కంకణాలు కట్టుకోమని అంటారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకొని కట్టుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















