Nuvvunte Naa Jathaga Serial Today March 7th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా కోసం శారద దగ్గర కన్నీరు పెట్టుకున్న సత్యమూర్తి.. గాజులతో దివ్య ఎంట్రీ!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా మిధునని ప్రేమతో పెళ్లి చేసుకున్నాడని భానుమతి తల్లితో చెప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చి తనకు పెళ్లి చేయమనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ఇంట్లో జరిగిన గొడవకు మిధున ఏడుస్తుంది. దేవా మేడ మీదకు వెళ్లి పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. మిధున దేవా దగ్గరకు వెళ్తుంది. గాజులు తీసుకున్న విషయం నాకు చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంది.
దేవా: ఏంటి నటిస్తున్నావా. అక్కడ చేయాల్సింది అంతా చేసేసి నా దగ్గరకు వచ్చి నీకు ఏం సంబంధం లేదు అన్నట్లు కవర్ చేస్తున్నావా.
మిధున: అరే ఏంటి నువ్వు నా బాధ అర్థం చేసుకోకుండా నన్ను నటన అంటావా.
దేవా: నీ గాజులు పోయావి అని నట్టింట్లో నానా రచ్చ చేశావ్. మా నాన్న నన్ను కొట్టేలా చేశావు పరాయి వాళ్లు గాజులు కొట్టేసే దొంగని చేశావ్. మొదటి సారి మా నాన్ననా మీద చేయి చేసుకునేలా చేశావ్. నా దగ్గర మాత్రం ఒక్క మాట చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు అని కవర్ చేస్తున్నావ్. నీ అమాయకపు నటనకు నమ్మడానికి నీ కంటిని నేను మరీ అంత సన్నాసిలా కనిపిస్తున్నానా. నాకు ఆ గాజులు పెద్ద మేటర్ కాదు కానీ ఓ అత్యవసరం వల్ల తీసుకున్నా. రెండే రెండు రోజుల్లో వాటిని నీ ముఖాన కొడతా వాటిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపో.
మిధున: దేవా అర్థం లేకుండా మాట్లాడకు కన్నవారిని వదిలేసుకొని వచ్చాను. కోట్ల ఆస్తిని విలాస వంతమైన జీవితాన్ని వదిలేసి వచ్చాను అలాంటి నాకు ఆఫ్ట్రాల్ ఆ గాజులు అంత ముఖ్యం అనుకుంటున్నావా.
దేవా: ముఖ్యం అనే కదా ఇక్కడ ఇంత గొడవ చేశావ్. మా నాన్నకి నా మీద ఇంకా ఇంకా అసహ్యం కలిగేలా చేసింది.
మిధున: దేవా ప్లీజ్ ఏదో ఒక రోల్డ్ గోల్డ్ గాజులు తీసుకురా గాజులు దొరికాయి అని మీ నాన్నకి చెప్తా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
దేవా: అబ్బబ్బా ఎంత బాగా నటిస్తున్నావ్ సమస్య నువ్వే సృష్టించి పరిష్కరించినట్లు నన్ను నమ్మించాలి అనుకుంటున్నావా. నీ మెడలో ఖర్మ కాలి తాళి కట్టినందుకు నన్ను నా ఫ్యామిలీని మనస్శాంతి లేకుండా చేస్తున్నావ్. నేను రౌడీగా జీవితాన్ని ఎంచుకున్నా కూడా మా అమ్మానాన్న ఇంత బాధ పడలేదు. కానీ ఈ రోజు నీ వల్ల బాధ పడుతున్నారు చూడు అది నేను తట్టుకోలేకపోతున్నా. నిన్ను మా నట్టింట్లో చూస్తూ ఓ ఆడ పిల్ల గొంతు కోశానని ప్రతీక్షణం ఏడుస్తున్నారు చూడు అది నా గుండె కోసేస్తుంది.
మిధున: దేవా మా ఇంటి వాళ్లు ఇంతకంటే ఎక్కువ భరిస్తున్నారు. మీ వాళ్ల బాధ అర్థమైన నీకు మా వాళ్ల బాధ ఎందుకు అర్థం కావడం లేదు.
ఇద్దరూ గొడవ పడతారు. ఇక మిధున నా భర్త నువ్వే నా జీవితం నీతోనే అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు శారద భర్త దగ్గరకు వెళ్లి ఎప్పడూ స్కూల్ పిల్లల్ని ఇంట్లో పిల్లల్ని ఏం అనని మీరు దేవా మీద అర్థం లేని కోపం చూపించి చేయి చేసుకొని తప్పు చేశారు అంటుంది. దేవాని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని అంటుంది. ఆడపిల్ల నగలు కొట్టేసిన వాడిని శిక్షించడం తప్పా అని అంటే దానికి శారద వాడు ఏదో బలమైన కారణంతో మంచి పని కోసమే వాటిని తీసుంటాడని అంటుంది. ఎదిగిన కొడుకు మీద చేయి చేసుకొని నా మనసుకి కష్టంగా ఉందని నా కడుపు కోత మీరు అర్థం చేసుకోవడం లేదని అంటుంది. దాంతో సత్యమూర్తి నాకు నా చిన్న కొడుకు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. వాడు మంచి మంచి ర్యాంకులు తీసుకొచ్చి చదువులో ముందంజలో ఉన్నప్పుడు మాస్టారు పరువు ప్రతిష్ట నిలిపే కొడుకు అని ఎంత గర్వంగా ఉండేవాడినో నీకు తెలీదా అని కన్నీరు పెట్టుకుంటారు. నా కొడుకుని మంచి సైంటిస్ట్‌ని చేయాలని నా ప్రతిభకు తెలివికి వాడు నా వారసుడు అని గర్వంగా చెప్పుకునేవాడినని ఇప్పుడు అందరూ మీ చిన్న కొడుకు రౌడీ అని అంటే ప్రాణం పోతుందని అంటాడు. వాడి విషయంలో నీకు కన్నీరు వస్తున్నాయి నాకు రావడం లేదు అని ఏడుస్తాడు.
మరోవైపు భానుమతి దేవా మాటలు తలచుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. తల్లి ఏమైందని అని అడిగితే ఏం కూర అని అడిగి అన్నం వేసుకొని వచ్చి కూర్చొని నాకు సంబంధం చూడు పెళ్లి చేసుకుంటా అంటుంది. దేవాని నేను ఇష్టం లేదంట మిధునని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడంట అని తింటూ ఏడుస్తుంది. కన్నీరు మింగుతుంది. కూతురి బాధ చూసి తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. మిధున బాధగా మూల కూర్చొని ఉంటుంది. కాంతం మెట్టెలు కడుగుతుంటే రంగ వచ్చి జాగ్రత్త వాటిని శుభ్రం చేసి ఫోటో తీసుకో లేదంటే దొంగలు తీసుకుంటారని దేవాని ఉద్దేశించి అంటాడు. మా మాటలు విన్న మిధున తన భర్తని గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని కోప్పడుతుంది. కచ్చితంగా ఏదో అవసరం ఉండే తను తీసుకొని ఉంటారు అని దేవాకి సపోర్ట్ చేస్తుంది. ఇంతలో దివ్య వచ్చి దేవా అన్నయ్య అని పిలుస్తుంది. లేడని శారద చెప్తే పెద్దమ్మ అన్నయ్యకి గాజులు ఇవ్వాలి అంటుంది. అందరూ వాటిని చూసి షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!






















