Nuvvunte Naa Jathaga Serial Today May 20th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున, దేవాల గురించి నిజం తెలుసుకున్న బామ్మ.. చిక్కు ముడిని విప్పుతుందా!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా మిథున గొడవ పడటం ఇద్దరికీ శోభనం అవ్వలేదని పెళ్లి గురించి మాట్లాడుకోవడం బామ్మ వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా బెడ్ మీద పడుకుంటే మిథున టేబుల్ మీద తలవాల్చి కూర్చొనే పడుకుండిపోతుంది. ఉదయం లేచి చూస్తుంది. రాత్రి జరిగిన గొడవ అంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తుంది. ఇక మిథున, దేవాల శోభనం అయిపోయింటుందని కాంతం తెగ ఏడ్చేస్తుంది. ప్రమోదిని కాంతాన్ని తిడుతుంది. మిథున మన కంటే తెలివి అయినది అని మన ప్లేస్ తీసుకుంటుందని అంటుంది.
మిథున అద్దం ముందు నిలబడి ఏడుస్తూ కుంకుమ పెట్టుకొని దాన్ని తుడుస్తుంది. తర్వాత పూలు పెట్టుకొని వాటిని చింపేస్తుంది. చీర నలిగినట్లు చేసి బయటకు వెళ్లాలని అనుకుంటుంది. అదంతా దేవా చూస్తాడు. ఎందుకు అలా చేసింది అని అలా చేయడం వెనక తన ఆలోచన ఉద్దేశం ఏం అయింటాయని దేవా అనుకుంటాడు. పక్కవాళ్ల విషయంలో వేలు పెడితే చంపేస్తా అని కాంతం చెవి పట్టుకొని బామ్మ మెలేస్తుంది. ఇంతలో మిథున బయటకు వస్తుంది. బంగారు తల్లీ అని బామ్మ వెళ్తుంది. అంతా సంతోషంగా జరిగిందా అంటే మిథున తలూపుతుంది. ఏడాదిలో నా చేతిలో పిల్లాడిని పెడతారు కదా అని మురిసిపోతుంది. నా ముద్దుల మనవడి పెళ్లి కల్లారా చూసే అదృష్టం లేదని కానీ మీకు పుట్టబోయే బిడ్డను ఆడిస్తూ సంతోషంగా ఉంటాను. ఆ సంతోషంలో నేను పోయినా పర్లేదు అని అంటుంది.
మిథున ఏడుస్తూ మనసులో మీకు బాధ పెట్టకూడదు అని అబద్ధం చెప్పాను నన్ను క్షమించండి అనుకుంటుంది. ఇంతలో బేబీ మిథున కన్నీరు చూసి ఇంత సంతోషం విషయం చెప్తే ఏడుస్తుంది ఏంటి అని ఆలోచిస్తుంది. మిథున స్నానానికి వెళ్తుంటే దేవా మిథునతో మా నాన్నమ్మకి ఏం చెప్పావ్ మనకు శోభనం జరిగింది అని చెప్పావా అని అడుగుతాడు. మిథున ఏం సమాధానం చెప్పకపోవడంతో దేవా దబాయించి అడుగుతాడు. చెప్పాను అని మిథున అంటుంది. మనకు శోభనం అయింది అంటే నిన్ను ఇక్కడి నుంచి పంపించలేను అని అలా చెప్తున్నావ్ అని నీకు క్యారెక్టర్ లేదు అని మరోసారి నిరూపించావ్ అంటాడు.
నోర్ముయ్ అని మిథున అరుస్తుంది. బామ్మ ఆ మాటలు విని అటు వెళ్తుంది. జరగని శోభనం జరిగింది అని చెప్పావు అంటే నీ క్యారెక్టర్ తెలుస్తుంది అని అంటాడు. బామ్మ షాక్ అయిపోతుంది. నీకు మాట్లాడమే కాదు అర్థం చేసుకోవడం కూడా తెలీదు అని తిడుతుంది. అమ్మమ్మకి ఎందుకు అలా చెప్పానో అర్థం చేసుకోవడం లేదని తిడుతుంది. ఇద్దరూ గొడవ పడటం బామ్మ కల్లారా చూసి షాక్ అయిపోతుంది. బామ్మ చాలా ఆశలు పెంచుకుంటుందని మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అందరం ఆవిడ దగ్గర నాటకం ఆడుతున్నాం అని తెలిస్తే ఆవిడ తట్టుకుంటుందా అని మిథున అంటుంది. ఆ మాటలకు బేబీ బామ్మ గుండె పగిలే అంత షాక్ అవుతుంది.
దేవా మిథునతో మా నానమ్మ బాధ అర్థం చేసుకున్నట్లే నా బాధ అర్థం చేసుకొని వెళ్లిపో మేం ప్రశాంతంగా ఉంటాం అంటాడు. మిథున, దేవాల మాటలు తలచుకొని బామ్మ ఆలోచనలో పడుతుంది. వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే మెడలో తాళి ఎలా ఉంది.. ఎవరూ కోడలుగా చూడటం లేదా.. మిథున మూడు ముళ్ల వెనక ఏదో రహస్య చిక్కు ముడి ఉందని అది తెలుసుకోవాలని అనుకుంటుంది. మిథున తనని ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల్ని శత్రువులుగా మారిపోవడానికి నువ్వు కట్టిన తాళే కారణం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!





















