Nuvvunte Naa Jathaga Serial Today May 21st: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా, మిథునల్ని ఒకటి చేయడానికి రంగంలోకి దిగిన బామ్మ.. గుడిలో స్టార్ట్!
Nuvvunte Naa Jathaga Today Episode ప్రమోదిని, శారదల ద్వారా మిథున, దేవాల బంధం గురించి పూర్తి నిజం బామ్మ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా తనని తప్పుగా అర్థం చేసుకున్నాడని తల్లిదండ్రులకు నీ కోసం శత్రువుని అయ్యాను ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఫొటోలు చూస్తూ మాట్లాడుతుంది. దేవా మిథున వెనకాలే నిల్చొంటాడు. దేవా కోపంతో ఆ ఫొటోలు చింపేస్తాడు. నా జీవితంలో నువ్వు భార్యగా ఉండటం ఈ జన్మలో జరగదు. నేను నీతో కాస్త దగ్గరగా ఉండటం మా నానమ్మ కోసమే అంతే నువ్వు ఎప్పటికీ నాకు ముక్కూముఖం తెలియని వ్యక్తివి మాత్రమే అంటాడు. మా నానమ్మ వెళ్లిపోయిన మరుక్షణమే నిన్ను పంపేస్తా అంటాడు.
బేబీ బామ్మ ప్రమోదినిని మేడ మీదకు లాక్కొచ్చి దేవా, మిథునల గురించి అడుగుతుంది. దేవా మిథునలు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు.. దేవా బలవంతంగా తాళి కట్టాడు.. తాళి కట్టాడు కాబట్టి అయినవాళ్లని వదిలేసి ఇక్కడికి వచ్చేసింది అని జరిగింది అంతా చెప్తుంది. అందరూ మిథునని ఇక్కడి నుంచి పంపేయాలి అని చూస్తున్నారని చెప్తుంది. మిథున చాలా మంచిది అని బలవంతంగా కట్టిన తాళికి విలువ ఇచ్చి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓపికగా ఉందని మీరే ఏదో ఒకటి చేసి వాళ్లిద్దరినీ ఒకటి చేయండి అని చెప్తుంది.
దేవా పురుషోత్తం దగ్గరకు వస్తాడు. జడ్జికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని నీ జోలికి వస్తే ఎవరినీ వదలను అని చెప్తాడు. ఇంక హరివర్దన్ మీ జోలికి రాడు అని చెప్తాడు. నీకు ప్రమాదం ఉంది దేవా అంటే నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను రెడీ అన్న.. ఈ జీవితంలో తీర్చుకోలేని రుణం ఉండిపోయింది నీ కోసం ఏమైనా చేస్తా అంటాడు. పురుషోత్తం పైకి మంచిగా మాట్లాడి తన రాజకీయ జీవితానికి దేవాని వాడుకుంటా అనుకుంటాడు. మిథున దేవా మాటలు తలచుకొని ఏడుస్తుంది.
బేబీ బామ్మ చాలా సీరియస్‌గా ఉంటుంది. శారదని పిలుస్తుంది. మీ అందరి దృష్టిలో నేను చచ్చిపోయా అనుకున్నారా అని ప్రశ్నిస్తుంది. శారద షాక్ అయిపోతుంది. నా మనవడి జీవితంలో ఇంత జరిగితే నాకు చెప్పలేదు.. మీ అందరికీ నేను పిచ్చి దానిలా కనిపిస్తున్నాఅని అంటుంది. మీ సంతోషం కోసమే మీకు అబద్ధం చెప్పాం అని అంటుంది. మీ చిన్న మనవడు అంటే మీకు ప్రాణం వాడు ఓ అమ్మాయి గొంతు కోశాడని తెలిస్తే తట్టుకోలేరు అని అంటుంది. దేవా మిథునని భార్యగా వద్దు అంటున్నాడు. ఇటు మీ అబ్బాయి అంత సంస్కారం తెలివి అయిన అమ్మాయి దేవాకి కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఎవరికి ఎలా సర్ది చెప్పాలో నాకు తెలీక నాలో నేను చాలా నలిగిపోయాను అని మిథున వల్ల ఇంటి నుంచి చాలా మార్పులు వచ్చాయని చెప్తుంది. మిథునని దూరం చేసుకుంటే ఈ ఇళ్లు కూడా చీకటి అయిపోతుందని అంటుంది.
మిథునని దేవా కోసమే దేవుడు పుట్టించాడు. వాడి జీవితం నుంచి నేను ఎందుకు మిథునని పంపిచేలా చేస్తా వాళ్లిద్దరినీ నేను దగ్గర చేస్తా అందుకు దేవా మనసులో మిథున మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఇద్దరినీ గుడికి తీసుకెళ్తా అని చెప్తుంది. బామ్మ కోసం దేవా మిథునన బైక్ మీద గుడికి తీసుకొస్తాడు. మిథున కింద పడిపోబోతే దేవా పట్టుకుంటాడు. మిథున దూరం అయితే నువ్వు తట్టుకొని బతకలేవు ఆ విషయం నీకు తెలీడం లేదురా అని బామ్మ అనుకుంటుంది. ఇద్దరి మనసుల్లో ఒకరు అంటే ఒకరికి ప్రేమ ఉందని తెలియడానికే మిమల్ని పిలిచాను అనుకుంటుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీని అడ్డు పెట్టుకొని రుక్మిణి తల్లిదండ్రుల పెళ్లిరోజు జరిపిస్తుందా!





















