Nuvvunte Naa Jathaga Serial Today January 2nd: నువ్వుంటే నా జతగా: మిథున పెళ్లి ఆపేసిన దేవా! కల్యాణమండపంలో హైడ్రామా! చివరి నిమిషంలో ట్విస్ట్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode January 2nd దేవా మిథున పెళ్లి దగ్గరకు వెళ్లి తను మిథున భర్త అని చెప్పి మిథున పెళ్లి దగ్గర గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున మీద తనకున్న ప్రేమని బేబీ బామ్మకి చెప్తాడు. నీ మనవడు ఈ రోజు నీ ముందు ప్రాణాలో ఉన్నాడు అంటే కారణం తను.. శత్రువులకు కూడా సాయం చేసే దేవత.. నా దేవత.. తను నా దేవత.. మిథున గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్ నానమ్మ చెప్పు నాన్నమ్మ అని అంటాడు.
బామ్మ దేవాని లాగిపెట్టి కొట్టి ఏంట్రా మిథున నీ దేవతనా.. నీతో ఈ మాట చెప్పించడానికేరా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది.ఈ మాట చెప్పించడానికేరా.. తనని చెడుగా అన్నది.. తన మీద గుండెల్లో ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకురా చేతులారా తనని దూరం చేసుకుంటావ్.. వెళ్లి నీ భార్యని తెచ్చుకోరా.. వెళ్లు.. అని అంటుంది. లేదు నానమ్మ పరిస్థితులు చేయి జారిపోయావి,, నా బాధ మిథునకు చెప్పా.. నా ప్రేమ తన ముందు ఉంచా.. తనతోనే నా జీవితం అని కూడా చెప్పా.. కానీ మిథున నన్ను నమ్మడం లేదు నానమ్మా.. ఒకసారి నీ కోసం వచ్చేసి కన్నవాళ్లని బాధ పెట్టాను.. మరోసారి నీ కోసం వచ్చి వాళ్ల ప్రాణాలు పోయేలా చేయలేను అంది నానమ్మా అని దేవా ఏడుస్తాడు. మిథున అంటే నీకు ఎంత ప్రేమనో తనకు చెప్పావ్,, అలాగే తన కోసం నువ్వు జీవితాంతం నిలబడతాను అని.. ప్రాణం పోయే వరకు చేయి వదలను అనే నమ్మకం కలిగించు,, అవసరం అయితే కాళ్లు పట్టుకో కానీ నీ భార్యని నువ్వు కోల్పోకురా అని చెప్తుంది.
భానుమతి సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది. పెళ్లికి ముహూర్తం దగ్గర పడిందని అబ్బాయిని తీసుకురమ్మని పంతులు చెప్పడంతో దేవా కోసం ఇద్దరు అన్నలు వెళ్తారు. గదిలో దేవా ఎక్కడా కనిపించడు.. కంగారుగా ఆనంద్, శ్రీరంగం వెళ్లి పెళ్లి మండపం మీద ఉన్న తల్లిదండ్రులకు చెప్తాడు. దేవా లేడని తెలిసి అందరూ షాక్ అయిపోతాడు. మళ్లీ పారిపోయాడేమో అని భానుమతి తల్లి అంటుంది. దానికి మా దేవా అలాంటి వాడు కాదు.. మొన్న కూడా ఇలాగే నిందలు వేశారు అని అంటుంది. బట్టలు మార్చుకోవడానికి వెళ్లిన వాడు ఎక్కడికి వెళ్తాడు అని లలిత అంటే దేవా ఇంకెక్కడికి వెళ్తాడు.. మిథున పెళ్లి జరుగుతున్న దగ్గరకు వెళ్లుంటాడు అని సూర్యకాంతం అంటుంది.
భాను చాలా ఏడుస్తుంది. అక్కడికి ఎందుకు వెళ్తాడు అని శారద అంటే ఎంత కాదు అన్నా మిథున దేవా భార్య కదా.. వేరే వాడు తన భార్య మెడలో తాళి కడుతున్నాడని పెళ్లి ఆపడానికి వెళ్లుంటాడు అ ని కాంతం అంటుంది. అందరూ చాలా కంగారు పడతారు. దాంతో సత్యమూర్తి కొడుకులతో అక్కడికి వెళ్దామని చెప్తాడు. సత్యమూర్తి వాళ్లు వెళ్లే టైంకి బేబీ బామ్మ గుండెనొప్పి వచ్చినట్లు నాటకం ఆడుతుంది. ఆ నాటకానికి ప్రమోదిని సాయం చేస్తుంది. దాంతో సత్యమూర్తి వాళ్లు దేవా కోసం వెళ్లకుండా ఆగిపోతారు.
రిషి మిథున మెడలో తాళి కట్టే టైంకి మిథున రిషిని ఆపుతుంది. రిషితో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో దేవా అక్కడికి వస్తాడు. మిథున ఏమైంది అని రిషి అడిగితే మిథున అని దేవా అరుస్తాడు. దేవా అని మిథున పిలుస్తుంది. రౌడీలు దేవాని కొట్టడానికి వెళ్తే దేవా రౌడీలను కొడతాడు. పెళ్లి మండపం మీదకు వెళ్లి కోపంగా చూస్తాడు. హరివర్థన్ గన్ తీసి దేవాకి గురి పెట్టి చంపేస్తారా నిన్ను అని అంటాడు. చంపేయండి సార్ మిథున కోసం నేను చావడానికైనా రెడీ అని దేవా అని జడ్జి దగ్గర గన్ తీసుకొని ఆయనకే గురి పెట్టి అలాగే నా మిథునని నా నుంచి దూరం చేయాలని చూస్తే చంపేయడానికైనా రెడీ అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు.
దేవా గన్ పక్కకి విసిరేస్తాడు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అని రిషి అంటాడు. రాహుల్ దేవాతో ఇక్కడి నుంచి వెళ్లడానికి కాదు తేల్చుకోవడానికి అని అంటాడు దేవా.. అసలు నువ్వు ఎవడ్రా అసలు నీకు ఈ పెళ్లికి ఏం సంబంధం ఉందిరా అని రాహుల్ అంటే నాకే సంబంధం ఉంది.. ఎందుకంటే రిషి తాళి కట్టబోయేది నా భార్య మెడలో అని దేవా అనగానే రిషి బిత్తరపోతాడు. నా భార్య మెడలో వేరే వ్యక్తితో తాళి కట్టిస్తుంటే నేను ఎలా అడ్డుకోకుండా ఉంటాను అని అడుగుతాడు. మిథునకు నీకు ఏం సంబంధం లేదు.. తనని నువ్వు మీ ఇంట్లో నుంచి పంపేశావ్.. అని అంటాడు జడ్జి. దానికి దేవా ఎవరి కోసం నేను మిథునని మా ఇంట్లో నుంచి పంపేశాను అని దేవా అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















