Nuvvunte Naa Jathaga Serial Today May 15th: నువ్వుంటే నా జతగా: మామ అల్లుడి వార్.. ఒకరికి ఒకరు వార్నింగ్స్.. ఫస్ట్‌నైట్‌కి రెడీ అయిన మిథున పరిస్థితి ఏంటి?
Nuvvunte Naa Jathaga Today Episode పురుషోత్తం కోసం దేవా మిథున పుట్టింటికి వెళ్లి మామకి గన్ గురిపెట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తొలిరేయి గురించి ఆలోచిస్తూ ఉంటే అత్త శారద అక్కడికి వస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. దేవా నిన్ను భార్యగా చూడటం లేదు ఈ ఇళ్లు నీకు కోడలి స్థానం ఇవ్వడం లేదు ఇలాంటి టైంలో ఈ తంతు ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావ్ అని నాకు తెలుసు. కానీ దేవుడు నీ పోరాటానికి ఓ అవకాశం ఇచ్చాడు. ఈ తంతు జరిగితే నువ్వు దేవాకి భార్య అయిపోయినట్లే ఈ ఇంటికి కోడలు అయిపోయినట్లే.. అప్పుడు నిన్ను కాదని నిన్ను వెళ్లిపోమని ఎవరూ చెప్పలేరని అంటుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మానసికంగా స్థిరపడు అని చెప్తుంది.
దేవా పురుషోత్తం మాటలు తలచుకొని ఆవేశంగా హరివర్దన్ ఇంటికి బయల్దేరుతాడు. తనతో పాటు తెచ్చుకున్న గన్ తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. హరివర్దన్ హరివర్దన్ అని అరుస్తూ పిలుస్తాడు. జడ్జి ఇంటికి వచ్చి పేరు పెట్టి పిలుస్తావ్ ఎంత ధైర్యంగా వీధి రౌడీ అని తిడుతాడు హరివర్దన్ దానికి దేవా మీ కూతురి కోసం మా పరుషోత్తం అన్న మీద పాత కేసులు అన్నీ తిరగేసి అరెస్ట్ చేయించడానికి సిగ్గులేదా అని అడుగుతాడు. దాంతో హరివర్దన్ దేవా కాలర్ పట్టుకుంటాడు. వాళ్లూ వీళ్లని బెదిరించి చిల్లర బతుకు బతికే నీకు నన్ను ప్రశ్నించే హక్కు ఉందా అని జడ్జి అంటారు. మీ కూతుర్ని నేనేం ఆపడం లేదు అని అంటాడు. దానికి త్రిపుర నువ్వు కట్టిన తాళి వల్ల మిథున మా ఇంటికి రావడం లేదు అని అంటుంది.
హరివర్దన్ దేవాని ఇంటి నుంచి వెళ్లిపోమని లేదంటే జడ్జి ఇంటి నుంచి వచ్చి బెదిరించినందుకు అరెస్ట్ చేయిస్తా అంటాడు. పురుషోత్తం అన్న జోలికి వచ్చినా తన రాజకీయ జీవితం నాశనం చేయాలని చూస్తే ఊరుకోనని అంటాడు. తేడా వస్తే విధ్వంసం చేస్తా అంటాడు. దాంతో హరివర్దర్ ప్రాణాలతో బయటకు వెళ్లాలి అనే నాతో ఇలా మాట్లాడుతున్నావా అని గన్ గురిపెడతాడు. దాంతో దేవా కూడా హరివర్దన్‌కి గన్ గురి పెడతాడు. అందరూ షాక్ అయిపోతారు. హరివర్దన్‌కే గురి పెడతావా అని అని జడ్జి అడిగితే లలిత దేవాని వెళ్లిపోమని అంటుంది. పురుషోత్తం అన్న జోలికి వస్తే చంపేస్తా అని దేవా వార్నింగ్ ఇస్తాడు.
సత్యమూర్తి దేవా, మిథునల తొలిరేయి ముహూర్తం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భార్యని పిలిచి అస్సలు పద్ధతి కాదు అని అంటాడు. ఆ వెదవ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు ఆ తంతు జరిగితే ఆ అమ్మాయికి జీవితమే ఉండదు మా అమ్మతో మాట్లాడి ఎలా అయినా తంతు ఆపేస్తా అంటాడు. కాంతం తిట్టుకుంటూ బామ్మ కాళ్లు పడుతుంది. ఇంతలో సత్యమూర్తి అమ్మ ఆపేద్దాం అంటాడు. శోభనం కార్యక్రమం గురించి మాట్లాడుతున్నా అని అంటాడు. నా మాటకు ఎదురు చెప్తావా అని బామ్మ గుండె పట్టుకొని కూలబడిపోతుంది. ఇప్పుడు మీరు వద్దు అంటున్నారు అంటే ఏదో దాస్తున్నారని అంటుంది. అలాంటిది ఏం లేదని శారద అంటుంది. అదే ముహూర్తానికే కార్యం జరుగుతుంది మీరే ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అంటుంది. ఏం అనకుండా సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిథునని ప్రమోదిని రెడీ చేస్తుంది. మిథున ఏడుస్తూ నా లైఫ్ ఏం అవుతుందో నాకే తెలీడం లేదు జీవితంలో ముఖ్యమైన విషయాలు అన్నీ నా ప్రమేయం లేకుండా అయిపోతున్నాయని బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!




















