Nuvvunte Naa Jathaga Serial Today May 19th: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫస్ట్‌నైట్ గదిలో మిథునని దారుణంగా అవమానించిన దేవా.. రొమాన్స్ అంతా ఉత్తిదేనా!
Nuvvunte Naa Jathaga Today Episode తొలిరేయి గదిలో దేవా మిథున క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధునని ఆడవాళ్లు దేవా గదిలోకి పంపిస్తారు. మిధున బామ్మ, అత్తమ్మల ఆశీర్వాదం తీసుకుంటుంది. పాల గ్లాస్‌తో దేవా గదికి వెళ్తుంది. దేవాకి పాల గ్లాస్ ఇస్తుంది. దేవా తీసుకొని తాగుతాడు. మిథున హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత మిథునకు సగం ఇస్తాడు. మిథున తీసుకొని తాగుతుంది.
దేవా: నువ్వు నాకు ఒక ఇష్టం లేని నిజం. ఎందుకు అంటే నేను బలవంతంగా కట్టిన తాళి పట్టుకొని నువ్వు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను గెంటేస్తానా అని చూస్తున్నా. పది నిమిషాల వరకు అలాగే ఉన్నా. కానీ నిన్ను కోల్పోతే అదృష్టంతో పాటు నా లైఫ్ కూడా కోల్పోతాను అని మా అమ్మ చెప్తుంది. నువ్వు నా మంచి కోసం మా ఇంటి కోసం నా తీరు మారాలని అనుకోవడం చూశాక నాకు సంతోషంగా ఉంది. అందుకే నీతో జీవితం పంచుకోవాలని నీతో కలిసి నూరేళ్లు జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నా.
దేవా మాటలకు మిథున దేవా భుజంపై తల పెట్టి పడుకుంటుంది. దేవా దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరూ ఒక్కటైపోయినట్లు కల కని కాంతం గిలగిలా కొట్టుకుంటుంది. నో నో అంటూ మంచం మీద నుంచి కింద పడి కొట్టుకుంటుంది. రంగం షాక్ అయి కాంతాన్ని నీళ్లు తట్టి లేపుతాడు. ఘోరం జరిగిపోయింది హజ్బెండ్ అని మిథునకు దేవాకి శోభనం జరిగిపోయింది అని అంటుంది. మళ్లీ నీరు ముఖం మీద రంగం కొడతాడు. ఇదంతా నీ కల అని చెప్తాడు. మనం ఏమైనా ఓవర్ చేస్తే మా బామ్మ ఇద్దరినీ ఉతికి ఆరేస్తుందని అంటాడు. ఈసారి నిజంగా దేవా దగ్గరకు మిథున వెళ్లి పాల గ్లాస్ ఇస్తుంది.
దేవా పాల గ్లాస్ తీసుకొని ఇది మనం సగం చేసుకోవాలి ఈ మాట చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పాలు పంచుకోవడానికి మురిపాలు పంచుకోవడానికి నువ్వేమైనా నేను ఇష్టపడిన భార్యవా నీ మీద నాకు కోపం కంటే జాలే ఉంది. నా దృష్టిలో నువ్వు మానసికంగా ఎదగని మనిషివి. నువ్వు అంటే నాకు చాలా గౌరవం కానీ నువ్వు ఇలా పాలగ్లాస్‌తో నా దగ్గరకు వచ్చి నీ క్యారెక్టర్ చంపుకున్నావ్ అంటాడు. మన మాట కలవలేదు.. మనసు కలవలేదు.. ఒకరికి ఒకరు ఇష్టం లేదు అయినా నాతో ఎలా శోభనానికి వచ్చేశావ్ అంటాడు. దానికి మిథున తాళి చూపించి.. మనకు పరిచయం లేకపోయినా నువవు మనది పెళ్లి అని ఒప్పుకోకపోయినా మనది పెళ్లే.. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనది పార్వతి పరమేశ్వరులు దీవించిన బంధం. నేను నీ భార్యని నువ్వు నా భర్త అని చెప్తుంది.
దానికి దేవా పరాయి వాడు తాకితేనే తట్టులేరు కదా మరి పరాయి వాడి గదిలోకి ఎలా వచ్చేశావ్. ఇందుకు కూడా స్కెచ్ వేశావా అని తిడుతాడు. మిథున నోర్ముయ్‌రా నీకు ఎలా కనిపిస్తున్నా బజారు దానిలా కనిపిస్తున్నానా. చిన్నప్పటి నుంచి వెలకట్టలేని విలువలతో పెరిగాను. భూతద్దం వేసుకొని వెతికినా ఒక్క మచ్చ కూడా దొరకదు. గుర్తు పెట్టుకో నువ్వు ఎలాంటి వాడు అయినా నీతో బతకాలి అని వచ్చాను. అలాంటి నీకు నేను క్యారెక్టర్ లేని దానిలా కనిపిస్తున్నానా. కేవలం అమ్మమ్మ మాటల కోసం నీకోసం జీవితం పంచుకోవడానికి వచ్చాను. అలాంటి నీకు నేను బరితెగించిన దాన్ని కనిపిస్తున్నానా.. గుర్తు పెట్టుకో అవసరం అయితే నన్ను నేను చంపుకుంటా కానీ నీ వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్‌ని చంపుకోని అని చెప్తుంది.
దేవా పక్కకు వెళ్లిపోతాడు. మిథున కోపంతో కన్నీరు పెట్టుకుంటుంది. గులాబి రెక్కలు ఊడదీస్తూ శోభనం అయిందా లేదా అని కాంతం అనుకుంటూ ఉంటుంది. దేవా బెడ్ మీద పడుకొని ఉంటే మిథున కింద గోడకు తల వాల్చి పడుకొని ఉంటుంది. ఉదయం మిథున లేస్తుంది. మొత్తం చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!




















